Clsr

Recent Posts

Showing posts with label News Commentary. Show all posts
Showing posts with label News Commentary. Show all posts

కేసీఆర్ – చారిత్రక అనివార్యత


images
ప్రజలు ప్రకృతి వేర్వేరు కాదేమో. సహజ న్యాయం, సామాజిక న్యాయం పక్కపక్కనే ఉంటాయేమో. ప్రకృతిని, ప్రపంచాన్ని శాసించగలం అని విర్ర వీగినప్పుడు అదే ప్రకృతి విరుచుకుపడి మనలను ముంచేయడం చూశాం. భూమిని మింగాలని చూసినప్పుడు భూమి మనలను మింగేయడం చూశాం. ప్రజలకంటే నేనే గొప్ప అనుకున్నవాళ్లను అదే ప్రజలు పాతాళంలోకి తొక్కడం చూశాం. ఎవరు ఎక్కడ ఉండాలో ప్రజలు నిర్ణయించడంలో ఆంతర్యం ఇదేనేమో. ‘అక్కడ చంద్రబాబు గెలిచి, ఇక్కడ కేసీఆర్ గెలవకపోయి ఉంటే మన పరిస్థితి ఏమిటి?’ అని ఒక మిత్రుడు యథాలాపంగా ప్రశ్నించాడు. కానీ ఆ ప్రశ్నలో భయం ఉంది. ఆందోళన ఉంది. ఎందుకంటే తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడు మాటల్లో ఇంకా ఆధిపత్య మనస్తత్వం పోలేదు. ఆ అహంకారం నశించలేదు. కేసీఆర్ తన వద్ద పనిచేసిన వాడంటారు. 2019లోనో, ఇంకా ముందేనో తెలంగాణలో అధికారంలోకి వస్తానంటాడు. తెలుగు ప్రజలను తిరిగి ఏకం చేస్తానంటాడు. ఇక్కడ అక్కడ తానే అభివృద్ధి చేస్తానంటాడు. కేసీఆర్‌కు అభినందనలు చెప్పడానికి కూడా ఆయనకు మనస్కరించలేదు. ఆయన జాతీయ పార్టీ నాయకుడిననుకుంటున్నాడు. చంద్రబాబు నాయుడుకు ఒక విధంగా తెలంగాణ ప్రజలు రుణపడి ఉండాలి. చంద్రబాబు కత్తి అలా తెలంగాణపై వేలాడుతూ ఉండాలి. తెలంగాణ ఉద్యమస్ఫూర్తిని అది సజీవంగా ఉంచుతుంది. తెలంగాణ ఉద్యమాన్ని ఇక ముందు కూడా కొనసాగించాల్సిన అవసరాన్ని ఎప్పటికప్పుడూ గుర్తు చేస్తూ ఉంటుంది. తెలంగాణకు కేసీఆర్ ఎందుకు అవసరమో, ఎంత అవసరమో తెలియజేస్తూ ఉంటుంది. చంద్రబాబు పెద్ద షో మాస్టర్. ఆయన షోను 70ఎంఎం డీటీఎస్‌లో చూపించడానికి ఒక పెద్ద ప్రసార, ప్రచార యంత్రాగం రెడీగా ఉంటుంది. అభివృద్ధికి ఆయనను నమూనాగా చూపించే ప్రయత్నం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. హైదరాబాద్‌లో మొదటి ఎస్‌టీపీఐని 1991లోనే హైద్రబాద్‌లోని మైత్రివనంలో ప్రారంభించింది కాంగ్రెస్ ప్రభుత్వమని ఎవరూ గుర్తు చేయరు. మరో ఎస్‌టీపీఐకి 1992లోనే మాదాపూర్‌లో శంకుస్థాపన జరిగిందని ఎవరికీ తెలియదు. ఎవరికీ తెలియకుండా చరిత్రను కమ్మేయడంలో చంద్రబాబు, ఆయన మీడియా బ్యాండు సిద్ధహస్తులు.
హైదరాబాద్‌లోనూ, దేశంలోని మరో పద్నాలుగు నగరాల్లోనూ ఐటీ అభివృద్ధికి పునాదులు వేసింది ఎస్‌టీపీఐ విధానమేనని ఇవ్వాళ చాలకొద్ది మందికి తెలుసు. చంద్రబాబు రాజకీయాల్లోకి రాక ముందు నుంచే ఈ దేశంలో, రాష్ట్రంలో సీఎంసీ అనే సంస్థ కంప్యూటర్ సేవలు అందిస్తున్నదన్న సంగతి చాలామందికి తెలియదు. చెప్పుకునే తెలివి తేటలూ, చెపితే ప్రచారం చేసే యంత్రాగం కాంగ్రెస్‌కు లేవు. చంద్రబాబు వచ్చిన తరువాత పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలకు భూములిచ్చి హైదరాబాద్‌కు తీసుకొచ్చిన మాట నిజం. కానీ కంప్యూటర్ కనుగొన్నది ఆయనే అన్నట్టుగా జరిగిన ప్రచారం చరిత్రకు మసి పూసింది. అసలైన పరీక్ష ఇప్పుడు మొదలవుతుంది. ఇప్పుడు ఆయన ఒక కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి. ఇక్కడ తెలంగాణకు ‘ఆయన వద్ద పనిచేసిన’ కేసీఆర్ ముఖ్యమంత్రి. ఎవరు ఏమి చేయబోతున్నారన్న అంశాన్ని ప్రజలు వేయికళ్లతో కనిపెడుతుంటారు. 