ఆధార్ కార్డు గురించి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి , మన వివరాలు ఎలా update చేసుకోవాలి మరియు ఆధార్ కార్డు పొతే ఏ Help Line ఎలా ఉపయోగించుకోవాలి తదితర వివరాలు తెలుసుకొన్నాము .
ఆధార్ కార్డు గ్యాస్ తో మరియు బ్యాంకు ఎకౌంటు తో లింకు తప్పని సరిగా చేసుకోవాలి , లేదంటే సబ్సిడీ పొందలేము . ఇప్పటివరకు చేసుకొని వారు తప్పని సరిగా ముందు ఈ పనిని చేసుకోవాలి .
చేసుకొన్నవారికి మన ఆధార్ కార్డు గ్యాస్ తో మరియు బ్యాంకు ఎకౌంటు తో లింకు అయినదో లేదో తెలుసుకొనే వీలు వుంది . ఈ పనిని మనము గ్యాస్ ఏజెన్సీ కి మరియు బ్యాంకు కు వెళ్లి తెలుసుకోవలసిన పనిలేకుండా ఆన్లైన్ లో ఈ వివరాలు తెలుసుకొనే సదుపాయం కల్పించబడింది . ఎలా చేయాలో చూద్దాం ....
ముందుగా ... ఈ క్రింది బటన్ ని క్లిక్ చేసి సంబందిచిన వెబ్సైటు కు వెళ్ళండి .
ఈ వెబ్సైటు లో మీకు ౩ లింకు లు వుంటాయి , మొదటి లింక్ HP Gas కలిగి
వున్నవారికోసం , రెండవది Bharat Gas కలిగి వున్నవారికోసం మరియు మూడవది
Indane Gas కలిగి వున్నవారికోసం...
మీది HP Gas అయితే ఇలా చేయండి ....
ఈ లింక్ పైన క్లిక్ చేయండి లేదా మీ బ్రౌజరు లో url పేస్టు చేయండి :
http://dcmstransparency.hpcl.co.in/TransparencyPortal/Transparency/Transparency.aspxఇమేజ్ పెద్దది గా కావాలంటే ఇమేజ్ పైన క్లిక్ చేయండి
2.Consumer Type లో Domestic select చేయండి
౩.Quick search లో Consumer No మరియు Distributor Name ఎంటర్ చేసి Proceed బటన్ క్లిక్ చేయండి
లేదా
4.Normal search లో State,District,Distributor Name మరియు Consumer No ఎంటర్ చేసి Proceed బటన్ క్లిక్ చేయండి లేదా
5. Aadhaar Number search లో ఎంటర్ చేసి Proceed బటన్ క్లిక్ చేయండి
క్రింద Image లో చూపబడిన విదంగా - ఆధార్ కార్డు గ్యాస్ కి లింక్ చేయబదివున్నట్లయితే Aadhaar Status with HPCL
క్రింద Submitted (XXXX XXXX 0011) అని చూపబడుతుంది , అంటే మీ అదార్ కార్డు గ్యాస్ తో లింకు చేయబడినట్లు .
అదేవిదంగా Aadhaar Status in Bank క్రింద Available అని చూపబడితే మీ ఆధార్ కార్డు బ్యాంకు ఎకౌంటు తో లింకు చేయబడినట్లు .
Remarks క్రింద You are good to receive subsidy in your Bank Account వుంటే ... సబ్సిడీ కి మీరు అర్హులు. లేదా Available , Please submit your AADHAAR number to your bank immediately అని వుంటే వెంటనే మీ ఆధార్ కార్డు నెంబర్ ని బ్యాంకు లో submit చేయండి
అదేవిదం గా Bharat మరియు Indane gas వినియోగదారులు ఈ క్రింది లింకు ల ద్వారా ఆధార్ కార్డు గ్యాస్ మరియు బ్యాంకు ఎకౌంటు కు లింక్ అయిందో లేదో తెలుసుకొండి.
Bharat Gas : http://www.ebharatgas.com/ebgas/CC_include/Transparency_portal_new.jsp
Indane gas : http://indane.co.in/check-aadhaar.php