Clsr

Recent Posts

గోవులను కాపాడుకుందాం

భగవంతుడు మనుషులను పుట్టించడానికి పూర్వమే మన బ్రతుకు చక్కగా సాగడానికి గోమాతను పంపించాడు. ఆ తల్లి కరుణాకటాక్షాలతో సకల సంపదలతో మన భారతావని పూర్వం అత్యంత వైభవంగా విరాజిల్లింది. సకల వేదాలు, పురాణాలు, సకల శాస్త్రాలు  గోమాతను కొనియాడాయి. ఆమెను ప్రత్యక్ష దైవంగా ఈ దేశం స్వీకరించింది. హిందూ సం ప్రదాయంలో గోపూజ ప్రధానమైనది. గోవు శరీరంలో సమస్త దేవతలు నెలకొని వున్నారని మన…పురాణాలు చెప్తున్నాయి. గోవునునడిచే దేవాలయంగా చెప్పుకోవచ్చు. శుభకార్యాలయా ల్లో గోవు మూత్రాన్ని వాడతారు. గోవు ఆశ్చర్యకరమైన ప్రయోగశాల అన్నారు పెద్దలు. ఆవుపాలు, పెరుగు, నెయ్యి, మేధో సంపత్తిని వృద్ధి చేస్తుంది. పాల నదులు ప్రవహించిన ఈ బంగారు గడ్డపై పాపాల నదులు, గోమాత రక్తపుటేరులు పారుతున్నాయి. చారిత్రక దృష్టితో పరి కించితే గోరక్షణకు సంబంధించిన ప్రశ్న మొట్టమొదటగా ముస్లిం శాసకాలంలోనే కనపడుతుంది. అంతకుముందు కాలంలో గోహత్య అసలు ఊహకందని మాట.ఇస్లాం ఈ దేశంలో హిందూ ధర్మ సంస్కృతులను సమూలంగా నాశనం చేయాలని ఆశించింది. ఆంగ్లేయులు ఆవును మాంసాన్నిచ్చే జంతువుగానే గుర్తించారు. ముస్లింలు తాము తినడానికన్నా హిందువుల మనోభావాలను గాయపరిచేందుకే గోహత్యను ముమ్మరంగా చేశారు. మందిరాలను నేలమట్టం చేసి మసీదులు కట్టేందుకు ముందు వారు కావాలని గోవుల రక్తాన్ని ఆ స్థలంపై అలికేవారు. కారణం ఆ స్థలంలో మరెన్నడూ హిందువులు దేవాలయం కట్టరాదని చేసేవారు.

పశువులను `నిరుపయోగం' అని ప్రకటించి వాటిని వధ చేస్తుండటం చాలా దు:ఖకరమైన విషయం. ప్రతి సంవత్సరం బంగ్లాదేశ్‌, పాకిస్తాన్‌లకు 20,000 పశువులు దొంగచాటుగా రవాణా అవుతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఒక్క విషయం ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఒక పశువధశాల నుంచి 20 కోట్ల రూపాయలు ఎగుమతులు అవుతున్నాయనుకుంటే అక్కడ వధకు గురయ్యే పశువులతో తయారుచేయదగిన ఎరువులు, శక్తి విలువ 910 కోట్ల రూపాయలను మనం కోల్పోతున్నామన్న మాట. ఆ రకంగా ఆర్థిక వినాశనం కొనితెచ్చుకుంటున్నాము. భారతదేశంలో వ్యవసాయ అస్ధిరతకు గురై, పేదరికం మరింత పెరుగుతుంది. శాస్త్రజ్ఞులు చెప్పేదానినిబట్టి పశువధ కారణంగా భూకంపాలు తరచుగా ఏర్పడి జనవినాశనానికి కారణభూతమవుతున్నాయి. మన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పుంగనూరు సంతతి ఆవు సుమారుగా అదృశ్యమైంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఒంగోలు జాతి సంతతి అరుదుగానే లభిస్తోంది. ఈ స్వదేశీ సంతతికి చెందిన ఆవులు నేడు 32 తెగలు మాత్రమే లభ్యమవుతున్నాయి.

ముజఫర్‌ హుస్సేన్‌ అనే రచయిత `ముస్లింలు - శాకాహారము' అనే గ్రంథం రాశాడు. ప్రముఖ ఇస్లాం పండితుడు అల్థాజ్‌ అలి (కీ.శ.1058-1111)తన `ఆహ్యాఉల్‌-దీన్‌' అనే గ్రంథంలో `గోమాంసం విషకరమైనది(మార్‌‌జ), ఆవు పాలు ఆరోగ్యవంతమైన ఆహారము (సఫా), ఆవు నేయి ఔషధగుణాలు కల్గినది' అని పేర్కొన్నాడు. బాబర్‌ తన కుమారుడు హుమాయూన్‌ పేరిట రాసిన వీలునామాలో `తుజుక్‌-ఇ-బాబరీ'లో భారతీయులు మత విశ్వాసాలు కలిగినవారు. వారి మనోభావాలను గౌరవించి మొగల్‌ సామ్రాజ్యంలో గోహత్యను జరుగనీయవద్ద'ని పేర్కొన్నాడు. గోవును చంపిన వారి చేతులు నరికేయమని మైసూరు దివాన్‌ హైదరాలి 1829లో శాసనం చేశాడు. 1857లో బహదూర్‌షా జఫర్‌ ఢిల్లీ చక్రవర్తి అయిన సమయంలో గోవధ నిషేధాన్ని ప్రకటించాడు. ఆగస్టు 1న జరిగిన బక్రీదు పండుగనాడు ఒక ఆవుకూడా వధింపకపోవడం గమనార్హం. భారతదేశంలోని అత్యధిక ముస్లింలందరి పూర్వీకులు హిందువులే. ఆవు దేశావసరం. అది మత సంబంధమైన జంతువు కాదు. ఆనాడు భారతదేశంలో ఉన్నది హిందువులు మాత్రమే. హిందూమతాన్ని గౌరవించే వారు కనుక ఆవు వాళ్ల సొత్తయింది. కనుక గోవు కేవలం హిందువులకే కాదు అన్ని మతాల వారికీ, అన్ని జాతుల వారికీ తల్లే.

ఆంగ్లేయుల కుట్ర :
17వ శతాబ్దంలో ఆంగ్లేయులు భారతదేశం వచ్చేనాటికి మనదేశంలో జనాభాకంటే గోసంపద, పశుసంపద అధికంగా ఉండేది. ఆవు భారతీయ వ్యవసాయానికి కేంద్ర బిందువు. మనది గోఆధారిత వ్యవసాయం. ఆంగ్లేయులకు ఈ స్థితి ఆశ్చర్యం, అసూయ కల్గించాయి. వారి దృష్టిలో ఆవు అంటే మాంసాన్నిచ్చే జంతువు. స్వతహాగా వారు గోమాంస భక్షకులు. రాబర్‌‌టకై్లవ్‌ క్రీ.శ.1760లో కలకత్తాలో రోజుకు 70 వేల పశువులను సంహరించే మొట్టమొదటి గోవధశాలను ప్రారంభించారు. క్రైస్తవ మతప్రచారకుల సహకారంతో విదేశీ పండితులు వేదాలు, ప్రాచీన సాహిత్యానికి తప్పుడు వ్యాఖ్యానాలనిస్తూ భారతదేశంలో ప్రాచీన కాలంలో గోమాంస భక్షణ జరిగిందని ప్రచారంచేసి, పుస్తకాలను ముద్రించారు. వేదాలపై భాష్యం చెప్పిన మాక్‌‌సముల్లర్‌ ఈ కోవకు చెందినవాడే.

