THE BIRTH HISTORY OF LORD DATTHATREYA IN TELUGU
పూర్వము
అత్రి,అనసూయ దంపతులు వున్నారు వారు సర్వ దర్మాలను కలిగిన వారు. ఒక రొజు
ఇంద్రునికి బయము కలుగుతుంది ఎందుకు అంటే అనసూయ తల్లి మహ సాద్వి ఇంద్రుడు బయ
పడుతు త్రిమూత్రులని ఆశ్రయిస్తాడు స్వామి భూ లొక ముందు అనసూయ తల్లి అను మహ
సాద్వి వున్నది ఆ తల్లి దగ్గర వాయువు బయపడుతున్నడు, అగ్ని దెవుడు తన
కిరణాలను సున్నితంగ ప్రసరిస్తున్నాడు భూ మాత అనసూయ తల్లి నడుచె చొట
సున్నితంగ వుంటుంది ఎక్కడ ఆ తల్లి శాప ప్రభావానికి ఎక్కడ గురి అవుతామూ అని
బయ పడుతున్నరు ఆ తల్లి సదాచారలు తపస్సు లను చుసి నాకు నా ఇంద్ర పదవి
పొతునుందొ అని బయము కలిగినది మీరె నన్న రక్షించాలి అని త్రిముర్తులుని
ఆశ్రయిస్తాడు. త్రిముర్తులు
ముగ్గురు ఋషి వెష దారులై ఆ తల్లి ని పరిక్షిస్తున్నరు. ఒ మాత నీవు మహ
సాద్వి అని సదాచారాలు బాగ చెసెదవని విని నె వద్దకు వచ్చాము అని చెప్పారు. ఆ
తల్లి ఋషి వర్య నెను మీకు ఎమి చెయగలను సెలవియ్యండి అని ఆ తల్లి వినయంగా
వారిని ప్రార్దించింది. త్రిమూర్తులు నీవు సరీరమున వస్తములు లెకుండ మాకు
విందు నీయ వలెను అలా అయితెనె మీ ఆతిద్యము స్వీకరిస్తాము లెనిచొ మా దారిన
మెము వెల్లె దము అని చెప్పిరి. ఆ తల్లి ఎమిటి యింత కటిన పరిక్ష నాకు అని
వెదనతొ అతిదులు కొరినది చెయటమె ధర్మము అని తెలుసుకుని మనసున తన భర్తని
స్మరించె కొద్దిగ జలము తొ వారి పె చల్లింది త్రిముర్తులు మువ్వురు పసి
బిడ్డలుగ మార్చి వెసి వారికి స్తన్యము నిచ్చీ వారి ఆకలి తీర్చీనది . అత్రి
మాహార్షి వచ్చీ జరిగినది అంత తన దివ్య ద్రుష్టీ తొ చూసి వీరు త్రిముర్తులు
అని తెలుసుకుంటారు.త్రిముర్తులు భార్యలు వచ్చీ మా దెవులను తిరిగి మాకు
యివ్వండి అని అత్రి అనసూయా దంపతులను ప్రార్దిస్తారు అలా త్రిముర్తులు మరళ
వారి నిజ రూపం పొంది అమ్మా నీవు మహ తపస్సు గల ధర్మచారినివి నీకు వరము
యిచ్చెదము కొరుకొనుము అనగా ఆ తల్లి మీరు నాకు కుమారులుగ జన్ముంచాలి అని ఆ
తల్లి వెడు కున్నది వారు అలనె మువ్వురము కలసి నీకు కుమారునిగ జన్మించీ
దత్తత్రెయ అను నామంతొ ప్రసిద్ద మయ్యెదము అని వరం యిచ్చారు ఆ పరమాత్ముడె
త్రిముర్తులు మువ్వురు నా అంశలె అని మానవాళికి తెలియ చెయుటకు వచ్చీన
అవతారమె దత్తత్రెయ అవతారము ఈ దినమె దత్తత్రెయ జయంతి కళియుగంలొ దాత్తవతారాలు శ్రి పాద శ్రి వల్లభులు 2)నృసింహ సరస్వతి 3)అక్కల కొట మహరాజ్ 4)మానిక్య ప్రభు 5) షిరిడి సాయి బాబ సిద్ధమంగళ స్తొత్రము శ్రీమదనంద శ్రీవిభూషిత అప్పల లక్ష్మి నరసింహరాజా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ శ్రీవిద్యాధరి రాధ సురేఖా శ్రీరాఖీధర శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ మాతాసుమతీ వాత్సల్యామృత