దుబాయ్ పేరు చెబితేనే సంపన్నమైన అరబ్బులు మనకు గుర్తుకు వస్తారు. 
మితిమీరిన సంపదతో అత్యంత విలాసవంతమైన జీవితాన్ని గడుపుతూ ఉండే వీరి జీవన 
విధానాన్ని గమనించాలంటే జీవితంలో ఒక్కసారైనా దుబాయ్ నగరాన్ని 
సందర్శించాల్సిందే. అయితే ఇంతటి కుబేరులు నివసించే దుబాయ్ చూపరులను ఇట్టే 
ఆకర్షిస్తుంది. అలాగే పర్యాటకుల కోసం ఎన్నో అందమైన ప్రదేశాలు, ఆకర్షణలు ఈ 
దేశంలో పుష్కలంగా ఉన్నాయి.










 
