Clsr

Recent Posts

Showing posts with label Aadhaar Guidelines. Show all posts
Showing posts with label Aadhaar Guidelines. Show all posts

ఆధార్ కార్డు పోయిందా ?





చాలా మంది ఆధార్ కార్డు కోసం apply చేసుకొని వుంటారు , కొందరికి ఆధార్ కార్డు వచ్చి ఉంటుంది , కొందరు మరచిపోయి ఎక్కడో పెట్టేసి వుంటారు , మరేఇతర కారణాలవల్ల ఆదార్ కార్డు పోయి వుంటుంది , అలాంటి వారు బయపడవలసిన అవసరం లేదు .

ఈ క్రింది చెప్పిన విదంగా చేసి Duplicate ఆధార్ కార్డు ని పొందవచ్చు ,

1. మొదట UIDAI  contact Centre ( 1800-180-1947 ) కి ఫోన్ చేసి , వారికి మీ ఆధార్ కార్డు పోయినట్లు తెలపాలి. చాలా వరకు ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే busy గా వుంటుంది , అలా busy గా వుండి Line కలవనప్పుడు క్రింది విదంగా చేయండి , మీ అదార్ కార్డు నెంబర్ గుర్తు వుంటే నెంబర్ మరియు address వివరాలు తెలుపడం  ద్వారా డూప్లికేట్ ఆధార్ కార్డు పొందవచ్చు . 

2. ఆధార్ కార్డు పోగొట్టుకోన్నప్పుడు తర్వాతి ప్రత్యామ్నాయం Enrollment Number, మీ  Enrollment Number

 మీ దగ్గర ఉన్నట్లయితే సులభం గా ఆధార్ కార్డు తిరిగి పొందవచ్చు . 

online లో మీ Enrollment Number, date time, మొబైల్ నెంబర్ మొదలగు వివరాలను ఇవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు . ఎలా చేయాలో క్రింది లింక్ క్లిక్ చేయండి .


౩. Enrollment Number, date time, మొబైల్ నెంబర్ మొదలగు వివరాలను కూడా పోగొట్టుకొంటే , ఆధార్ కార్డు రిజిస్టర్ కేంద్రం దగ్గరకు వెళ్లి మీ పేరు , చిరునామాతో వెతికి పొందవచ్చు .

గమనిక : ఆధార్ కార్డు నెంబర్ ను Safe place లో బద్రపరుచుకోండి , 12 అంకెల ఆధార్ కార్డు మీ డైరి లోనో లేదా మొబైల్ లోనో రాసిపెట్టుకోండి . 

ఆన్లైన్ లో ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోండి



మీరు ఆధార్ కార్డు కోసం Apply చేసుకోన్నారా ? లేదంటే వెంటనే Apply చేసుకోండి , Apply చేసుకోన్నవారికి  ఆధార్ కార్డు పోస్ట్ ద్వారా పంపబడుతుంది . కొంతమందికి పోస్ట్ లో రావడం ఆలస్యమవుతుంది , ఇలాంటి వారికోసం ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకొనే సదుపాయం కలిపించబడింది . క్రింద ఇవ్వబడిన Steps Follow అవుతూ మీ ఆధార్ కార్డు ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోండి .

ఆధార్ కార్డు డౌన్లోడ్ చేసుకోవడానికి కావలసినవి :

  • Enrollment Number Acknowldgement form పైన Right Side వుంటుంది )
  • Resident Name (ఆధార్ కార్డు కోసం మీరు దరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరు )
  • Area Pin Code 
  • ఆధార్  లో Register రిజిస్టర్ చేసుకునప్పుడు  మీరు Enter చేసిన మీ మొబైల్ నెంబర్ కలిగిన మీ మొబైల్ 








డౌన్లోడ్ ఎలా చేయాలి : 

  • https://eaadhaar.uidai.gov.in   Open చేయండి 
  • Enrollment Number , Resident Name(ఆధార్ కార్డు కోసం మీరు దరకాస్తు చేసుకొన్న మీ పూర్తి పేరు ) , Area Pin Code , Capcha text Enter చేయండి . (అన్ని వివరాలు సరిగా వున్నాయో లేదో చూసుకోండి )
  • Submit బటన్ పైన Click చేయండి . 

