Clsr

Recent Posts

Some Experiences Occure in Meditation

ధ్యానంలో కలిగే కాన్ని అనుభవములు

 

  1. ధ్యాన సాధన ప్రారంభవు రోజులలో మీ కణతలు దగ్గర తేలికపాటి ఒత్తిడి కలిగించవచ్చు. ఎందుకనగా అంతర్ మనస్సులో దాగివున్న కర్మలు, సంస్కారములు బయటకు వేళ్ళే ముందు తాత్కాలికంగా అక్కడ కేంద్రేకరించబడీ ఉండడమే. అటువంటి సందర్భములో నెమ్మదిగా కళ్ళు మూసుకొనండి. మనస్సును, శారీరమును స్వేచ్చగా వదలివేయండి. పదనిమిషముల సేపు మౌనంగా గడపండి. బయటకు వేళ్ళే కర్మలు ఆలోచనా రూపంలో గాని, ఏదే ఒక రూపంలో గాని వెళ్ళి పొతాయ. ఆ తరువాత మీరు ఆ స్థితినుంచి మామూలు స్థితిలోనికి వస్తారు.
  2. కొన్నిసార్లు మీరు ధ్యానం చేయునపుడు నిద్రలోనికి జారి పోవచ్చు. అది అలసట వల్ల లేదా బడలిక వల్ల కావచ్చు. మన ఒత్తిడులన్ని ఒక్కసారిగా బయట పడడం వల్ల చైతన్యం మరుగుపడడం గావచ్చు. కాన్ని రోజలు ధ్యానం చేసిన తర్పాత ఇలా జరగడం తగ్గిపోతుంది.
  3. కొన్నిసార్లు ధ్యానంలో తీవ్రమైన ఆలోచనలు రావడం వల్ల ధ్యానం చేయలేని విధంగా అనిపించ వచ్చు. అటువంటుపుడు నిరుత్సాహముతో ధ్యానం నుండి బయటకు రావద్దు. కళ్ళు తెరవవద్దు. మంత్రమును మననము చేయకుండా మనస్సును స్వేచ్చగా వదలివేస్తూ మీరు నిర్ధేశించుకున్న సమయము వరకు మౌనముగా గడపండి. ఇలా చేయడం వల్ల ఏ వ్యతిరేక శక్తులు (నెగెటివ్ ఫోర్స్) ఆలోచనారూపంలో మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయా ఆవి క్రమ క్రమంగా బయటకు వెడుతూ మనస్సుపై పట్టును కోల్పోతాయి. ఇలా చేయడం వల్ల తరువాత చేసే ధ్యానంలో ఆలోచనలు తగ్గడమేకాకుండా ఏకాగ్రత బాగా కుదురుతుంది. ఈ విధంగా ఒక ధ్యానంలో నిశ్శబ్ధముగా ఉండి లోపల వున్న వ్యతిరేకశక్తులు బయటకు పోవుటకు అవకాశం కల్పిస్తే తరువాత చేసే ధ్యానం మరింత అభివృద్ధి కరముగా ఉంటుంది. ధ్యానమును బావి త్రవ్వడంతో పోల్చవచ్చు. ఏవిధంగానైతే బావిలోని మట్టిని తీసి బయటకు పోసి తిరిగి మరలా త్రవ్వడం చెస్తామా అదేవిదంగా ధ్యానంలో కూడా కర్మలను సంస్కారము లను బయటకు పంపిచి వేయడం వల్ల అధేరోజి చేసి ధ్యానంలో కాని ప్రక్కరోజి చేసే ధ్యానంలో గాని మంచి ఏకాగ్రత కుదురుతుంది.
  4. ఒక్కసారి మనం ధ్యానంలో ఉన్నపుదు తల ముందుకు వాలిపోవచ్చు. కారణం మెడలోని నరములు ఎక్కువగా విశ్రాంతి పొందడం వల్ల (డీప్ రిలాక్సేషన్). మనం నిటారుగా ఉంచే ప్రయత్నము చేసినా మళ్ళీ వాలిపోవచ్చు. అందువల్ల దాని గురించి ఆందోళన చెందకుండా ధ్యానం కొనసాగించండి.
  5. కొన్ని సార్లు ధ్యానం అయిపోయిన తరువాత స్తబ్ధుగా చిన్నబుచ్చుకొన్నట్లుగా, మానసికంగా కొంచెం కృంగి నట్లుగా అనిహించవచ్చు. అది రోజు వారి పనులపై ప్రభావము చూపించవచ్చు. మన పూర్వ కర్మలను, సంస్కారములను పరిశుద్ధపరిచే ప్రక్రుతియ వల్ల ఇలా జరుగవచ్చు. అటివంటప్పుడు ముందు చెప్పినట్లుగా విశ్రాంతి చెందండి ( 1 మరియు 3వ్ సూచనలు చూడండి)
  6. కొన్నిసార్లు ధ్యానం తరువాత విసుగు, కోపము ఉండవచ్చు. ఎందువలన అంటే ధ్యానం చేసిన తరువాత కూడా కర్మలు బయటకు వెళ్ళతూ ఉండడం వలన, అటువంటపుడు ముందు చెప్పిన మౌన ధ్యానం (యూనివర్సల్ మెడిటేషన్ - II) కొనసొగించండి. ధ్యానంలో చిడుదలైన కర్మలు బయటకు వెళ్ళగానే మీ పరిస్థితి చక్కబడుతుంది. ఇలా అప్పుదప్పుడు జరుగువచ్చు. కాని వివరకు మీరు శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా మంచి స్థితిని పొందుతారు.
  7. ధ్యానం చేస్తున్నపుడు శారీరంలో ఎక్కడైన నోప్పిగాని, సంచలనంగాని, అసౌకర్యముగాని, వణకడంగాని, కుదుపులు గాని మెదలైనవి జరుగుతున్నట్లయిత్, అది ముమ్మల్ని సక్రమమైన మార్గములో శుద్ధికరించే ప్రక్రియలలో భాగం మాత్రమే. సహనంతో ధ్యానం చేయడి. అన్ని సర్దుకుంటాయి.
  8. కొందరికి అత్యంత అరుదుగా ధ్యానం వల్ల ఇబ్బందులు కలుగవచ్చు. ఎందువల్ల అంటే వారి ధ్యానంలో కర్మలు ఎక్కువగా బయటవైపునకు ప్రవహించడంవలన. ఆ ప్రత్యకమైన వ్యక్తి దైనందిక చర్యలలో ఇబ్బంది ఎదుర్కొవచ్చు. అప్పుడు సదరు ధ్యాని ధ్యానాన్ని ఆపివేస్తే ఆకర్మలు బయటమైపునకు ప్రవహించావడం తగ్గుముఖం పడుతాయి. కొంతకాలం తరువాత తిరిగి ధ్యానాన్ని ప్రారంభించవచ్చు.

    Thanks to http://universal-meditation.com