స్వాతంత్య్రోద్యమంలో గోవు :
  • స్వాతంత్య్రం వచ్చిన 5 నిమిషాలలోనే ఒక కలముపోటుతో (శాసనముతో) గోహత్య నిలిపివేయబడును : లోకమాన్య బాలగంగాధర తిలక్‌
  • నా దృష్టిలో గోరక్షణ స్వరాజ్య సముపార్జనకంటే ఎంతమాత్రం తక్కువకాదు : మహాత్మాగాంధీ
  • వ్యవసాయ సంస్కృతికి ఆధారమైన గోసంతతిని ఎంత శ్రమించైనా రక్షించుకోవాలి. గోసంతతికి నష్టం కలిఇతే వ్యవసాయానికి, ఆర్థిక వ్యవస్థకు నష్టం కలుగుతుంది. : సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌

  • మహాభారతంలో `అషై్టశ్యర్మమయీ లక్ష్మీ వసతే గోమయే సదా' అంటే ఎనిమిది రకాల ఐశ్యర్యాలతో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ గోమూత్రం-గోమయంలో ఉందని అర్థం.'

    గోవు, విశిష్టత… :
    ప్రాణులలోకెల్లా సర్వోత్కృష్టమైనది భారతీయ గోసంతతి. ఆవు కాకుండా మరే పశువు పాలలోనైనా పాషాణం(ఆర్సెనిక్‌) ఉంటుందని ఆధునిక విజ్ఞానశాస్త్రం చెబుతోంది. ఆవుపాలు పసుపుపచ్చగాను, గేదెపాలు తెల్లగాను ఉంటాయి. అందువలన వీటిని బంగారము, వెండి అంటారు. ఆవుపాలు దాని మూపురంగుండా స్రవించి లభిస్తాయి. మూపురంలో స్వర్ణనాడి ఉంది. ఆవు దూడ పుట్టిన మూడురోజులకే గంతులేస్తుంది. అదే గేదె దూడ 30 రోజుల వరకు మత్తుగా పడిఉంటుంది. ఈ కారణంగానే ఆవుపాల వలన శరీరంటో స్ఫూర్తి కలుగుతుంది.

    గోమూత్రంతో లాభాలు:
    క్రిమి నియంత్రణ; నివారణ ఔషధాలు తయారవుతున్నాయి. గోమూత్రంలో వేప, జిల్లేడు, తులసి, మారేడు, కానుగ మొదలైన ఒక రకపు ఆకులు 15 రోజుల నానబెట్టి రాగి పాత్రలో మరగించాలి. సగంవరకు దిగిన తర్వాత సీసాలలో పోసి పెట్టుకోవాలి. ఒక లీటరు ఈ ద్రవంలో 100 లీటర్లు నీరు కలిపి పంటపై పిచికారీ చేస్తే కీటకాలు లేకుండాపోతాయి. అలా కోట్లాది రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది. గోమూత్రంలో 10 రెట్లు నీరు కలిపి చెట్లు, మొక్కలపై పిచికారీ చేస్తే కీటకాల నుంచి వాటిని రక్షించవచ్చు.

    పేడతో ఉపయోగాలు:
    పేడవలన ప్రపంచంలో సర్వశ్రేష్టమైన జీవశక్తి కలిగిన సేంద్రీయ ఎరువు తయారు కొబడుతున్నది. పేడ నుండి గ్యాసు పోయిన తర్వాత నిజానికి మిగిలిన ఆ మడ్డిలోనే ఎరువులను తయారుచేసే గుణాలెన్నో ఉంటాయి. ఏనిమల్‌ వెల్‌ఫేర్‌ బోర్‌‌డ ఆఫ్‌ ఇండియా వారి ప్రకారం ఒక ముసలి ఆవు ద్వారా సంవత్సరానికి 4500 లీటర్ల బయోగ్యాసు, 80 టన్నుల సేంద్రీయ ఎరువు, 200 లీటర్ల సేంద్రీయ కీటక నివారణ ఔషధం లభ్యమవుతాయి. పిడకలు కాల్చడం వలన 6 కోట్ల 80 లక్షల టన్నుల పంటచెరకు ఆదా అవుతోంది. ఇంత పంటచెరకు అంటే 15 సంవత్సరాల వయస్సు కలిగిన 14 కోట్ల చెట్లన్నమాట. ఆశ్చర్యం! ఊహించని ఎంత పెద్ద ఆదాయమిది.

    కదిలే శక్తికేంద్రం ఆవు :
    మన దేశంలో నేడు గ్యాస్‌, విద్యుత్‌ కొరత చాలా ఉంది. మన వద్ద లభించే తక్కువ ఖరీదు సాధనాల ద్వారా కాక భారీ వ్యయంతో కూడిన సాధనాల ద్వారా గ్యాసును నేడు మనం ఉత్పత్తి చేసుకొంటున్నాం. విదేశీ భావదాస్యంలో మునిగిన మనం మనదైన గోవంశం అందించే గోమయం, గోమూత్రంలోని అద్భుత శక్తిని అవహేళన చేశాం. గోమయంచేత గ్యాసు ఉత్పత్తిని భారీగా చేపట్టవచ్చు. అలా బయటికి వచ్చే మడ్డి పదార్థం ఎంతో విలువైన సేంద్రీయ ఎరువుగా పంటలకు ఉపయోగించవచ్చు. గోమయ, గోమూత్రాలతో గ్యాసు ఉత్పత్తిని ప్రారంభిస్తే దానివలన ఎంతో వంటచెరకు, పిడకలు మిగిలిపోతాయి. పరిశోధనచేసి గ్యాసును సిలిండర్లలో నింపి దేశవ్యాప్తంగా సరఫరాలు కూడా చేపట్టవచ్చు.ఈ రోజుల్లో ఉమ్మడి కుటుంబాలు ఎలాగూ లేవు. కనీసం ఒక్కొక్కరు కాకపోయినా నాలుగు కుటుంబాలు కలిసి పాలిచ్చే పదిగోవులు ఉంచే ఏర్పాటుచేసి చక్కగా పాలు, పెరుగు, వెన్న, నెయ్యిలతో తమతమ కుటుంబాలలో చక్కని ఆరోగ్యాన్ని, ఆనందాన్ని అనుభవించవచ్చు దానితోపాటు తమ చుట్టుపక్కల పర్యావరణ కాలుష్యం లేకుండా చూసుకోవచ్చు. పశ్చిమదేశాల్లో మన సాయూహిక జీవన విధానం ఎడల ఆకర్షణ పెరుగుతోంటే, మనమేమో ఇక్కడ పక్క ఇంటివారిని కూడా చూసి, పలకరించము. ఒకరంటే ఒకరికి పడని వైఖరి సిటీల్లో వేళ్లూనుకుపోయింది. ఎంతసేపూ డబ్బు చుట్టూ మనిషి తిరుగుతున్నాడే తప్పించి, పుట్టినందుకు జీవితాన్ని సార్థకం చేసుకునే మార్గం అన్వేషించడం మానేశారు. ఈ ధోరణి మారినప్పుడే నగరాల్లో దొంగతనాలు, దాడులు, హత్యలు తగ్గుతాయి.