  • ఆధార్  లో Register రిజిస్టర్ చేసుకునప్పుడు  మీరు Enter చేసిన  మొబైల్ నెంబర్ కలిగిన మీ మొబైల్ correct , కాదో (చివరి 3 నంబర్స్ ) అడుగుతుంది , correct అయితే Yes పైన క్లిక్ చేయాలి . తర్వాత  మొబైల్ కి మెసేజ్ వస్తుంది . 
  • మొబైల్ కి వచ్చిన OTP నెంబర్ ని enter చేసి Submit పైన క్లిక్ చేయాలి 
  • తర్వాత వచ్చె స్క్రీన్ లో Download your e-Aadhaar బటన్ పైన క్లిక్ చేస్తే ఆధార్ కార్డు (PDF ఫైల్ ) డౌన్లోడ్ అయిపోతుంది . 
  • PDF ఫైల్ ఓపెన్ చేసేటప్పుడు password అడుగుతుంది ,  Area Pin Code ఎంటర్ చేస్తే ఆధార్ కార్డు ఓపెన్ అవుతుంది 

ఆధార్ కార్డు లోని మీ వివరాలు Update చేసుకొండిలా



ఆధార్ కార్డు లో వివరాలు ( పేరు , చిరునామా , పుట్టిన తేది  ) తప్పుగా ముద్రించ బడినప్పుడు వివరాలు సవరించుకొనే వీలు వుంది , ఈ క్రింది ఇవ్వబడిన లింకు ను ఓపెన్ చేసి , క్రింద ఇవ్వబడిన ప్రకారం వివరాలను సరిచేసుకోవచ్చు .

1. ఈ లింకు ను ఓపెన్ చేయాలి  https://ssup.uidai.gov.in/web/guest/update
2. ఆధార్ నెంబర్ ను మరియు క్రింది Capcha కోడ్ Enter చేసి  Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి
3. తర్వాత Enter your Mobile దగ్గర నెంబర్ Enter చేసి Send OTP బటన్ పైన క్లిక్ చేయాలి  
4.మొబైల్ కి pin , SMS చేయబడితుంది , తర్వాత Enter received OTP pin Enter చేసి Login బటన్ పైన క్లిక్ చేయాలి . 
5. ఏ వివారాలు సరిచేయాలో ఆ Option ను చెక్ చేసి Submit బటన్ పైన క్లిక్ చేయాలి . 

6. తర్వాత వచ్చె Screen లో modify చేయాల్సినవివరాలు enter చేసి , Submit Update Request బటన్ పైన క్లిక్ చేయాలి 

7. తర్వాత వచ్చే స్క్రీన్ లో proof కోసం డాక్యుమెంట్ attachment చేసి , Submit బటన్ పైన క్లిక్ చేయాలి . 
తర్వాత మొబైల్ కి SMS ( URN number ) వస్తుంది . వచ్చిన URN నెంబర్ ద్వారా Update status చెక్ చేసుకోవచ్చు . 

ఆధార్ కార్డు గ్యాస్ మరియు బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిందో లేదో తెలుసుకొండిలా




ఆధార్ కార్డు గురించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి , మన వివరాలు ఎలా update చేసుకోవాలి మరియు ఆధార్ కార్డు పొతే ఏ Help Line ఎలా ఉపయోగించుకోవాలి  తదితర వివరాలు తెలుసుకొన్నాము .

ఆధార్ కార్డు గ్యాస్ తో మరియు బ్యాంకు ఎకౌంటు తో లింకు తప్పని సరిగా చేసుకోవాలి , లేదంటే  సబ్సిడీ పొందలేము . ఇప్పటివరకు చేసుకొని వారు తప్పని సరిగా ముందు ఈ పనిని చేసుకోవాలి .

చేసుకొన్నవారికి మన ఆధార్ కార్డు గ్యాస్ తో మరియు బ్యాంకు ఎకౌంటు తో లింకు అయినదో లేదో తెలుసుకొనే వీలు వుంది . ఈ పనిని మనము గ్యాస్ ఏజెన్సీ కి మరియు బ్యాంకు కు వెళ్లి తెలుసుకోవలసిన పనిలేకుండా ఆన్లైన్ లో ఈ వివరాలు తెలుసుకొనే సదుపాయం కల్పించబడింది . ఎలా చేయాలో చూద్దాం ....

ముందుగా ... ఈ క్రింది బటన్ ని క్లిక్ చేసి సంబందిచిన వెబ్సైటు కు వెళ్ళండి .




ఈ వెబ్సైటు లో మీకు ౩ లింకు లు వుంటాయి , మొదటి లింక్ HP Gas కలిగి వున్నవారికోసం , రెండవది Bharat Gas కలిగి వున్నవారికోసం మరియు మూడవది Indane Gas కలిగి వున్నవారికోసం... 

మీది HP Gas అయితే ఇలా చేయండి ....

