భారతదేశంలో రాగి చరిత్ర మరియు విశిష్టత
రాత్రి రాగి చెంబులో మంచి నీళ్ళు వుంచి పరగడుపున తాగితే హాయిగా జీవించవచ్చు.
 
 రాత్రి నిద్ర పోయోముందు అర లీటర్ నుండి లీటర్ ఉండే రాగి చెంబు నిండా 
మంచినీళ్ళు పోసి మంచం పక్కనే పెట్టుకోవాలి ఉదయం నిద్ర లేచి లేవగానే రెండు 
సార్లు పుక్కిలించి ఊసి ఆ రాగి చెంబులోని నీళ్లు తాగాలి . దీనివల్ల 15 
నిమిషాల నుండి అర గంటలోపు సుఖ విరోచనం అవుతుంది. గ్యాస్, కడుపుబ్బరము, 
కడుపులో మంట, మలబద్ధకం, తేపులు, మొదలైన బాధలన్నీ ఈ అలవాటుతో ఎటువంటి ఔషదాలు
 వాడే పని లేకుండా పూర్తిగా తగ్గిపోతాయి. మలబద్ధకం అనేది అన్ని వ్యాదుల్ని కలిగించడానికి మూలకారణం కాబట్టి ఈ అలవాటు తో మలబద్ధకం నివారించుకుంటే హాయిగా జీవించవచ్చు.
 ఇక రాగి చెంబులో నీళ్ళే ఎందుకు తాగాలి వేరేవి ఉన్నాయి కదా అని కొందరికి 
సందేహం రావచ్చు . రాగి గురించి వరాహ పురాణం లో వివరంగా ఉంది ఈ రాగి ఏడువేల 
యుగాల క్రితమే విష్ణు మాయ కారణంగా పుట్టింది . గూడ కేశుడు అనే ఒక రాక్షసుడు
 తామ్ర ( రాగి) రూపంలో విష్ణు మూర్తిని ఆరాధించేవాడు అతని భక్తి కి మెచ్చి 
వరం కోరుకోమంటే గూడ కేశుడు తన అవయవాలన్ని తామ్ర( రాగి) రూపం దాల్చాలని 
భగవదారాధనకు ఆ పాత్ర లనే వాడాలని కోరుకుంటాడు. విష్ణు మూర్తి సుదర్శన 
చక్రంతో ఒక శుభ మూహూర్తం లో వైశాఖ శుక్ల ద్వాదశి నాడు గూడ కేశ సంహరం 
జరిగింది . అతని కోరిక నెరవేరింది . ఆనాటి నుండి మనకు తామ్ర( రాగి) పాత్రలు
 ప్రాప్తించాయి. అందుకే ఇప్పటికీ దేవాలయాలల్లో, యజ్ఞం లో రాగి పాత్రల ను 
మాత్రమే వాడతారు అంతేగాక రాగి కి నీటిలో సూక్ష్మ క్రిముల్ని చంపి నీటిని 
శుద్ధి చేసే గుణం ఉంటుంది .
