Clsr

Recent Posts

ఫిన్లాండ్ లో కనబడ్డ అరుదైన తెలుపు రంగు ‘అరోరా’ కాంతి పుంజాలు

అరోరా అనేది ధృవముల వద్ద ఆకాశము లో రాత్రి పూట కనపడే వెలుగు.

అరోరే అనేవి ఉత్తర, దక్షిణార్ధగోళాల్లో మనకు కనిపించే అద్భుతమైన కాంతులు. సాధారణంగా రాత్రివేళల్లో వీటిని చూడవచ్చు. ఉత్తరార్ధగోళంలో మనకు కనిపించే ఈ రంగురంగుల కాంతులను అరోరా బొరియాలిస్ అని పిలుస్తారు. రోమన్లు ఉదయపు సంధ్యను ‘అరోరా’అనే దేవత పేరుతో పిలుస్తారు. అదేవిధంగా ఉత్తరపు గాలులను ‘బొరియస్’ అని పిలుస్తారు. ఈరెండింటిని కలిపి అరోరా బొరియాలిస్‌గా ఈ కాంతులకు పేరుపెట్టారు. ముఖ్యంగా ఈ అరోరా బొరియాలిస్ రాత్రివేళల్లో మాత్రమే మనకు కనిపిస్తాయి. మనం ఉత్తర ధృవానికి దగ్గరగా వెళ్ళినకొద్దీ మనకు ఇవి మరింత కాంతివంతంగా కనిపిస్తాయి. నిజానికి ఈ ‘అరోరే’ అనేవి కాంతిలోని ఫోటాన్లు అనే కణాల వల్ల ఏర్పడతాయి. భూవాతావరణంలో చాలా ఎత్తున అంటే కనీసం 50 మైళ్ళ ఎగువగా మనం వీటిని వీక్షించవచ్చు. ఈకణాలు సౌరగాలులను ఢీకొన్నప్పుడు మరింత ఉత్తేజితం కావడం లేదా అత్యధిక కాంతితో కనిపించడం జరుగుతుంది. సూర్యుడి నుంచి వెలువడే విద్యుదావేశ కణాల ప్రవాహమే ఈసౌరగాలులు.

సూర్యుడిలో రసాయనిక చర్యల కారణంగా జరిగే మార్పులు ప్రతి 11 సంవత్సరాలకోమారు చక్రగతిన కొనసాగుతుంటాయి. ఈ చర్యలు ఎక్కువగా జరిగితే సూర్యుడినుంచి సౌరగాలులు పెద్ద మొత్తంలో వెలువడుతాయి. ఇవి రెండు రోజుల్లో భూవాతావరణాన్ని చేరి విస్తృతంగా అరోరా బొరియాలిస్‌ను ఏర్పరుస్తాయి. స్కాట్లాండ్ నుంచి వీటిని స్పష్టంగా వీక్షించవచ్చు. 2004 వసంతకాలంలో, 2005 శీతాకాలంలో అరోరాలు విపరీతంగా ఏర్పడ్డాయి. అదేవిధంగా దక్షిణార్థగోళంలో ఏర్పడే కాంతులను అరోరా ఆస్ట్రాలిస్ అని పిలుస్తారు. ఇవి కూడా అరోరా బొరియాలిస్ ధర్మాలనే ప్రదర్శిస్తాయి.

సౌరగాలులు వాతావరణంలో వుండే నైట్రోజన్‌తో ఇవి చర్య జరిపినప్పుడు నీలం, ఎరుపురంగులోను, ఆక్సిజన్‌తో చర్య జరిపినప్పుడు ఆకుపచ్చ లేదా గోధుమ-ఎరుపు సమిశ్రీత రంగులో ఈ కాంతి మనకు కనిపిస్తుంది

అయితే ఇప్పుడు మొదటిసారిగా ఇవి తెలుపు రంగులో కనబడి శాస్త్రవేత్తలను ఆశ్చర్యపరిచేయి.
మామూలుగా కనబడే అరోరాలు