Pages
Showing posts with label mahesh babu. Show all posts
Showing posts with label mahesh babu. Show all posts
Super Star Mahesh Babu Childhood Photos & Rare Unseen Family Pics_Celeb Centre
బిచ్చగాడు ఇప్పుడు కోటీశ్వరుడయ్యాడు!

ఇటివలే మహేష్ బాబు నటించిన తాజా చిత్రం "బ్రహ్మోత్సవం". భారీ తారాగణం, భారీ వ్యయంతో ఈ చిత్రాన్ని నిర్మించారు. అభిమానులో కూడా ఈ చిత్రంపై భారీగానే అంచనాలు ఉండేవి. కానీ అందరూ అనుకున్నట్లు ఈ చిత్రం భారీ హిట్ సొంతం చేసుకోలేకపోయింది. రిలీజ్ అయిన మొదటి షో తోనే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. ఈ టాక్ తో ఈ చిత్రం మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది. చూసిన ప్రతి ఒక్కరు సినిమా బాలేదు అని చెప్పేశారు.
అయితే ఇదే సమయంలో బ్రహ్మోత్సవం సరిగ్గా ఆడకపోవడంతో తమిళ అనువాద చిత్రం "బిచ్చగాడు" సినిమాని థియేటర్లలోకి దింపారు. తమిళంలో సూపర్ హిట్ అయిన 'పిచ్చైకారన్' చిత్రాన్ని తెలుగులోకి 'బిచ్చగాడు' గా అనువాదించారు. అయితే ఈ చిత్రాన్ని చాలా మంది విమర్శించారు. బ్రహ్మోత్సవం టైంలో రిలీజ్ చేస్తే ఖచ్చితంగా బిజినెస్ జరగదు అని భయపెట్టారు. కాని సినిమా కథలో దమ్ము ఉంటే ఖచ్చితంగా సినిమా కలెక్షన్స్ భారీ గా వస్తాయి అని ఈ చిత్రం నిరూపించింది. అస్సలు ఎలాంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేస్తుంది.
ఈ చిత్రాన్నికి వచ్చిన కలెక్షన్స్ చూస్తే షాక్ అవ్వడం ఖాయం. విజయ్ ఆంటోని హీరోగా తెరకెక్కిన ఈ బిచ్చగాడు చిత్రం కేవలం 40 లక్షల రూపాయలతో తెలుగు డబ్బింగ్ హక్కులతో ఈ సినిమాను సొంతం చేసుకున్నారు చదలవాడ శ్రీనివాసరావు. ఇప్పటి వరకు దాదాపుగా 8 కోట్లపైగానే ఈ చిత్రం కలెక్షన్స్ వసులు చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఇంత చిన్న బడ్జెట్ తో రిలీజ్ అయ్యి ఇంతటి కలెక్షన్లు రాబట్టడం చాలా గ్రేట్ అంటున్నారు సినీ పండితులు. అయితే భారీ అంచనాలతో రిలీజ్ అయిన మహేష్ చిత్రం ఎలాంటి కలెక్షన్స్ రాబట్టలేక బిచ్చగాడిగా మిగిలిపోయింది. అసలు అంచనాలే లేకుండా రిలీజ్ అయిన బిచ్చగాడు మూవీ కలెక్షన్లతో బ్రహ్మోత్సవం జరుపుకుంటుంది.
Subscribe to:
Posts (Atom)