Clsr

Recent Posts

తెలుగులో స్టాక్ మార్కెట్ ట్రేడింగ్

స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ లో పాలుపంచుకోవాలంటే ఆంగ్ల భాష తప్పనిసరిగా వచ్చి ఉండాలి. ఈ కారణంగానే ప్రాథమిక విద్య మాత్రమే పూర్తి చేసిన భారతీయ గ్రామీణ ప్రజలు ట్రేడింగ్ లో ఇప్పటిదాకా కాలు మోపనే లేదు. అయితే ఇలాంటి వారి కోసం ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ ‘జిరోధా’ కీలక అడుగు వేసింది. ఇక నుండి, తెలుగులోనూ ట్రేడింగ్ చేసుకునే వెసులుబాటును అందుబాటులోకి తెచ్చింది.

తద్వారా తెలుగు భాషను దేశంలోనే తొలి ప్రాంతీయ భాషా ట్రేడింగ్ ఫ్లాట్ ఫాంగా ఏర్పాటు చేసిన తొలి సంస్థగా రికార్డులకెక్కింది.ఈ మేరకు ‘జిరోధా’ సంస్థ వైస్ ప్రెసిడెంట్ కార్తీక్ రంగప్ప హైదరాబాద్ లో కీలక ప్రకటన చేశారు. డెస్క్ టాపులతో పాటు మొబైల్స్, ట్యాబ్స్ లోనూ ఈ సేవలను అందుబాటుకి తీసుకువచ్చినట్లు తెలిపారు.

ఈ ఫ్లాట్ ఫాంలో 70 వేలకు పైగా కంపెనీల షేర్ల క్రయ విక్రయాలను నిర్వహించుకునే అవకాశం ఉందని, దేశంలోనే కంపెనీల విస్తరణలో తెలుగు రాష్ట్రాలు కీలకంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఈ కీలక అడుగు వేశామని రంగప్ప చెప్పారు.