Clsr

Recent Posts

పెళ్లి ఆలస్యం అవుతున్నఅబ్బాయిలకొరకు...

పెళ్లి ఆలస్యం అవుతున్న అమ్మాయిలకు ( రుక్మిణీ కళ్యాణం - చదివితే త్వరగా
పెళ్లి అవుతుందనీ , లలితా దేవిని పూజించమనీ ఇలా ) చాలా పరిష్కార మార్గాలు
మన పెద్దలు చెప్పారు. కానీ పెళ్లి కాని అబ్బాయిలకు ఏదైనా పరిష్కార
మార్గాలు ఉన్నాయా అని నాకు చాలా సందేహంగా ఉండేది. ఎందుకంటే నేటి కాలంలో
అమ్మాయిలకు డిమాండు ఎక్కువగా ఉంది. అమ్మాయిల సంఖ్య తక్కువ, అబ్బాయిల
సంఖ్య ఎక్కువ. అందువలన ఇప్పుడు అబ్బాయికి పెళ్లి అవ్వడం కష్టమైపోయింది.
అందునా మంచి భార్య లభించడమంటే ఎంతో అదృష్టం చేసుకుని ఉండాలి. అందువలన
అటువంటి అదృష్టాన్ని కలిగించే ఉపాయమేమైనా ఉన్నదా అని ఎంతో కాలంగా
వెతుకుతున్నాను.

అలా వెతకగా వెతకగా చివరికి ఆ పరమేశ్వరునికి నాయందు దయ కలిగి ఈ
స్తోత్రాన్ని ప్రసాదించారు. క్షీర సాగరం నుండి లక్ష్మీ దేవి
ఉద్భవించినప్పుడు దేవతలందరూ కలిసి అమ్మవారిని స్తోత్రం చేశారు. కనుక
దీనిని " సర్వదేవకృత లక్ష్మీ స్తోత్రం " అంటారు. ఈ స్తోత్రం అత్యంత శక్తి
వంతమైనది. కనీసం 41 రోజులు క్రమంతప్పకుండా పారాయణ చేసి ప్రతీ శుక్రవారమూ
అమ్మ వారికి ఆవుపాలతో చేసిన పరమాన్నము నైవేద్యము పెట్టిన వారికి ఎంత
కష్టములో ఉన్ననూ ఆ కష్టములు తొలగి సమస్త సంపదలూ లభిస్తాయి. వివాహము
ఆలస్యమవుతున్న మెగ వారికి అతి త్వరలో సౌందర్య వతి అయిన, అనుకూల వతి అయిన
కన్యతో వివాహము అవుతుంది. లక్ష్మీ దేవి వంటి భార్య లభిస్తుంది. ఇందు
సంశయము లేదు. ఇంకా దీని వలన కలుగు సంపదలు అన్నీ ఇన్నీ అని చెప్పనలవి
కాదు.




సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం


క్షమస్వ భగవత్యంబ క్షమా శీలే పరాత్పరే |
శుద్ధ సత్వ స్వరూపేచ కోపాది పరి వర్జితే ||

ఉపమే సర్వ సాధ్వీనాం దేవీనాం దేవ పూజితే |
త్వయా వినా జగత్సర్వం మృత తుల్యంచ నిష్ఫలం ||

సర్వ సంపత్ స్వరూపత్వం సంతుష్టా సర్వ రూపిణీం |
రాశేశ్వర్యధిదేవీత్వం త్వత్కళాః సర్వయోషితః ||

కైలాసే పార్వతీ త్వంచ క్షీరోదే సింధుకన్యకా |
స్వర్గేచ స్వర్గ లక్ష్మీ స్త్వం మర్త్యలక్ష్మీశ్చ భూతలే ||

వైకుంఠేచ మహాలక్ష్మీః దేవ దేవీ సరస్వతీ |
గంగాచ తులసీత్వంచ సావిత్రీ బ్రహ్మ లోకతః ||

కృష్ణ ప్రాణాధి దేవీ త్వం గోలోకే రాధికా స్వయం |
రాశే రాశేశ్వరీ త్వంచ వృందావన వనేవనే ||

కృష్ణ ప్రియా త్వం భాండీరే చంద్రా చందన కాననే |
విరజా చంపక వనే శత శృంగేచ సుందరీ ||

పద్మావతీ పద్మ వనే మాలతీ మాలతీ వనే |
కుంద దంతీ కుంద వనే సుశీలా కేతకీ వనే ||

కదంబ మాలా త్వం దేవీ కదంబ కాననే2పిచ |
రాజ లక్ష్మీ రాజ గేహే గృహ లక్ష్మీ గృహే గృహే ||

ఇత్యుక్త్వా దేవతాస్సర్వ మునయో మనవస్తథా |
రూరూదుర్నమ్ర వదనాః శుష్కకంఠోష్ఠ తాలుకాః ||

ఇతి లక్ష్మీ స్తవం పుణ్యం సర్వదేవైః కృతం శుభం |
యః పఠేత్ ప్రాతరుత్థాయ సవైసర్వం లభేత్ ధృవం ||

అభార్యో లభతే భార్యాం వినీతాం సుసుతాం సతీం |
సుశీలాం సుందరీం రమ్యాం అతి సుప్రియవాదినీం ||

పుత్ర పౌత్ర వతీం శుద్ధాం కులజాం కోమలాం వరాం |
అపుత్రో లభతే పుత్రం వైష్ణవం చిరంజీవినం ||

పరమైశ్వర్య యుక్తంచ విద్యావంతం యశశ్వినం |
భ్రష్ఠ రాజ్యో లభేత్ రాజ్యం భ్రష్ఠ శ్రీర్లభతే శ్రియం ||

హత బంధుర్లభేత్ బంధుః ధన భ్రష్ఠో ధనం లభేత్ |
కీర్తి హీనో లభేత్కీర్తిం ప్రతిష్ఠాచ లభేత్ ధృవం ||

సర్వ మంగళదం స్తోత్రం శోక సంతాప నాశనం |
హర్షానందకరం శాశ్వత్ ధర్మ మోక్ష సుహృత్పదం ||

|| ఇతి సర్వ దేవ కృత లక్ష్మీ స్తోత్రం సంపూర్ణం ||

[ మిత్రులు రాజశేఖరుని విజయ్ శర్మ గారు అందించిన శుభకరమైన స్తుతి ]