    గో సంరక్షణకు మనం ఏమి చేయాలి? :
    ఆవు ప్రాముఖ్యతను తెలియజేసే సాహిత్యాన్ని చదివి తెలుసుకోవాలి. రోజూవారీ జీవితంలో గోఉత్పత్తులు, పాలు, నెయ్యి, సబ్బులు, షాంపూ, పండ్లపొడి, అగరవత్తులు.. ఇలాంటి వినియోగవస్తువుల వాడకా న్ని ప్రోత్సహించాలి. గోమూత్రం ద్వారా తయారయ్యే మందులను ఇంట్లోని సభ్యులందరూ వాడేట్లు ప్రోత్స హించాలి. దేవాలయం, ధర్మకర్తలు, భక్తులు ప్రతి దేవాలయం ఒకటి రెండు ఆవులను పోషించేట్టు చూ డాలి. రసాయనిక ఎరువుల వాడకాన్ని తగ్గించి, సేంద్రీయ వ్యవసాయ విధానాలను, గోఆధారిత వ్యవసాయ విధానాలను రైతులు చేపట్టేట్టు చూడాలి. గోవధ, తరలిస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలి.

    గోసంరక్షణకై ప్రభుత్వ చర్యలు :
    ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. గోసంతతి రక్షణకై కేంద్రస్థాయిలో చట్టం చేయాలి. కేంద్ర, రాషా్టల్ల్రో ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పర్చాలి.
     
    surya daily

లక్ష్మీదేవి ఏ స్థానంలో నివాసముంటే ఏఫలితం లభిస్తుంది ?


మానవులందరికీ ఇష్టమైన దైవం లక్ష్మీదేవి . ఆవిడ అనుగ్రహాన్ని వాంఛించని వారుండ్రరు. అయితే ఆతల్లి కరుణ పొందినా వినయంతో ఉండేది కొందరైతే అహంకారపూరితులై అష్టకష్టాలు పడేది మరికొందరు . కనుకనే పెద్దలు మానవశరీరం లో ఆతల్లి ఎక్కడ నివసిస్తే ఏ ఫలితాలొస్తాయో సంకేతరూపంలో తెలియజేశారు . ఈవిషయాన్నే జ్యోతిషశాస్త్ర రీత్యా పరిశీలిస్తే మరిన్ని వివరాలు తెలుస్తాయి .ఇప్పుడు పెద్దలు చెప్పిన సూచనలను చూద్దాం .

అమ్మవారు పాదస్థానంలో ఉంటే ఆమానవునకు పెద్దపెద్దభంతులు.విలాసవంతమైన గృహాలు లభిస్తాయట.
తొడలలో అమ్మవారి శక్తి ఉంటే ధనసమృద్ధి విశేషంగా కలుగుతుంది.
గుహ్యభాగంలో ఉంటే భార్యాసుఖం సాంసారిక ఆనందం లభిస్తుంది
రొమ్ముభాగంలో ఉంటే మనోరథాలు శీఘ్రంగా సిద్ధిస్తూ ఉంటాయి.
కంఠభాగంలో ఆతల్లి తేజస్సుఉన్నప్పుడు ఆభరణప్రాప్తి కలుగుతుంది
ముఖంలో లక్ష్మీదేవి నివాసమై ఉన్నప్పుడు అన్నసమృద్ధి యేకాక అప్రతిహతమైన ఆజ్ఞాశక్తి ,మధురమైన కవితాశక్తి పాండిత్యము లభిస్తాయి

ఇక ఈ ఆరు స్థానాలూ దాటి తలపైకెక్కిందో ...! వాని దగ్గర నిలబడదు . వివేకహీనుడై దుష్కార్యాలు చేసి తెలివిమాలినతనంతో ఆమె అనుగ్రహాన్ని కోల్పోతాడు . ఈ విషయాన్ని దత్తాత్రేయస్వాములవారు దేవతలకు బోధిమ్చి వున్నారు.
జ్యోతిషరీత్యాపరిశీలిస్తే లక్ష్మీ దేవికి సంబంధించిన గ్రహమైన శుక్రుని సంచారం తో పై సంకేతాలు కచ్చితంగా సరిపోలుతున్నవి అని జ్యోతిషకారులు చెబుతున్నారు .
జగన్మాత అగు ఆతల్లి కృపహఠాత్తుగానో,పుట్టుకతోనో మనపై కలుగవచ్చు. పూర్వజన్మలో మనం చేసిన సత్కర్మలో,ఇప్పటి సద్వర్తనమో , మనతల్లిదండ్రులు చేసిన పుణ్యమో దానికి కారణం కావచ్చు. సంపదలను అనుగ్రహించే ఆతల్లి ఆసంపదలను సద్వినియోగం చేసుకుంటున్నారా లేదా అని పరిశీలిస్తుంది . ఆడబ్బుచేరటం తో మదమెక్కి ప్రవర్తిస్తే రాక్షసులలాగానే ఎప్పుడొ ఏమరుపాటున ఆతల్లిని తలపైకెక్కించుకుని [కళ్ళుకూడా అక్కడేఉంటాయనే పెద్దలు కల్లునెత్తికెక్కాయిరా అని తిట్టేది ] కానిపనులు చేసి కష్టాలపాలు కాకూడదు . అమ్మదయతో చేరిన ఆధనాన్ని సద్వినియోగం చేసుకోవాలి .ధర్మ,కామ,మోక్షాలను సాధించుకోవటానికి జాగ్రత్తగా వినియోగించుకోవాలి .

// ఓం మహాలక్ష్మైచ విద్మహే విష్ణుపత్నైచ ధీమహి తన్నో లక్ష్మీప్రచోదయాత్ //

చనిపోయిన తరువాత ఆత్మ ఏమవుతుంది ? ఎక్కడకెళుతుంది?


స్వామి నిగమానంద సరస్వతి తో బస్తర్ మహారాజా ప్రపుల్ల చంద్రదేవ్ గారి ఆస్థానవైద్యులు డాక్టర్ మిచెల్
గారు జరిపిన ఆసక్తికరమైన చర్చ .