పరిపోషిత జయ శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ సత్యఋషీశ్వర దుహితానందన బాపనార్యనుత శ్రీచరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ సవితృకాఠకచయన పుణ్యఫల భరద్వాజరఋషి గోత్రసంభవ జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ దో చౌపాతీ దేవ్ లక్ష్మి ఘన సంఖ్యాబోధిత శ్రీచరణా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ పుణ్యరూపిణీ రాజమంబ సుత గర్భపుణ్యఫల సంజాతా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ సుమతినందన నరహరినందన దత్తదేవప్రభు శ్రీపాదా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ పీఠికాపుర నిత్యవిహారా మధుమతిదత్తా మంగళరూపా జయ విజయీభవ దిగ్విజయీభవ శ్రీమదఖండ శ్రీ విజయీభవ పరమ
పవిత్రమైన యీ సిద్దమంగళ స్తొత్రమును పఠించిన యెడల అనఘాష్టమి వ్రతము చేసి
సహస్ర సభ్ద్రాహ్మణ్యమునకు భొజనము పెట్టిన ఫలము లభించును. మండల దీక్ష
వహించి, ఎక భుక్తము చెయుచూ, కాయా కష్టముతొ ఆర్జించిన ద్రవ్యమును
వినియోగించి సహస్ర సభ్ద్రాహ్మణ్యమునకు భొజనము పెట్టిన ఫలము లభించును. ఈ
స్తొత్రము యోగ్యులచె పఠింపబడును. దీనిని పఠిచుట వలన సిద్దపురుషుల దర్సన,
స్పర్శనములు లభించును. మనసున తలచిన కోరికలు నెరవేరును. మనసా,వాచా.కర్మణా
దత్తారాధన చేయు భక్తులు యీ స్తొత్రమును పఠించినంతనే శ్రీ పాదుల కృపకు
పాత్రులగుదురు. ఈ స్తొత్రమును పఠించిన చోట సూక్ష్మవాయుమండలము నందలి
సిద్దులు అదృశ్యరూపమున సంచరించు చుందురు. శ్రి గురు దత్త జయ గురు దత్త
బ్రహ్మ విష్ణు మహేశ్వరుల స్వరూపమే దత్తాత్రేయుడు :
ఆయన
బ్రహ్మదేవుని మానసపుత్రుడు. అత్రి మహర్షి, బ్రహ్మదేవుని దివ్య నయనాల్లోంచి
జన్మించాడట. అత్రి మహర్షి సతీమణి మహాసాత్వి అనసూయ. నారదుడు త్రిలోక సంచారం
చేస్తూ అక్కడి విశేషాలు, ఇక్కడ, ఇక్కడి విశేషాలు అక్కడ చెప్తూ ఉండేవాడు.
అలా ఆయన ఒకసారి అనసూయ గొప్పతనం గురించి చెప్పగా లక్ష్మి, పార్వతి, సరస్వతి
అసూయ చెందారు. ఆమెను పరీక్షించమని త్రిమూర్తులను పంపారు.
బ్రహ్మ,
విష్ణు, మహేశ్వరులు అత్రి మహర్షి ఇంటికి వెళ్లారు. వారు వెళ్ళిన సమయానికి
అత్రి ఇంట్లో లేకపోవడంతో అనసూయ అతిథి మర్యాదలు చేసేందుకు నడుం బిగించింది.
భోజనం సిద్ధం చేసి పిలవగా, వారు ''నీవు వివస్త్రగా వడ్డిస్తేనే తింటాం''
అన్నారు. అనసూయ చలించకుండా , త్రిమూర్తులను బాలులుగా మార్చి, వారు
కోరినట్లుగానే వడ్డించింది. అదీ ఆమె ఔన్నత్యం. సంతోషించిన త్రిమూర్తులు తమ
ముగ్గురి అంశతో వారికి ఒక బాలుడు పుడతాడని దీవించి వెళ్లారు. అలా అత్రి,
అనసూయలకు జన్మించిన పుత్రుడే దత్తాత్రేయుడు.
కనుక, దత్తాత్రేయుడు
త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల అవతారం. గురుస్వరూపుడు.
