Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog
తెలంగాణ
రాష్ట్ర ఏర్పాటుకు రాజ్యసభ ఆమోద ముద్ర కూడా పడింది.. ఇక రాష్ట్రపతి
ఉత్తర్వుతో భారత దేశంలో 29వ రాష్ట్రంగా తెలంగాణ అవిర్భవిస్తోంది.. ప్రత్యేక
రాష్ట్రం కోసం దశాబ్దాల పోరాటం ఫలించి తెలంగాణ ఏర్పడబోతోంది.. ఈ విజయం
కచ్చితంగా అమర వీరులకే దక్కుతుంది.. స్వయంపాలన, స్వావలంభణ, ఆత్మగౌరవం కోసం
సాగిన ఈ పోరాటం ఎన్నో పాఠాలను నేర్పించింది.. రెండు రాష్ట్రాలుగా
విడిపోయినా తెలుగు వారందరి మధ్య ప్రేమ, ఆప్యాయతలు, సహాయ
సహకారాలు కొనసాగినప్పుడే అభివృద్ధి పథంలో కలిసి ముందుకు సాగుతాం.. తెలంగాణ
అయినా, సీమాంధ్ర అయినా మనం ముందు భారతీయులం అనే విషయం మరచిపోరాదు.. తెలుగు
వారికి రెండు రాష్ట్రాలు అని గర్విద్దాం.. ఇలాంటి కీలయ సమయంలో ఉభయ
ప్రాంతాల మధ్య సామరస్యం చాలా అవసరం.. సోకాల్డ్ రాజకీయ నాయకుల రెచ్చగొట్టే
వైఖరి కారణంగానే సమస్యలు వస్తున్నాయి.. ఇలాంటి నాయకులకు ముందు గట్టిగా
బుద్ది చెబుదాం..