1999లో తన పార్టీ మద్దతు తప్పని సరిగా అవసరమైనప్పుడు చంద్రబాబు ఎన్‌డీఏ ప్రభుత్వంలో చేరలేదు. ఐదేళ్లు టీడీపీ ఎంపీలను ప్రభుత్వానికి దూరంగా ఉంచారు. ఇప్పుడు ఎన్‌డీఏకు చంద్రబాబు మద్దతు అవసరం లేదు. అయినా అందరికంటే ముందుగా ప్రభుత్వంలో చేరతానని ప్రకటించారు. ఈ ఉత్సాహమే తెలంగాణవాదులను కలవరపెడుతున్నది. ఎన్‌డీఏను అడ్డం పెట్టుకుని చంద్రబాబు ఏమయినా సమస్యలు సృష్టిస్తారేమోనన్న అనుమానం తెలంగాణవాదుల్లో ఉంది. ఇటువంటి పరిణామ దశలో తెలంగాణలో కేసీఆర్ నాయకత్వంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పడడం చారిత్రక అనివార్యత. తెలంగాణ ఎలా దెబ్బతిన్నదో, ఎందుకు దెబ్బతిన్నదో, ఏమి చేస్తే తెలంగాణ బాగుపడుతుందో తెలిసినవారు కేసీఆర్. పద్నాలుగేళ్లు అన్ని రాజకీయ తుపాన్లను తొణకక బెణకక ఎదుర్కొనే స్థైర్యం ఉన్నవారు ఆయన. ఎక్కడ నిలబడాలో, ఎక్కడ తగ్గాలో తెలిసినవారాయన.
కేసీఆర్ పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయకపోవడం ఎంత సమంజసమో ఎన్నికల ఫలితాలు రుజువు చేశాయి. కాంగ్రెస్ నెత్తిన ఎంత పాపభారం ఉందో ఆ పార్టీ అపజయం చెప్పకనే చెబుతున్నది. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పుణ్యం కూడా జయించలేనంత అప్రతిష్టను ఆ పార్టీ మూటగట్టుకున్నది. కేసీఆర్ ఒకవేళ కాంగ్రెస్‌తో విలీనం అయితే తెలంగాణలో బీజేపీ-టీడీపీలు అధికారంలోకి రాకపోయినా బలమైన ప్రతిపక్షంగా బలపడి ఉండేవి. కాంగ్రెస్ వ్యతిరేక గాలి ఇంకా గట్టిగా కొడితే బీజేపీ-టీడీపీలు అధికారంలోకి కూడా వచ్చి ఉండేవి. విలీనాన్ని, పొత్తులను తోసిపుచ్చి కేసీఆర్ తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ కాంక్షను కాపాడారు. పద్నాలుగేళ్లు అవిశ్రాంతపోరాటం చేసిన తెలంగాణవాదుల ఆత్మకు శాంతిని, ఊరటను చేకూర్చారు. కొత్త రాష్ట్రంలో కొత్త రాజకీయాలకు శ్రీకారం చుట్టారు. ‘రాష్ట్రం.. రాష్ట్రం అన్నారు. ఏం సాధించారు? ఉపన్యాసం ఇవ్వకుండా సూటిగా చెప్పండి’ అని ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటిరోజు పదవీ విరమణ చేసిన ఒక సీనియర్ అధికారి నిలదీశారు. ఇంకా ఇటువంటివారు చాలామందే ఉండి ఉంటారు. హైదరాబాద్‌లో ఇంకా చాలామందికి తెలంగాణ ఎందుకు అవసరమో అర్థం కానట్టు ఆయన మాటలను బట్టి తెలుస్తున్నది. ‘అవును…వంద మాటలు అనవసరం. 119 ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీల్లో సుమారు సగం మంది కొత్తవాళ్లు ఎన్నికయ్యారు. అందునా తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వానికి ప్రాతినిధ్యం వహిస్తున్న పార్టీ నుంచి ఎక్కువమంది కొత్తవాళ్లు ఎన్నికయ్యారు. వీరిలో చాలా మంది పేద, మధ్యతరగతివాళ్లు ఉన్నారు. రాజకీయాధికారం సమాజంలోని దిగువ వర్గాలకు ప్రసరిస్తున్నదనడానికి ఇంతకంటే ఉదాహరణ ఏమి కావాలి? 193 తర్వాత రాజకీయాల్లోకి కొత్తనీరును తీసుకువచ్చిన ఘనత తెలంగాణది, కేసీఆర్‌దే’ అని చెబితే ఆయన సమాధానపడ్డారు.