డా //మిఛెల్ ః- మీరు అనుమతిస్తే పరలోక విషయాలగురించి కొన్ని అడగనా ?
స్వామి నిగమానంద ; చాలాకాలంపాటు పరలోక ప్రవాసంలో ఉండటమే చావు. ఇది ఆత్మకు విశ్రాంతి స్థలం
చావులో మొదట మనుష్య జ్ఞానాన్ని కోల్పోతారు. ఇందువల్లే మరణ సమయంలో శరీరం వికృతం కావటం చూస్తాం.
చనిపోతున్నవాడికి ఎంతకష్టం కలుగుతోందోనని అనుకొంటాం. కానీ పొరపాటు. చైతన్యం నాలుగువైపుల్నుమ్చి ముడుచుకుపోయి మస్తిష్కం మీద ఒకచోట కూడుతుంది . ఇందువల్ల చైతన్యంలేని మాంసకండరాలు వికృతమవుతాయి. మరణం తరువాత ఆత్మ,మనస్సునూబుద్ధినీ కూడా తీసుకుని భౌతిక శరీరం లోనుంచి బయటకు వస్తుంది. ఆసమయంలో "వాయుభూతో నిరాశ్రయః" [వాయువుకనుక దేన్నీ ఆశ్రయించకుండా] అన్న అవస్థ ఏర్పడటం వల్ల,కంపనాల సహాయంతో సూక్ష్మ శరీరాన్ని నిర్మించుకుంటుంది . మరణం తరువాత ఏలోకానికి వెళ్లవలసి ఉంటుందో ఆలోకపు ఆత్మను కొందరు మరణించకముందే చూడగలుగుతారు. ఆ ఆత్మ అతన్ని [దాన్ని] నిర్ధారిత లోకంలోకి తీసుకుని వెళ్లటానికి సిధ్ధంగా ఉంటుంది.

పుణ్యవంతుడికి సూక్ష్మశరీరం మరణంతో పాటే తయారవుతుంది .మొదటినుంచే మస్తకం[తల]మీద ఒక తేజోమయ శరీరం ఉంటూంటుంది. దానికి సూక్ష్మమయిన దారంతో స్థూలశరీరంతో సంబంధం ఏర్పడి ఉంటుంది .మరణం సంభవించేవరకు ఇది ఉంటుంది. శ్రాద్ధకాలంలో పదిపిండాలవల్ల పది ఇంద్రియాలు ఏర్పడతాయి.ఉన్నత జీవుడి ఆత్మ త్వరగానే తయారవుతుంది. ఆత్మహత్య చేసుకున్నవాళ్ల శరీరం ఆలస్యంగా తయారవుతుంది. కానీ చూపు వచ్చినవాడికి[జ్ఞాననేత్రం తెరుచుకున్నవాడికి] ఈ ఆట స్పష్టంగా కనిపిస్తుంది.
లోకాలు ఏడున్నాయి. ప్రతి ఒక్కలోకానికి మళ్ళీ ఏడేసి స్థరాలు[పొరలు]ఉంటాయి. వీటినే సాధారణంగా,నలభైతొమ్మిదివాయువులంటారు. చనిపోయిన తరువాత ఆత్మ,పరలోకానికి వెళ్ళీ కర్మానుసారంగా ఒక విశేషస్తరంలో ఉండవలసి వస్తుంది . ఒకస్థరంలో ఉండవలసినది ముగిసిపోయినతరువాత కొత్తస్తరంలో కొత్త భోగశరీరం తయారవుతుంది. ఈ విధంగా మనిషి ఎన్నిసార్లు జన్మ ఎత్తితే అన్నిసార్లు చనిపోతాడు. దీనికి అంతంలేదు. ఈ లోకం ఏడు లోకాలకు కేంద్రం . ఈ కేంద్రం నుంచి ఆత్మపైకిలేవగల్దు.క్రిందకు పడగలదు. ఇది ఆత్మఘనంలా నిర్మాణమయి ఉంటుంది . మహర్లోకంలో అనుభవించవలసిన కారణమ్ ఏదీ మిగలకపోయినట్లయితే అది క్రమముక్తి మార్గంలో ముందుకు సాగుతుంది.వీతికికూడా పైన ఒకలోకం ఉంటుంది. దీన్నిగురించి ఇతర సంప్రదాయములవాల్లెరుగరు. దాన్ని నిత్యలోకం లేక భావలోకం అంటారు. ఈ లోకానికి సంబంధించినదంతా అతి విచిత్రంగానూ రహస్యమయంగానూ ఉంటుంది .

డా మిఛెల్ ః -- మంచిది స్వామీజీ ! భూతప్రేతాలనుగూర్చి మీ అభిప్రాయం ఏమిటి ?
స్వామి నిగమానంద ః --- చనిపోయిన తరువాత అసంతృప్తిగల ఆత్మకు ఉండే వాయురూపాన్నిభూతమనీ,ప్రేతమనీ అంటుంటారు. కింది స్థాయి మనిషి,లేదా ఆత్మహత్యచేసుకున్నవాడుచాలా దినాలవరకు స్తబ్దంగా లేదా మోహగ్రస్థ పరిస్థితిలో ఉండవలసి వస్తుంది.అతను చచ్చిపోవడమయితే జరిగింది,కానీ ఆసంగతి తెలుసుకోవడానికి అతనికి అనేక సమవత్సరాలు పడుతుంది .ఎందుచేతనంటే అతని ఆత్మ ఆసమయంలో గాఢసుషుప్తలో ఉంటుంది. భూతప్రేతాలు మనుష్యశరీరాన్ని ధరించడం సులువుకాదు. అనేకప్రయత్నాలు చేసినమీదట అది భాష్పీయ[ఆవిరివంటి] శరీరాన్ని పొందుతుంది. భాష్పంఘనీభవించి మనుష్య ఆకారం పొందగలుతుందికూడా . కానీ ఆ శరీరం సమాన్యకారణాలవల్ల కరిగిపోగలదు.పరలోక గతమయిన ఆత్మ రక్తసంబంధీకులతో ఏదయినా చెప్పడానికి శరీరాన్ని ధరించవచ్చు. పమ్చభూతాల్లో ఏ ఒక్కదాన్నయినా ఆశ్రయించి భూతం వెల్లడికావచ్చు,. . ఏదయినా విశేషమయిన వాసన సోకినట్లయితే భూతం వాసనను ఆశ్రయించుకుని వచ్చినదని గ్రహించవచ్చు. శబ్దాన్ని ఆశ్రయించుకుని వచ్చినట్లయితే కర్కశ ధ్వని,భాజాలు,సంగీతం,లేదా చెట్టుకొమ్మ విరిగిన చప్పుడు వినిపిస్తుంది.
డా//మిఛెయిల్ ః-- చనిపోయిన తరువాత సూక్ష్మ శరీరం వెళ్ళేదెక్కడికి ?
స్వామి నిగమానంద ః-- సాధారణ మనుష్యుని సూక్ష్మశరీరం అంటే ప్రేతదేహం.స్వర్గలోకం వరకు చేరుతుంది.మహర్లోకం చేరిన తరువాత దేహం నశించిపోతుంది. కేవలం పొగ మిగిలిఉంటుంది .ఆవాయుశరీరాన్ని ఆధారమ్ చేసుకునే పైలోకాలకు లేవవలసి ఉంటుంది. మహర్లోకంలో శరీరం నశించిపోయేంతవరకు అనుభవించాలన్న కోరిక పిసరంత మిగిలిఉన్నా అతని పతనం తప్పదు. అంటే స్థూలశరీరం లేకపోవడం వలన అతను భూలోకం వచ్చి శరీరధారన చేయవలసి ఉంటుంది.
డా.మిఛెల్ ః--- ఆజీవి భూలోకానికి చేరేదెలా ?
నిగమానంద సరస్వతి ః- అతను స్వర్గంలోకం లోంచి ఆకాశంలోకి వస్తాడు. మబ్బులద్వారా వర్షమయి భూగోళానికి దిగివచ్చి నేలను చేరుతాడు. తరువాత మొక్కగా మారుతాడు.దాన్ని మనుషులు తినవచ్చులేదా పశువులు తింటాయిఅలా తిండిద్వారా రక్తంలోకి వెళ్లి వీర్యమయి తల్లికడుపులోకి చేరుతాడు.మనిషిగాగాని లేదా పశువుగానైనా ఏదో ఒకజీవరూపం పొందుతాడు. కర్మానుసారంగా ఉంటుంది ఆజీవి జన్మ .అంతకుపూర్వం అనుభవించగా మిగిలిఉన్నదాన్ని ఆజీవి ఇప్పుడనుభవిస్తుంది . ఈవిధంగా ఆజీవిభోగం[అనుభవం]పూర్తవుతుంది.

