Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog
మన
తెలుగు సంవత్సరాలకు ఎంతో విశిష్టత ఉంది... ప్రస్తుతం ఈ రోజు ప్రారంభమయ్యే
తెలుగు సంవత్సరం జయా నామ సంవత్సరం అని మన అందరికీ తెలుసు... ఈ విధంగా ప్రతి
సంవత్సరానికి ఒక పేరు ..మొత్తం అరవై సంవత్సరాలకు విడివిడిగా పేర్లు ఉండడం
మన తెలుగు సంవత్సరాల విశిష్టత... తెలుగు సంవత్సరాలు 60 అని అందరికీ తెలుసు
కానీ వాటికి ఆ పేర్లు ఎలా వచ్చాయనేది మాత్రం కొందరికే తెలుసు. అయితే వాటి
వెనుక ఓ కథ ఉంది. నారదమహాముని ఓసారి విష్ణు
మాయ వల్ల స్త్రీగా మారి, ఓ రాజును పెళ్లాడతాడు. వారికి 60 మంది పుత్రులు
జన్మిస్తారు. ఓసారి ఆ రాజు తన పుత్రులతో యుద్ధానికి వెళితే అంతా
చనిపోతారు.
అప్పుడు ప్రార్థించిన నారదుడిని విష్ణువు కరుణిస్తాడు. నీ పిల్లలు 60 సంవత్సరాలుగా కాలచక్రంలో తిరుగుతుంటారు అని వరమిస్తాడు. అవే మన తెలుగు సంవత్సరాలుగా ప్రస్తుతం వాడుకలో ఉన్నాయి.మొత్తం అరవై సంవత్సరాలు(షష్టి) పూర్తి అయితే ఒక షష్టి పూర్తి అయినట్లే... షష్టి పూర్తి అనేది మన జీవన గమనంలో జరుపుకునే ఒక విశిష్ట మైన వేడుక..అనగా ఇది మనం ఒక అరవై సంవత్సరాలలో ఎంత ప్రగతి సాధించాం అని ఒక సారి యోచన చేసుకుని... మిగిలిన కాలాన్ని ఎంతవరకు సద్వినియోగం చేసుకోవాలి.. మన బాధ్యతలను ఎలా నెరవేర్చుకోవాలి అని తెలుసుకోవడానికి ఒక బంగారు అవకాశం లా ఉంటుంది..