ఈ లింక్ పైన క్లిక్ చేయండి లేదా మీ బ్రౌజరు లో url పేస్టు చేయండి :

http://dcmstransparency.hpcl.co.in/TransparencyPortal/Transparency/Transparency.aspx
ఇమేజ్ పెద్దది గా కావాలంటే ఇమేజ్ పైన క్లిక్ చేయండి 

1. మొదట Check your Aadhar Status రేడియో బటన్ క్లిక్ చేయండి
2.Consumer Type లో Domestic select చేయండి
౩.Quick search లో Consumer No మరియు Distributor Name ఎంటర్ చేసి Proceed బటన్ క్లిక్ చేయండి 
    లేదా
4.Normal search లో State,District,Distributor Name మరియు Consumer No ఎంటర్ చేసి Proceed బటన్ క్లిక్ చేయండి     లేదా

5. Aadhaar Number search లో  ఎంటర్ చేసి Proceed బటన్ క్లిక్ చేయండి

క్రింద Image లో చూపబడిన విదంగా - ఆధార్ కార్డు గ్యాస్ కి లింక్ చేయబదివున్నట్లయితే Aadhaar Status with HPCL

క్రింద Submitted (XXXX XXXX 0011) అని చూపబడుతుంది , అంటే మీ అదార్ కార్డు గ్యాస్ తో లింకు చేయబడినట్లు .  

అదేవిదంగా Aadhaar Status in Bank  క్రింద Available అని చూపబడితే మీ ఆధార్ కార్డు బ్యాంకు ఎకౌంటు తో లింకు చేయబడినట్లు . 

Remarks  క్రింద You are good to receive subsidy in your Bank Account వుంటే ... సబ్సిడీ కి మీరు అర్హులు. లేదా Available , Please submit your AADHAAR number to your bank immediately అని వుంటే వెంటనే మీ ఆధార్ కార్డు నెంబర్ ని బ్యాంకు లో submit చేయండి 




అదేవిదం గా Bharat మరియు Indane gas వినియోగదారులు ఈ క్రింది లింకు ల ద్వారా ఆధార్ కార్డు గ్యాస్ మరియు బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిందో లేదో తెలుసుకొండి.

Bharat Gas : http://www.ebharatgas.com/ebgas/CC_include/Transparency_portal_new.jsp
Indane gas : http://indane.co.in/check-aadhaar.php

How to Link Aadhaar Card with Gas Account?

  ఆన్లైన్ లో ఆధార్ కార్డు ని మీ Gas ఎకౌంటు కి లింక్ చేయండిలా




మీరు మీ ఆధార్ కార్డు ని గ్యాస్ ఎకౌంటు తో లింక్ చేసారా ? లేదంటే త్వరగా చేసుకోండి , ఆన్లైన్ లో చేయలేనివారు గ్యాస్ ఏజెన్సీ కి వెళ్లి అక్కడ లింక్ చేసుకోవచ్చు , లేదంటే ఆన్లైన్ లో ఎలా చేయాలో క్రింది ఇవ్వబడిన steps follow అవుతూ 12 అంకెల ఆధార్ కార్డు ని లింక్ చేయండి . కేవలం సులబమయిన 4 steps follow అయి చేసుకోండి , మీ ఫ్రెండ్స్ / బందువులకి కూడా చేసిపెట్టండి .

ఇలా చేయండి : 

ఈ క్రింది ఇవ్వబడిన లింక్ పైన క్లిక్ చేయండి లేదా copy చేసి browser లో Paste చేయండి .

https://rasf.uidai.gov.in/seeding/User/ResidentSelfSeedingpds.aspx

Step 1: Enter your address location లో State తర్వాత District ని select చేసుకోండి 


Step 2: Choose Benefit Type లో ...

Benefit Type - (LPG)  
Scheme Name  - Bharath gas అయితే BPCL , HP gas అయితే HPCL , Indane gas అయితే IOCL select చేసుకోండి 
Distributor Name : మీకు గ్యాస్ supply చేస్తున్న Distributor Name ని లిస్టు నుండి ఎంచుకోండి 
Consumer Number : మీకు గ్యాస్ Consumer Number ని టైపు చేయండి 






Step 3: Enter your details...



దగ్గర Email Id ( email Id వుంటే ఇవ్వండి , తప్పనిసరి ఏమి కాదు ) , Mobile No. మరియు Aadhaar No ఇవ్వండి. తర్వాత submit button పైన క్లిక్ చేయండి 



మీరు ఆధార్ కార్డు రిజిస్ట్రేషన్ చేసుకొనే సమయం లో ఇవ్వబడిన  మొబైల్ కు OTP నంబర్ మెసేజ్ పంపబడుతుంది , 


Step 4: Confirm Request

మీ మొబైల్ కి వచ్చిన OTP నెంబర్ ని మరియు Enter the text shown దగ్గర text ని ఎంటర్ చేయండి .   

Seeding Request Added successfully అని మెసేజ్ వస్తుంది .  

మీ Request రిజిస్టర్ చేయబడుతుంది , సంబందించిన Authority మీ వివరాలు check చేసి మీకు తెలియబరుస్తారు . 

తర్వాత మీ ఆధార్ కార్డు సరిగా లింక్ అయిందో లేదో కూడా Online లో check చేసుకోవచ్చు.