What Should do to remove navagraha doshas?

గ్రహదోషాలు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి?

నవగ్రహాలలో ఒక్కో గ్రహ దోషమూ ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అయితే ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలను దోషాలను తొలగించుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అవేంటో చూద్దాం..!

కుంకుమ, ఎర్ర చందనం కలిపిన ‘రాగిపాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన సూర్య గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే కుంకుమ, గంధం కలిపిన నీటిని ‘శంఖం’తో పోసుకుంటే చంద్రగ్రహ దోషాలు దూరమవుతాయి.

గంధం, తిలలు కలిపిన ‘రజిత పాత్ర’లోని నీటితో స్నానమాచరించడం వలన కుజదోషాల తొలగిపోతాయి. ఇక నదీ సాగర సంగమంలోని నీటిని ‘మట్టిపాత్ర’లో పోసి స్నానం చేసినట్లయితే బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి.

మర్రి, మారేడు కాయలను బంగారు పాత్రలోని నీటిలో వేసి స్నానం చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రుడిని ధ్యానిస్తూ ‘రజిత పాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన శుక్ర గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇక నువ్వులు, మినువులు కలిపిన ‘లోహపాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది.

ఇక గేదె కొమ్ము(డొల్ల)తో స్నానం చేయడం వలన రాహు గ్రహ దోషాలు తొలగిపోతాయి. పవిత్రమైన మట్టిని కలుపుకుని స్నానం చేయడం వలన కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు

Vakratunda Mahakaya.mp3 song from Telugu Movie: Devullu. 

మాయ అంటే ?

రామక్రిష్ణ  పరమహంస ఒకసారి "మాయ ను దర్శించాలనుకున్నారు . కాళి మాతను  ప్రార్దించారు . గంగానది వైపు చూస్తుండగానే ఆ జలాల్లోంచి ఒక చిన్న బుడగ బయటికి 
వచ్చింది . అది అలా లేచి క్రమేపి పెద్దదవుతూ గట్టు మీదకి వచ్చి, చూస్తూ ఉండగానే ఒక స్త్రీ గా మారింది . ఆ స్త్రీ ప్రౌడఐ ఒక బిడ్డను ప్రసవించింది . కాసేపు ఆ బిడ్డను పోషించి, పెంచి ,
ప్రేమతో లాలించి పెద్దచేసింది . కొద్ది సేపటికి ఎక్కడి నుండో కత్తిపీట తెచ్చింది . అంత  సేపు ఆలనా,
పాలనా చూస్తూ కానీ పెంచిన బిడ్డను  చిన్న చిన్న ముక్కలుగా తరిగి,కరకరా నమిలి మింగేసింది . తానూ ఆ జలాల్లో కలిసిపోయింది .అయితే ఆ స్త్రీ ముఖములో నీటి   బుడగనుంచి ఉత్పన్నమైన  క్షణము నుంచి ,తిరిగి నీటిలో కలిసి పోయేవరకు ఒకే రకమైన ప్రసన్నత వుంది రామకృష్ణులు  వంక  పలకరింపుగా  నవ్వి,  అంతర్దానమైంది  . వారికీ దృశ్యము అనుభూతమైనంత సేపు , చుట్టు పక్కల జనం సంచరిస్తున్నారు . వారెవరికీ  దృశ్యం కనిపించినట్లు లెదు. అప్పుడు కాళికా దేవి ఇలా వివరించింది . "నీవు చుసిన దృశ్యం మాయ . అయితే మాయను చూచు టకు ఒకడున్డాలి . చుచువానిని విడిచి మాయ లెదు. చూచువాడు కూడా ఆ మయాసమ్భవములొ ఒక పాత్రను పోషిస్తాడు" .రామక్రిష్ణులు అప్పటికే జ్ఞాన  సిద్ధులు కాబట్టి స్వయముగా ప్రభావితులు కాకుండానే అ దృశ్యాన్ని దర్శించ గలిగారు . అలా కాని వారికి అది సాధ్యము కాదు. మాయానుభుతికి ఏంటో కొంత సుంకం చెల్లించాలి .అంటే అందులో పాత్రను పోషించి ,దాని కాస్త నష్టాలను, పంచుకొవాలి. ఈ అనుభూతి  ద్వారా మాయను గురించి గ్రహించ వలసిన అంశాలు వున్నయి. 
1. మాయ తాత్కాలికమ్. దానికి మొదలు ,మధ్య,తుది ,వున్నాయి . 
2. దానిలో సంఘటనలు ముందు ఆకర్షణీయముగా ఉన్నప్పటికీ, చివరికి దుఃఖము గానే మారుతున్నయి. 
3. రామక్రిష్ణుల దర్శనములో మాయారూపిణి అయిన స్త్రీ గంగా జలము నుండి పుట్టి తిరిగి గంగ లోనే కలిసి పొయింది . అంటే కాదు తాను సృటిన్చిన బిడ్డని , తెగ నరికి తిరిగి తనలోకే అంతర్హితం చేసుకుని మరీ గంగలో కలసిపోయింది . గంగ అంటే పరబ్రహ్మము. కాబట్టి మాయ బ్రహ్మము నుండి పుట్టి, దాని నుండి  పడినట్టుగా కనిపించి తిరిగి   బ్రహ్మము లో నే కలిసి పోతుంది . పై దృశ్యము లోని   స్తేరీ మాయకు సంకెతము. ఆమె కని , ప్రేమతో పెంచిన  బిడ్డ ఆమె  ,  దేహముతో కలుపుకుని ఈ ప్రపంచానికి సంకెతము.అనగా మాయ తాను కన్న ప్రపంచములో అంతర్భగమె. ముందు ఆకర్షణీయముగా తోచిన ప్రపంచమే చివరకు విషం, విషమం అవుతుంది . దానిని వదిలిన్చుకోవటమే అభ్యాసము. దానిక్ సాధనం విచారమనే కత్తిపీట . తన సృష్టి అనే శిశువును    ఖండించి అంతర్హితం చెయ్యాలి . అనగా దేహ భావన , ప్రపంచ భావన అంతరించాలని అన్తరార్ధము. అప్పుడే జీవునికి మరలా గంగా ప్రవేశము - అనగా బ్రహ్మ నిర్వాణం, బ్రహ్మము లో  కలియుట .  

