Clsr

Recent Posts

HEALTH TIPS FOR LEGS PAIN IN TELUGU

మోకాళ్ళ నొప్పులకు చిట్కాలు 

1) అల్లం

అల్లంలో అనాల్జెసి మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. మరియు ఇది మోకాళ్ళ నొప్పులను నివారిస్తుంది. కాబట్టి, కొద్దిగా అల్లం నూనెను మోకాళ్ళకు అప్లై చేసి స్మూత్ మసాజ్చేయాలి.అలాగే మీరు కొద్దిగా అల్లం పేస్ట్ ను కూడా అప్లై చేసి తక్షణ ఉపశమనం పొందవచ్చు.



2) యూకలిప్టస్ ఆయిల్:
యూకలిప్టస్ నూనె చాలా సులభంగా అందుబాటులో ఉంటుంది మరియు ఇది ఒక పవర్ ఫుల్ పెయిన్ కిల్లర్ . ఇది కండరాలకు ఉపశమనం కలిగించే గుణంలో ఇందులో ఉంది. ఇది మోకాలుకు రక్తప్రసరణను పెంచుతుంది. అందువల్ల ఇన్ఫ్లమేషన్ మరియు నొప్పిని తగ్గిస్తుంది. నొప్పి ఉన్నప్రదేశంలో ఈ నూనెను నేరుగా అప్లై చేసి, మసాజ్ చేయాలి . మోకాళ్ళ నొప్పులకు ఇది ఒక ఉత్తమ హోం రెమెడీ.
3) కర్పూరం నూనె
కర్పూరం నూనె, చాలా ఎఫెక్టివ్ గా జాయింట్ పెయిన్స్ ను నివారిస్తుంది. చర్మానికి దీనిలో చాలా కూలింగ్ ఎఫెక్ట్స్ కలిగి ఉంటుంది మరియు నొప్పి వల్ల కలిగి చిరాకును కూడా తగ్గిస్తుంది . ఇది కౌంటర్ ఇర్రిటెంట్ గా పనిచేస్తుంది .
4) ఎప్సమ్ సాల్ట్ (మెగ్నీషియం సల్ఫేట్)
ఎప్సమ్ సాల్ట్ లో ఉండే హైలెవల్స్ మెగ్నీషియం మోకాళ్ళనొప్పులను చాలా ఎఫెక్టిగ్ నివారిస్తుంది. ఈ సాల్ట్ ను నీళ్ళలో వేసి, కరిగిన తర్వాత ఈ నీటిలో కాళ్ళను డిప్ చేయాలి . ఇలా చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. ఇంకా మీరు ఈ ఎప్సమ్ సాల్ట్ యొక్క నీటితో స్నానం కూడా చేయవచ్చు.
5) ఎండు ద్రాక్ష
ఎండు ద్రాక్షలో సల్ఫైడ్ ఎక్కువగా ఉండటం వల్లే వాటికి అలాంటి ప్రత్యేకమైన కలర్ కలిగి ఉంటుంది. కాబట్టి, వీటిని తరచూ తినడం వల్ల జాయింట్ పెయిన్ ను నివారిస్తుంది .
6) ఐస్ ప్యాక్
మోకాళ్ళ నొప్పులను తక్షణం నివారించుకోవడానికి ఐస్ ప్యాక్ లేదా కోల్డ్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల నొప్పి తగ్గించబడుతుంది. ఐస్ ప్యాక్ ను పది నుండి ఇరవై నిముషాలు అప్లైచేయాల్సిఉంటుంది.