ఇలా ఒక్క రాజకీయాల్లోనే కాదు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో మన పనులు మనం చేసుకోవడం మొదలు పెడితే, ఏడాదిలోపే ఫలితాలు చూపించగలిగితే పరిస్థితిలో ఎంత మార్పు కనిపిస్తుంది? తదుపరి జరుగబోయే సివిల్ సర్వీసు పరీక్షల్లో, గ్రూప్స్‌లో తెలంగాణకు సొంత కేడర్ అధికారులు వస్తే పరిస్థితి ఎంత సానుకూలంగా మారుతుంది? సీమాంధ్ర ఎస్టాబ్లిష్‌మెంట్ నిర్వాకాల కారణంగా చిన్నచిన్న బడ్జెట్‌లు కూడా కేటాయింపులు జరుగక ఆగిపోయిన ప్రాజెక్టులు పూర్తిచేసి ఏడాదిలోపు కొన్ని వందల చెరువులకు నీరివ్వగలిగితే ఎలా ఉంటుంది? సీమాంధ్ర నుంచి విడివడడం వల్ల తెలంగాణ ప్రభుత్వ విభాగాల కేంద్ర కార్యాలయాల్లో, సచివాలయంలో తలెత్తే ఖాళీలకు, విద్యాసంస్థల్లో ఏర్పడే ఖాళీలకు ఏకకాలంలో భారీగా రిక్రూట్‌మెంట్ నిర్వహిస్తే ఎలా ఉంటుంది? తెలంగాణలో రైతులు కరెంటుకోసం, సాగునీటి కోసం లక్షలాదిరూపాయల పెట్టుబడులు పెట్టనవసరంలేని విధంగా వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చగలిగితే, తెలంగాణను విత్తనోత్పత్తి రాష్ట్రంగా అభివృద్ధి చేస్తే పల్లెల్లో ఎన్ని గుణాత్మకమైన మార్పులు వస్తాయి? తెలంగాణ రాష్ట్రం వస్తే చాలా ప్రయోజనాలు పొందుతామని ఇక్కడి ప్రజల్లో భారీ ఆకాంక్షలు ఉన్నాయి. స్వేచ్ఛా ఫలాలు అందరికీ దక్కుతాయని ఆశలు పెంచుకున్నారు. నిధులు, నీళ్లు, ఉద్యోగాలు, వనరులు తెలంగాణ ప్రజలకు అక్కరకు వస్తాయని భావిస్తున్నారు. ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నప్పుడు వాటికి తగినవిధంగా మసలుకోవడం చాలా కష్టంతో కూడిన పని. ఉద్యమాలు నడపడం కంటే ప్రభుత్వాలు నడుపడం చాలా క్లిష్టమైన పని. ఉద్యమకాలంలో మాటలు ఎక్కువగా చెబుతాం, చేతలు తక్కువగా ఉంటాయి. ఇక్కడ మాటలు తక్కువగా చెప్పి చేతల్లో ఎక్కువగా చూపించాల్సి ఉంటుంది. కేసీఆర్ ఆ పనిచేయగలరని తెలంగాణవాదులు నమ్ముతున్నారు. తెలంగాణ అభివృద్ధికి సంబంధించి ఆయనకు ఒక స్పష్టమైన దృక్పథం, ఎజెండా ఉన్నాయి. ఆయన కాకుండా ఇప్పుడు మరెవరు అధికారంలోకి వచ్చినా తెలంగాణకు అన్యాయం జరిగి ఉండేదని తెలంగాణవాదులు భావిస్తున్నారు. సీమాంధ్ర ఆధిపత్య నీడలు తెలంగాణలో కొనసాగినంతకాలం కేసీఆర్ అవసరం తెలంగాణకు కొనసాగుతున్నది. బీహార్ నుంచి విడివడిన తర్వాత జార్ఖండులో లాలూప్రసాద్, నితీశ్‌కుమార్‌ల పార్టీలు అంతరించడానికి ఐదేళ్లు పట్టింది. తెలంగాణవాదులు తప్పులు చేయకపోతే ఇక్కడా అదే జరగడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కేసీఆర్ తొలిసంతకం 15000 కోట్లు