భగవానులు _నాస్తిక వాది

భగవంతుని ఉనికిని ప్రశ్నిస్తూ అధ్యాత్మికవాదులను , ధార్మికులను తన వాద పటిమతో ఓడిస్తూ ప్రఖ్యాతి పొందిన ఒక ధృడమైన నాస్తిక వాది ఒకరు భగవాను వద్దకు వొచ్చారు.

ఆయన అలవాటు ప్రకారం - "దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడని మీరు రుజువు చేయగలరా? అంటూ రమణులపై తన ప్రశ్నల వర్షం కురిపించారు.

అతని యెడ చిరునవ్వు ప్రసరిస్తూ భగవాన్ ఇలా అన్నారు- "దేవుని గురించిన చింత నీకెందుకు? ఆయన గురించి ఆయనే విచారించుకొంటాడు .

అసలు ఈ ప్రశ్న ఎవరికి కలిగిందో ఆలోచించు
."
అని


ఆ పృచ్చకుడికి ఇదంతా అంతు చిక్కని అయొమయంగా ఉంది.

అది గమనించి భగవాను అతడిని "నేనెవడిని(Who Am I)"అనెడి పుస్తకము చదవమని ఆదేశించారు.

భగవానును కలిసి ఆశ్రమములో కొద్ది రోజులు మాత్రమే ఉండాలని భావించిన ఆ వ్యక్తి ఇలా అన్నాడు.

" కొన్ని దినముల వరకూ దేవుడిని తిరస్కరిస్తూ నాస్తికవాదిగా వచ్చాను. అప్పుడే నేను ఆనందముగా ఉన్నను. కాని,

ఇప్పుడు "నేనెవడిని""అని ప్రశ్నించుకొని చింతన చేయడం ప్రారంభించిన తరువాత నేను పూర్తిగా గందరగోళములో పడిపోయాను .

సంతోషం కోల్పోయి నేను చాల బలహీన పడినట్లు భావిస్తున్నాను "అని.



భగవాను అతని యెడ అమిత దయతో, ఔదార్యముతో కూడిన చిరునవ్వు చిందిస్తూ జవాబిచ్చారు--

"నీలో ఏర్పడిన గందరగోళం బలహీనతకు సంభందించినది కాదు. ఇంత కాలమూ నీవు నీ సహజస్థితి యైన ఆత్మానుభూతి అనే సత్యానికి దూరముగా ఉన్నావు.

ఈనాడు తలెత్తిన ఈ మూలాధార ప్రశ్న నిన్ను ఆ అజ్ఞానమునకు దూరంగా నడుపుతున్నది. కనుక అది అభివృద్ధే.

అజ్ఞానము నుండి సంశయ స్థితికి, సంశయము నుండి స్వచ్చతకు (మానసిక), స్వచ్చత నుండి అనుభూతికి, తద్వారా ఆత్మలో లీనమగుట--- ఇదీ అధ్యాత్మిక సాధన మార్గములో ఆరొహన క్రమము." అని

అజ్ఞానులలో నిండి ఉన్న అంధకారమును చిన్నాభిన్నము చేసి,

ధారళంగా ప్రసారం చేయబడుతున్న భగవాను యొక్క దయా విశేషము పొందుటకు తగిన శక్తివంతులను గావిస్తుంది భగవాను సన్నిధి.


విశ్వాసమున్నవానికికదా విలువ అర్ధమయ్యేది

ఒక గురువుగారివద్దకు ఒకాయన శిష్యరికం చెయ్యాలని చేరాడు. గురువుని సేవించుకుని వారి అనుగ్రహం కలిగినదాకా వేచివుండే ఓపికలేదాయనకు. తరచుగా గురువుగారూ నా కేదన్నా మంత్రముపదేశించండి, దానిని జపించి ధ్న్యమవుతాను అని రోజూ వేధించటం మొదలు పెట్తాడు. సరే ఈయన పోడుపడలేక సరే రేపు నీకు ఉపదేశం చేస్తాను రమ్మని చెప్పాడు గురువు గారు. ఈ యనకు సంతోషం పట్టరానిదయింది. రాత్రంతా ద్దనిగురించే ఆలో చించి, నేను మిగతావారి కంటే యోగ్యున్ని కనుకనే ఎప్పటినుంచో వున్నవాళ్ళకంటే నాకే గురువుగారు మంత్రోపదేశం చేస్తున్నారు,అని పొంగిపోయాడు. తలతలవారుతుండగనే శుచిగా గురువుగారి సన్నిధానానికి వెళ్ళాడు.
ఏదో గొప్ప మంత్రం తనకు లభిస్తున్నదని ఆయనకు పరమానందంగా ఉన్నది.

