Clsr

Recent Posts

How to Prepare Resume?




Resumes:
ఉద్యోగాల వేటలో పడే వారికి మొదటిగా కావలసింది “Resume”. Resume ని అందం గా, క్లుప్తం గా తయారు చేయడం, తర్వాత తగిన సమయానికి ఏ కంపెనీ కి దరకాస్తు చేసుకోవాలో, ఆ కంపనీ లకు Resumes పంపడం ఉద్యోగాల వేట లో ఉన్నవారి మొదటి పని. ఉద్యోగాల కన్నా ఉద్యోగాల వేటలో ఉన్నవారి సంఖ్య అదిక రెట్లు వున్నది . అందువల్ల ఉద్యోగం కోసం గట్టి పోటీ ఎదుర్కోవాలంటే , మొదటి అస్త్రం Resume. Resume సరిగా లేదంటే మొదటి రౌండ్ లోనే వెనుదిరగాల్సిన పరిస్తితి వస్తుంది. అందువలనే Resume తయారు చేసుకోవడం ,Resume పంపడం విషయం లో ముఖ్యం గా Freshers చాలా జాగ్రత్త తీసుకోవలసి వుంటుంది.
Resume లో మనకు సంబందించిన విషయాలు కంపెనీలకు క్లుప్తం గా తెలియజేయవలసి వుంటుంది.ముఖ్యం గా సాఫ్ట్వేర్ కంపనీ లు Resume లో ఉన్న వివరాలు క్లుప్తం గా, సులువుగా అర్ధమయ్యే రీతిలో వుంటే నే అభ్యర్దులను ఇంటర్వ్యూ కి ఆహ్వానిస్తుంటారు. అందువల్ల Resumes తగిన రీతిలో తయారుచేసుకోవడం ఎంతో ముఖ్యం.
Resume writing కి ఎంత ప్రాముఖ్యత వుందంటే ... Resume తయారుచేసి ఇవ్వడానికి కొన్ని కంపెనీ లు, Professional writer’s వున్నారంటే అర్ధం చేసుకోవచ్చు. Resume writing కి ఉన్న ప్రాముఖ్యత ఏమిటో. కొన్ని job websites అయితే తామే అభ్యర్దుల నుండి వారి వివరాలు సేకరించి , తామే Resumes తయారుచేసి కంపెనీలకు పంపుతుంటారు . అందుకు గాను Resumes తయారుచేసి ఇచ్చే దానికి 1500 వరకు ఛార్జ్ చేస్తుంటారు . కొంత శ్రమ పది మనమే Resume తయారు చేసుకోవచ్చు.
Resume ఎలా చేసుకోవాలో చూద్దాం:

Address For Communication: Resume లో ముందుగా పొందుపరచవలసినది మన address,email,telephone number . కంపెనీలు అభ్యర్దులను సంప్రదించేందుకు ఈ వివరాలు వుపయోగించుకొంటారు . ఈ వివరాలు correct గా ఇవ్వడం ఎంతోముఖ్యం .

Objective: అభ్యర్దులు తాము దరకాస్తు చేసుకోవాల్సిన ఉద్యోగం,తమ క్వాలిఫికేషన్ , తమ టెక్నికల్ skills దృష్టిలో పెట్టుకొని Resume ఆబ్జెక్టివ్ రాయాల్సి వుంటుంది .                                                                                 
Education Details : అభ్యర్దులు తమ Educational Qualification 10 వ తరగతి ఆ పైన ఉన్న వివారాలు అన్నింటిని రాయాల్సి వుంటుంది . మొదట Highest Qualification నుండి 10 వ తరగతి వరకు రాయాల్సి వుంటుంది .

Additional Qualification:  ఏమైనా Additional Qualifications వుంటే అవికూడా mention చేయాల్సి వుంటుంది .
Skills : కంపనీ లు ఇంటర్వ్యూ కి ఆహ్వానించే సమయం లో ఏ skills కావాలో చెప్తారు , ఆ skills కి తగినవిదం గా మనకు వుండే స్కిల్ కంపెనీ కి సరిపోతే లేదో చూసుకొని మన skills లో పొందుబరచాల్సి వుంటుంది . తెలియని సంబంధం లేని విషయాలు పొదుపరచడం మంచిది కాదు .
Professional Experience : experience ఉన్న అభ్యర్దులు ఈ section లో తమ Previous కంపనీ వివరాలు  ( Company మరియు Duration ) పొందుపరచాలి .
Project Details: Project సంబందిచిన విషయాలు పొందుపరచాలి. ఏ ప్రాజెక్ట్ , ప్రాజెక్ట్ లో ఏ technologies ఉపయోగించారు , team Size, Duration తదితర విషయాలు పొందుపరచాలి.

Personal Details : ఈ section లో మన personal details ఇవ్వవలసి వుంటుంది .
 పైన చెప్పిన విషయాలు కొన్ని సూచనలు మాత్రమే . ఈ సూచనలు పాటించి కంపెనీకి తగ్గట్టు మన Resume ని మార్పు చేసుకొంటూ వుండాలి . కొన్ని కంపెనీలు వారికి కావలసిన format లో Resume పంపమని కోరుతారు . వారికి కావలసిన format లో modify చేసుకొని పంపవలసి వుంటుంది .

కొన్ని Resume format లు క్రింద ఇవ్వబడినాయి . Download చేసుకోండి .