బంగారు తెలంగాణా లక్ష్యంతో కోటి రతనాల వీణ మొదటి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న కేసీఆర్ తొలి సంతకం విలువ ఎంతో తెలుసా..? అక్షరాలా పదిహేను వేల కోట్లు. ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చినట్లుగా లక్ష రూపాయల లోపు వ్యవసాయ రుణాలను టీఆర్ఎస్ సర్కారు మాఫీ చేస్తోంది. కేసీఆర్ ముఖ్యమంత్రి పదవి స్వీకరించగానే తొలి సంతకం ఇదే ఫైలుపై చేయనున్నారు. టీఆర్ఎస్ పార్టీకి అండదండగా నిలిచిన మాజీ ఐఏఎస్ అధికారులు ఏకే గోయెల్, రేవీ రమణాచారి, రామచంద్రుడు, రామ్ లక్ష్మణ్ తదితరులు రైతు రుణ మాఫీ ఫైలును సిద్ధం చేస్తున్నారు. దీన్ని తెలంగాణా అధికార యంత్రాంగం ఫైనల్ చేసి కేసీఆర్ ప్రమాణ స్వీకారం రోజుకు ఆయన ముందు పెట్టబోతోంది. ప్రస్తుతం తెలంగాణాలో వివిధ బ్యాంకుల్లో రైతులు తీసుకున్న పంట రుణాలు  24 వేల కోట్లకు పైమాటే. ఇందులో లక్షల రూపాయల లోపు రుణాలను టీఆర్ఎస్ సర్కారు మాఫీ చేయనుంది. దీంతో 22  వేల మంది అన్నదాతలు లాభపడతారు. ఇక ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా రైతు రుణ మాఫీ ఫైలుపైనే తొలి సంతకం చేయబోతున్నారు. తెలుగుదేశం కూడా ఈ ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీ ఇదే. 2004లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన చేసిన తొలి సంతకంతో ఉచిత విద్యుత్ హామీ అమల్లోకి వచ్చింది. ఇలా తొలి సంతకం హామీలు మన నేతల్ని ఎన్నికల్లో గట్టెక్కిస్తున్నాయి. 

భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవిర్భవిస్తోంది

Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog




తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యసభ ఆమోద ముద్ర కూడా పడింది.. ఇక రాష్ట్రపతి ఉత్తర్వుతో భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవిర్భవిస్తోంది.. ప్రత్యేక రాష్ట్రం కోసం దశాబ్దాల పోరాటం ఫలించి తెలంగాణ ఏర్పడబోతోంది.. ఈ విజయం కచ్చితంగా అమర వీరులకే దక్కుతుంది.. స్వయంపాలన, స్వావలంభణ, ఆత్మగౌరవం కోసం సాగిన ఈ పోరాటం ఎన్నో పాఠాలను నేర్పించింది.. రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వారందరి మధ్య ప్రేమ, ఆప్యాయతలు, సహాయ సహకారాలు కొనసాగినప్పుడే అభివృద్ధి పథంలో కలిసి ముందుకు సాగుతాం.. తెలంగాణ అయినా, సీమాంధ్ర అయినా మనం ముందు భారతీయులం అనే విషయం మరచిపోరాదు.. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు అని గర్విద్దాం.. ఇలాంటి కీలయ సమయంలో ఉభయ ప్రాంతాల మధ్య సామరస్యం చాలా అవసరం.. సోకాల్డ్ రాజకీయ నాయకుల రెచ్చగొట్టే వైఖరి కారణంగానే సమస్యలు వస్తున్నాయి.. ఇలాంటి నాయకులకు ముందు గట్టిగా బుద్ది చెబుదాం..

మౌనం గా ఉండగలరా ??


నేను ఉత్త వాగుడు కాయను అని మా స్నేహితులు అనే వారు.
 వాళ్ళు అన్నారని కాదు కానీ అదేమిటో ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటాను.