ఆధ్యాత్మిక ప్రపంచంలో ‘గురువు' అంటే దత్తాత్రేయుడే! గురువు, దేవుడు
ఒకరిలోనే ఉండడం విశేషం. శాస్త్రాలు, ఉపదేశాలు, పూజలు, జపాలు ఏవైనా సరే,
గురుముఖంగా ఉపదేశమైనప్పుడు మాత్రమే వాటికి గుర్తింపు, రాణింపు కలుగుతాయి.
అలాంటి విశిష్ట రూపంగా అవతరించాడు దత్తాత్రేయుడు. కనుకనే దత్తాత్రేయుడు
గురుదేవుడయ్యాడు.
దత్తాత్రేయుడు భక్తవత్సలుడు. భక్తులపై అంతులేని
కారుణ్యాన్ని కురిపిస్తాడు. దత్తాత్రేయుని ఆరాధించేందుకు ఆర్భాటాలూ,
ఆడంబరాలు అక్కర్లేదు. నిండు మనస్సుతో, నిష్కల్మషమైన హృదయంతో ప్రార్థిస్తే
చాలు, ప్రత్యక్షమై వరాలు కురిపిస్తాడు. అందుకే దత్తాత్రేయుని ‘స్మృతిగామి’
అంటారు.
దత్తాత్రేయుడు విశిష్టమైన ఆచార్యస్థానం ఆక్రమించాడు. ఈ
విశిష్టమైన స్థానం ఇంత తేలిగ్గా లభించిందా అని ఆశ్చర్యపోనవసరం లేదు.
సాక్షాత్తూ దేవదేవుడైన దత్తాత్రేయుడు 24 మంది గురువుల వద్ద విద్యను
అభ్యసించాడు. కనుకనే దత్తాత్రేయుని పరమ గురువుగా కొలుస్తున్నాం.
వివేకంతో,
విచక్షణతో, ఆలోచనల్ని అంతర్ మధించి అసలైన జ్ఞానాన్ని అందింపుచ్చుకోవాలి.
అది మన కర్తవ్యం. అలాంటి విచక్షణాపరులుగా రూపొందాలి. సాధారణంగా ప్రతి
మనిషికీ వివేకం, విచక్షణ, వితరణ – ఈ మూడింటిని అందించగలిగేవాడు గురువు.
అందుకే సృష్టిలో కన్నవారి తరువాత ఆ స్థానాన్ని ఆక్రమించినవాడు గురువు.
దత్తాత్రేయుడు
గురువులకే గురువు విజ్ఞాన ఖని. అయినప్పటికీ సాధారణ వ్యక్తిలా గురువుల వద్ద
వినయంగా విద్యను అభ్యసించిన సద్గుణ సంపన్నమూర్తి. సకల వేదస్వరూపుడు.
జ్ఞానామృతాన్ని జగత్తుకు పంచిన సద్గురు చక్రవర్తి. మౌనముద్రతోనే శిష్యుల
సందేహాలను నివృత్తి చేసి గురుస్థానం దక్కించుకున్న దత్తాత్రేయుడు
విశ్వానికే గురువయ్యాడు. అందుకే నిరంతరం దత్తాత్రేయుని ప్రార్దిస్తాం. జన్మ
సంసార బంధనాల్ని తేలిగ్గా తెంచగలిగిన మహానుభావుడు, జ్ఞానానందాన్ని
పంచగలిగిన ప్రేమమూర్తి, ముక్తిపథంలో నడిపించి మోక్షాన్ని ప్రసాదించగలిగిన
పరమ యోగీశ్వరుడు దత్తాత్రేయుడు.
మనసా స్మరించినంత మాత్రాన
సాక్షాత్కరించే దయాసింధువు దత్తాత్రేయుడు మనకు లభించడం మన అదృష్టమే. కనుక
ఎల్లవేళలా దత్తాత్రేయుని ధ్యానించుకుందాం. దత్తాత్రేయుడు విశ్వమంతా
పరచుకుని ఉన్నాడు. ఆయన గుప్తంగా దాగివుంటాడు. తనను కొలిచే వారిని
కనిపెట్టుకుని ఉంటాడు. తన అనుగ్రహానికి పాత్రులైన వారిని గుర్తించి వరాలు
ప్రసాదిస్తాడు. అంతటి కరుణామూర్తి దత్తాత్రేయుడు. అంతేనా, మనిషిలోని అసలు
మనిషిని వెలికితీయగల మహిమాన్వితుడు.
|