Clsr

Recent Posts

ఆధార్ కార్డు పోయిందా ?





చాలా మంది ఆధార్ కార్డు కోసం apply చేసుకొని వుంటారు , కొందరికి ఆధార్ కార్డు వచ్చి ఉంటుంది , కొందరు మరచిపోయి ఎక్కడో పెట్టేసి వుంటారు , మరేఇతర కారణాలవల్ల ఆదార్ కార్డు పోయి వుంటుంది , అలాంటి వారు బయపడవలసిన అవసరం లేదు .

ఈ క్రింది చెప్పిన విదంగా చేసి Duplicate ఆధార్ కార్డు ని పొందవచ్చు ,

1. మొదట UIDAI  contact Centre ( 1800-180-1947 ) కి ఫోన్ చేసి , వారికి మీ ఆధార్ కార్డు పోయినట్లు తెలపాలి. చాలా వరకు ఈ నెంబర్ కి ఫోన్ చేస్తే busy గా వుంటుంది , అలా busy గా వుండి Line కలవనప్పుడు క్రింది విదంగా చేయండి , మీ అదార్ కార్డు నెంబర్ గుర్తు వుంటే నెంబర్ మరియు address వివరాలు తెలుపడం  ద్వారా డూప్లికేట్ ఆధార్ కార్డు పొందవచ్చు . 

2. ఆధార్ కార్డు పోగొట్టుకోన్నప్పుడు తర్వాతి ప్రత్యామ్నాయం Enrollment Number, మీ  Enrollment Number

 మీ దగ్గర ఉన్నట్లయితే సులభం గా ఆధార్ కార్డు తిరిగి పొందవచ్చు . 

online లో మీ Enrollment Number, date time, మొబైల్ నెంబర్ మొదలగు వివరాలను ఇవ్వడం ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు . ఎలా చేయాలో క్రింది లింక్ క్లిక్ చేయండి .


౩. Enrollment Number, date time, మొబైల్ నెంబర్ మొదలగు వివరాలను కూడా పోగొట్టుకొంటే , ఆధార్ కార్డు రిజిస్టర్ కేంద్రం దగ్గరకు వెళ్లి మీ పేరు , చిరునామాతో వెతికి పొందవచ్చు .

గమనిక : ఆధార్ కార్డు నెంబర్ ను Safe place లో బద్రపరుచుకోండి , 12 అంకెల ఆధార్ కార్డు మీ డైరి లోనో లేదా మొబైల్ లోనో రాసిపెట్టుకోండి .