కొన్ని సార్లు అతిగా మాట్లాడి స్నేహితులను దూరం చేసుకున్నాను. మన మాటలు ఎదుటి వాళ్ళను నొప్పిస్తాయని కావాలని ఎప్పుడు మాట్లాడలేదు. ఏదో ఆవేశం లో మాటలు దొర్లి పోతుంటాయి. దగ్గరి బంధువులు కూడా నొచ్చుకున్న సందర్భాలు లేక పోలేదు. వయసు పెరిగే కొద్ది అనుభవాలు ఎదురయ్యే కొద్ది వాగుడు తగ్గించేసాను. మాట్లాడకుండా ఉండటం లేదా  అతి తక్కువగా మాట్లాడటం మొదట్లో కష్టం అనిపించింది. తర్వాత అందులో సుఖం అర్ధమైంది. మా వాళ్ళందరూ నాలో మార్పు చూసి ముక్కున వేలేసుకున్నారు.
 వాస్తవానికి  "మౌనం" సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పుకోక తప్పదు. 
పూర్తిగా మౌనం గా ఉండ లేకపోయినా కనీసం ఎక్కువగా మాట్లాడటం తగ్గించుకోవాలి. అయితే కమ్యూనికేషన్ కొత్త పుంతలు తోక్కిననేపధ్యం లో మౌనంగా వుండటం  కానీ
 మాటలు తగ్గించడం కానీ సాధ్యమా ?
అంటే చాలా చాలా  కష్టమే అని చెప్పు కోవాలి. కొంతమందిని చూడండి.ఒక్క నిమిషం కూడా సెల్ ఫోన్ ని వదలరు.బాత్ రూం లో కూడా మాట్లాడుతుంటారు  అసలు మౌనం గా ఉండటానికి లేదా  మాటలు తగ్గించడానికి  చాలా ప్రాక్టీసు అవసరం.  మనసును నియంత్రించాలి.అహాన్ని అణుచు కోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే   పంచేద్రియాల పై పట్టు బిగించాలి.  అప్పుడే మౌనం సాధ్యం అవుతుంది. 
 వాక్కుని నిరోధించడమే మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. 
ఇలా మౌనంగా ఉండటం వల్ల పరుషవచనాలు పలకటం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పటం,  అసందర్భ ప్రలాపాలకు  అవకాశం లభించదు.ఎవరితో ఏ గొడవా  ఉండదు.
 మనసును ప్రశాంతంగా ఉంటుంది.బీపీ షుగర్ లు తగ్గుతాయి.తద్వారా ఖర్చు కూడా తగ్గిపోతుంది.నిజమా అని ఆశ్చర్య పోకండి.నిజమే.
 ప్రపంచంలో మౌనానికి ఉన్న శక్తి దేనికీ లేదు. 
  మన ఆలోచనలను, దృక్పథాలను మనసులో దర్శించుకోవడానికి మౌనం చాలా అవసరం. 
నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన అహం నిద్రాణస్థితిలోకి వెళుతుంది.  అప్పుడు వాస్తవ ప్రపంచాన్ని స్థిమితంగా చూడగలుగుతాం.  అలా చేయడం వల్ల శరీరం నూతన తేజస్సును, కాంతిని పొందగలుగుతుంది.  నిరంతరం మాట్లాడుతూ ఉండటం వల్ల మన చుట్టుపక్కల ఉన్న సౌందర్యాన్ని చూడలేకపోతున్నాం.
 ఎవరితోనైనా వాదించటం కంటె మౌనంగా ఉండటం ఉత్తమం. 
ఇలా ఉండటం వల్ల అనవసరమైన కోపాన్ని నియంత్రించుకోవచ్చు.  ఎప్పుడైతే కోపాన్ని అణచుకోగలుగుతామో, అప్పుడు శరీరభాగాలు విశ్రాంతిదశలో ఉంటాయి.  రక్తప్రసరణలో హెచ్చుతగ్గులు ఉండవు. హృదయస్పందన ప్రశాంతంగా ఉంటుంది.  పలు రోగాలకు దూరం గా వుంటాము.  మన పట్ల కోపం తో ఎవరైనా పెద్దగా అరుస్తున్నప్పుడు కూడా మౌనమే ఉత్తమమార్గం.  అనవసరంగా అరవడం, కోపం తెచ్చుకోవడం వల్ల శరీరం  శక్తిని కోల్పోతుంది.  ఉద్యోగాలు చేసే చోట, చాలామంది ఒకరి మీద ఒకరు నిరంతరం అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు.  అలా అనవసరంగా మాట్లాడటం వల్ల మనసులు కలుషితమవుతాయి.  అందుకని లేనిపోని మాటలు మాట్లాడటానికి బదులు మౌనం శ్రేయోదాయకం.  మౌనం పాటించడాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకుంటే దీనికి మించిన సాధనం లేదు.  ‘మౌనం బంగారం, మాట వెండి’ అన్నారు.  అయితే  అవసరమైన సందర్భాల్లో కూడా మౌనం పాటిస్తే  అనర్ధాలు జరుగుతాయి.అవసరం ఉన్నపుడు క్లుప్తంగా.. సూటిగా చెప్పదలుచుకున్న విషయాన్నీ చెప్పండి.ఎదుటి వారికి విషయం అర్ధం అవుతుంది. మౌనం విలువ ఎలాంటిదో అనుభవిస్తేనే తెలుస్తుంది.ఒక సారి రుచి చూడండి. మౌనం పై మీ అభిప్రాయాలను కూడా తెలియ చేయండి.అంతే గానీ మౌనంగా ఉండకండి.

నాణ్యత తగ్గిన వెంకన్న లడ్డు


సన్మార్గం : మధురం, మహాప్రసాదం... శ్రీవారి నైవేద్యం తిరుపతి లడ్డు అంటే అందరికి ఇష్టమే. తిరుపతి అంటే ముందుగా గుర్తు కొచ్చేది  లడ్డు మాత్రమే. అప్పటి లడ్డు కి ఇప్పటి లడ్డు కి చాలా తేడా ఉంది.తిరుమల వెంకన్నకి  అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం లడ్డు.  భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ఈ లడ్డు ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర. శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. అప్పటికి ఇప్పటికి లడ్డు కి డిమాండ్ ఎంతో ఉంది. పది హేనేళ్ళ  క్రితం ఎన్ని కావాలంటే అన్ని అమ్మే వారు.ఇపుడు ఆ సదుపాయం లేదు. అలాగే లడ్డు లో నాణ్యత కూడా తగ్గిపోయింది.  తిరుమలేశుని లడ్డు, ప్రసాదాల తయారీకి   దేవస్థానం 16 వేల మెట్రిక్ టన్నుల ముడిపదార్థాన్ని కొనుగోలు చేస్తున్నది . ఇందుకోసం టీటీడీ ఏటా సుమారు రూ.175 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. వీటిలో శ్రీవారి లడ్డూ ప్రసాదానిదే సింహభాగం. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం, అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం (క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దూరప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారి గా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపిప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందని చరిత్ర. ఇలా అనేక విధాలు గా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. 5100 లడ్డూలు  తయారుచేయడానికి  ఆవు నెయ్యి 165 కేజీలు, శనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడిపప్పు 30 కేజీలు, ఎండుద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, ఏలకులు 4 కిలోలు వినియోగిస్తారు. మొత్తం మీద 5100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు.
 కాగా తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువు తీరి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు (వంటశాల)కు ముందు వకుళమాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించినచోట పోటు ప్రసాదాలు తయారుచేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. లడ్డు, వడలు మొదలైన పనియారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తరభాగాన తయారుచేస్తారు. వాటిని కూడా తల్లికి చూపించాకే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.
 శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుపతి లడ్డూలు మూడురకాలుగా తయారు చేస్తారు. వీటిని ఆస్థానం లడ్డు, కల్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని పిలుస్తారు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇక కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే రుచిగా ఉంటుంది. దీని ధర రూ.100. మూడవది ప్రోక్తం లడ్డు. ఇదే చిన్న లడ్డు. భక్తులకు లభించే లడ్డు. 175 గ్రాములు బరువున్న దీని ధర రూ.25. లడ్డు ధరల్లో అప్పటికి ఇ ప్పటికి చాలా మార్పులొచ్చాయి. 
 ఈ  లడ్డు ప్రసాదాల అమ్మకం ద్వారా ఏటా దాదాపుగా పది కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయం లభిస్తోంది. అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన తిరుమల వెంకన్న లడ్డు ప్రత్యేకమైన భౌగోళిక గుర్తింపు సాధించింది. చిన్నపుడు ఈ లడ్డు కోసం ఇంట్లో తన్నుకునే వాళ్ళం. తిరుపతిలో ఉద్యోగం చేసినపుడు 
కరువు తీర లడ్లు తిన్నాను. వెంకన్న ఆ అదృష్టం కల్పించాడు. 

Some Important Facts about Tirumala Lord Sri Venkateshwara Swamy





తిరుమల వెంకన్న గురించి కొన్ని నిజాలు 
1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.
2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.
3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.
4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.
5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.
6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.
7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.
8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.
9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.
10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.
11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.

ALL TELUGU NEWS CHANNELS

TELANGANA NEWS CHANNEL LIVE STREAMING