గురువుగారుఆయనను దగ్గరకు పిలచి నాయనా ఇది పరమపవిత్రమయిన మంత్రం ,దీనిని జపించి తరించుఅని చెవిలో హరేరామ హరేరామ రామరామ హరెహరె ,హరెకృష్ణ హరెకృష్ణ కృష్ణ కృష్ణ హరెహరె అనే నామ మంత్రాన్ని ఉపదేశించారు. అంతే శిష్యుని ముఖం లో ఒక్కసారి వుత్సాహం తుస్సుమని జారిపోయింది. నిరుత్సాహంగా వున్న శిష్యుని ముఖంచూసిన గురువుగారు ,ఏమ్ నాయనా అలా వున్నావేమి అని అడిగాడు. స్వామీ మీరేదో గొప్ప మంత్రం ఉపదేశిస్తారని ఆశపడివస్తే మీరిదా చెప్పేది. ఇదినాకు తెలుసు ,మాయిట్లో అందరికీ వచ్చు ,మాఊరి రామాలయమ్లో ప్రతిరోజు భజనగ పాడతారు తెలుసా? దీనిలో పెద్ద మహిమేమిఉంటుంది గురువుగారూ ? అని విచార పడ్డాడు. గురువుగారునవ్వి దగ్గరగూట్లోవున్న ,మసిగొట్టుక పోయిన ఒక రంగురాయిని తెచ్చి ఇచ్చి, నాయనా దీనిని తీసుకెళ్ళి అమ్మటానికి ప్రయత్నించు ,కానీ పదిమందికి అమ్మచూపి దీనివిలువ ఎంతుంటుందో తెలుసుకో ,అన్నిటికంటే ఎక్కడ ఎక్కువ ధర పలికితే అక్కడ అమ్ముదాము. ఆశ్రమ ఖర్చులకు కావాలి. ఈ పనిచేసి పెట్టు, తరువాత నీకు మంచిమంత్రం ఉపదేశిస్తాను అని చెప్పాడు.
శిష్యుడు దానిని తీసుకువెళ్ళి సరకులదుకాణం లో వున్న తనకు తెలిసిన ఒక వ్యాపారికి చూపాడు. ఆయన దీనిని చూసి, ఆ... ఇదేదో పాత రంగురాయి. కాసిని వుల్లిగడ్దలువస్తాయి అదే ఎక్కువ ఇవ్వమంటావా? అన్నాడు. అక్కడనుండి దానిని తీసికెళ్ళి కంసాలికి చూపాడు. ఇది రంగురాయి మహా అయితే ఒక 50 రూపాయలువస్తాయన్నాడు. దానిని ఇతను బంగారపు వ్యాపారివద్దకు తీసుకెల్లాడు. అక్కడ వాళ్ళు దీనిని ముక్కలగా చేసి వుంగరాలకు వేయవచ్చు నాలుగువందలిస్తామన్నారు. ఇలాకాదని దానిని ర్త్నాల వ్యాపారం చేసేవారివద్దకు తీసుక వెళ్ళగా వాళ్ళు అయ్యా ఇదిజాతిరత్నం పదివేల రూపాయలిస్తాం ఇస్తారా? అని అడిగారు. అబ్బో ఇదేదో విలువగలదానిలాగా వుందే ,అని పెద్దపట్టణానికి చేరుకుని అక్కడ వ్యాపారులకు చూపాడు. వాళ్లు ఆశ్చర్యపడి అయ్యా దీనికి లక్షరూపాయలదాకా విలువ చెల్లిస్తాం ఇస్తారా? అనిఅడిగారు. దాంతో ఇతనికి దీనివిలువ ఇంకా చాలాఉండవచ్చునని అనుమానం పెరిగి ఆరాజ్య రాజుగారివద్దకు దీనిని తీసుకెళ్ళి దర్శించుకుని రత్నాన్ని చూపించాడు.
రాజుగారు దానిని అక్కడున్న రత్న పరీక్షకులకిచ్చి దీనివిలువ లెక్క కట్టమన్నాడు. వారు అనేకపరీక్షలు చేసి అత్యంత ఆశ్చర్యంతో, మహాప్రభూ భూమిమీద అత్యంత దుర్లభమయిన రత్నమిది దీని విలువను మనం లెక్కకట్టలేము . మన రాజ్యం మొత్తం ఇచ్చినా దీని విలువకు సరిపోదు అని వివరించారు.
దానితో విపరీతమయిన ఆశ్చర్యానికి గురయిన ఆ శిష్యుడు, దానిని మాగురువుగారు అమ్మవద్దన్నారనిచెప్పి మహారాజు వద్ద సెలవుతీసుకుని గురువుగారివద్ద పరుగుపరుగున చేరాడు.. గురువుగారూ మీరెంత అమాయకులండి మీరిచ్చినది సామాన్య రాయికాదండీ అమూల్య మయినది. మీరెంత పిచ్చివారండి ,ఇంతవిలువయిన రత్నం దగ్గరున్నా దీని విలువ తెలుసుకోలేకపోయారు. అని లబలబలాడాడు. ఎక్కడెక్కడ
ఎవరెవరు ఈ రత్నానికి ఎంతవెల నిర్ణయించారో వారి అమాయకత్వమేమిటో వివరించాడు.
అప్పుడు గురువుగారన్నారు. చూసావా నాయనా ఈరత్నం విలువను ఎవరిస్తాయిని బట్టి వారు నిర్ణయించారు. పూర్తిగా తెలిసినవారే దీని అసలు విలువ తెలుసుకో గలిగారు. లేకుంటే వుల్లిగడ్డలకే దీని విలువ భావించబడేది. అలాగే నీకు కూడా వుపదేశించబడిన నామం విలువ తెలియలేదు. దానివిలువ తెలియాలంటె సాధించిననాడుగాని నీకు అర్ధం కాదు. అని వివరించాడు

ఆత్మపూజ‌, ‌ ఆత్మభోజనం

ఒక మహానుభావునికి, ఆధ్యాత్మికసాధనలో తాను చాల పైస్థాయికి చేరుకున్నానని నమ్మకం కలిగి0ది. పూజలు వ్రతాలు అర్చనలన్నీ, వృధాపనులని ఆయనకు నమ్మకం ఏర్పడిపోయింది. ఆత్మపూజ ముఖ్యం , తక్కినవన్నీ
అనవసరమన్న వాదనతో మిగతావారి నమ్మకాలను అవహేళన చేస్తుండేవాడు. ఒకసారి ఆయన సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే ఒక ఆశ్రమం లో జరిగే ఒక కార్యక్రమానికి ఈయన హాజరవడం జరిగింది. అక్కడేవో పూజలు , అభిషేకాదులతో కార్యక్రమం చక్కగా జరుగుతున్నది. అవన్నీ చూస్తున్న కొద్దీ ఈయనకు వీరిఅజ్జానం పట్ల జాలి కలిగింది. వారిచర్యలను పరిహసిస్తూ చిన్నగా వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెట్టాడు.

మెల్లగా కొందరు నాలాంటి బద్దకస్తులు కొందరు ఈయన ప్రక్కన చేరి, స్వామీ, తమరు మాకు వాస్తవసత్యాన్ని తెలియ జేయండి. అని కోరారు. చూడండి నాయనా, ఆత్మపూజ మాత్రమే భగవంతునికి చెందుతుంది. ఇలాంటి బాహ్య పూజలవల్ల ఒరిగేదేమిలేదు, కొబ్బరిచిప్పలు, బెల్లం ముక్కలు తప్ప. అంటూ తనపైత్య వేదాంతాన్ని వీరికి యెక్కించడం, ఆశ్రమాధిపతి ఐన స్వామీజీ గమనిస్తున్నాడు.
కర్యక్రమం ముగిసింది. భోజనాల సమయం వచ్చింది. భక్తులంతా ఆకలితో నకనకలాడుతున్నారు. వడ్డనలు ప్రారంభమయ్యాయి. మన ఆత్మజ్జాని గారుకూడా పంక్తిలో కూర్చున్నారు. విస్తర్లలోవడ్డిస్తూ వస్తున్నవారు అందరికీ అన్నీ వడ్డిస్తున్నారుగాని, ఈయన దగ్గరకొచ్చేసరికి వడ్డిస్తున్నట్లు చేతులు ఊపుతున్నారేగాని పదార్ధాలేవీ విస్తర్లో పడటం లేదు. లడ్లు, వడలు పుళిహోర దద్దోజనం కూరలు వడ్డన సాగుతోంది కానీ మన గురూజీ విస్తర్లోమాత్రం ఏమీ పడలేదు. అసలే ఆకలి మండిపోతున్నది, దానికితోడు వీరివ్యవహారం .మంటనషాలాని కెక్కింది. ఏమిటయ్య మీ వ్యవహారం? తమాషగా ఉందా? నాకొక్కడికే వడ్డించడమ్లేదు.శివాలెత్తి పోతున్నాడాయన. ఈ గొడవకు ఆశ్రమాధిపతి వచ్చారు. ఏమిటినాయనా గొడవ? ప్రశ్నించారు.మీవాళ్ళ పద్దతేమ్ బాగాలేదు స్వామీ, విషయం చెప్పాడు ఆత్మజ్జాని. ఏ0 నాయనా వారుచెప్పేది నిజమా? ప్రశ్నించారు స్వామీజీ. అవును స్వామీ, వారు ఆత్మజ్జానులు కదా! మామూలు బోజనం చేయరేమో,,ఆత్మ భోజనం మాత్రమేచేస్తారేమోనని అనుకున్నాం స్వామీ. మన్నించండి అన్నారు వినయంగా................... అంతే మనఅత్మజ్జానికిఅప్పుడర్ధమైంది.

లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారమే ఎందుకు చేయాలి?

లక్ష్మీదేవిని గురు, శుక్రవారాలలో ప్రత్యేకంగా పూజి స్తారు. ఈ రోజులలో దేవిని ప్రసన్నం చేసుకుని, ఆమె ఆశీ స్సులు పొందేందుకు వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవికి ప్రీతిక రమైన స్తోత్రాలు, స్తుతులు ఆరోజునే పఠిస్తారు. ఆ రోజు కొంత…మంది ఉపవాసంఉంటారు.ఈనాడుమానవులేకాదు, పురాణాలలో రాక్షసులు సైతం శుక్రవారం లక్ష్మీదేవిని పూ జించేవారనడానికి ఉదాహరణగా అనేక కథలున్నాయి. అసలు శుక్రవారమే లక్ష్మీదేవికి ఆరాధనకు అనుకూలమై న దినంగా ఎందుకు పేరుమో సింది? రాక్షసులు కూడా ఆ రోజే లక్ష్మీదేవినిఎందుకు ఆరాధించేవారు? అందునా రాక్ష ససంహారి అయిన విష్ణుమూర్తి భార్యను రాక్షసులు పూజిం చడమేమిటి? ఈ సందేహాలన్నీ వస్తాయి. ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే... రాక్షసుల గురువు శుక్రాచార్యు డు. ఈ శుక్రాచార్యుల పేరు మీదుగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఇకపోతే శుక్రాచా ర్యుడి తండ్రి భృగుమహర్షి. ఈ భృగుమహర్షి బ్రహ్మదేవు డి సంతానంలో ఒకరు. ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా! అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు. ఈ విధంగా లక్ష్మీ దేవికి శుక్రా చార్యుడు సోదరుడు. అందుకే ఆమెకు శుక్ర వారం అంటే ప్రీతికరమైనది. లక్ష్మీదేవి రూపు రేఖలలో వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం వుండి.

లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగుకి శక్తికి, ఆ కుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకౄఎతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిథి. అం దుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు. బంగారం ఐశ్వర్యనికి సంకేతం. ఐశ్వ ర్యాధిదేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీపూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కానీ, విష్ణుమూర్తిని దరిచేరలేరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్ర వర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు. ఈ రెండూ ఉంటె ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు.

లక్ష్మీ కటాక్షం కావాలా ??


'ధనమున కల్గు సత్ఫలము ధారుణి మర్మములన్‌ గ్రహింపగన్‌' అన్నాడు ఒక మహానుభావుడు. ప్రపంచంలో బతకాలంటే ధనసముపార్జన తప్పని సరి. ధర్మచింతనతో నలుగురికి సాయపడాలన్నా ధనవంతుడైవుండాలి. ఒకనాడు డబ్బు లేక పోయినా అనేక మార్గాల్లో మానవుడు అనుకున్నది నెరవేర్చుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు అన్నిటికీ డబ్బు కావాలి. ఇది ఎవరికీ తెలియంది కాదు. అయితే డబ్బును సంపాదించ డానికి మనిషి పడేపాట్లు అన్ని ఇన్ని  కాదు. డబ్బు ఆర్జించడం కోసం చేయని ఉద్యోగం లేదు, వేయని  ఉపాయం లేదు. మనిషి  ప్రయత్నమంతా  డబ్బు కోసమే. ఐశ్వర్యాభివృద్ధి కోసం కుబేర పూజను చేస్తే ఐశ్వర్యం, అభివృద్ధి ఒకేసారి దక్కుతుంది.. లక్ష్మి ధనకనకాధులు, అదృష్టం, సౌందర్యా లనిచ్చే దేవత. లక్ష్మి కృపాకటాక్షం లేకుండా ఏది చేసినా అది వృధా.  ధనానికి మరో అధిపతి కుబేరుడు. ఉత్తరం దిక్కు వైపు ప్రతినిధి అయిన కుబేరుడు భూ మండలంలోని ఆగర్భంలో ఉన్న సమస్త నిధి నిక్షేపాలకూ యజమాని..పురాణ లలో తెలిపినట్టు అతి శ్రీమంతుడు అనిపించుకున్న శ్రీ వెంకటేశ్వరస్వామి కూడా కుబేరుని వద్ద తీసుకొన్న అప్పుకు వడ్డీ మాత్రమే చెల్లిస్తూ ఉన్నాడు. లక్ష్మి పూజను భారత దేశమంతటా వివిధ రకాలుగా ఆచరిస్తున్నారు. లక్ష్మి కుబేర పూజ ను ఒకే సారి కలిపి నెరవేర్చినపుడు వారిరువురినుండి దొరికే ఆశీర్వాదం, శ్రేయస్సు, ద్విముఖమై పేదరికం, దారిద్య్రాలు దూరం అవుతాయి. లక్ష్మి కుబేరుల ఆరాధనను సులభంగా ఆచరించడానికి సామాన్య మంత్రా లను ఈ కింద ఇవ్వడమైంది. కుబేర, లక్ష్మీ మంత్రాలు వేరు వేరుగా దొరుకుతాయి. వాటిని పూజా గదిలో దేవుని ముందు ఎర్ర రంగులోని వస్త్రం పై ఉంచి దీప-ధూపాలతో పూజించాలి. ఓపికను బట్టి సాధ్యమైతే నిత్య నైవేద్యం కోసం ఏదైనా తీపి లేదా, తేనె, లేదా నెయ్యి చెక్కెరను సమర్పించవచ్చు. శంఖం దొరికితే దాన్ని దేవుని పీఠం ముందు ఉంచి షోడ షోపచారాలతో పూజించడంవల్ల అష్టై శ్వర్యాలు సిద్ధించును. లక్ష్మీ మంత్రం: - ఓం శ్రీ హ్రీం క్రీం లక్ష్మీ దేవ్యై నమ: కుబేర మంత్రం:-- యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనాధిపతయే ధనధాన్య“సమృద్ధియే మేహి దాపయ స్వాహా! పై రెండు మంత్రాలనూ రోజుకు కనీసం 108 సార్లు చొప్పున తొమ్మిది నెలలు జపిస్తే సిరులపంట పండుతుంది. పేదవారికి ఉన్నంతలో దానధర్మాలు చేస్తూవుండాలి. 

ఆయనే ఈయన !



ఒకసారి కొత్తగా వచ్చిన ఉన్నతాధికారి ఒకరు తన శాఖ మంత్రిగారి నివాసానికి వచ్చాడు. ద్వారం దగ్గర అనుమతి తీసుకొని లోనికి వచ్చాడు. అక్కడ  చిన్న తోట ఉంది...అందులో  ఒక మనిషి బనియన్‌, నిక్కరుతో మొక్కల మధ్య కలుపు తీస్తూ  నీళ్ళు పెడుతున్నాడు.
ఆ కొత్త అధికారి అతడిని చూచి, ''ఒరే మాలి! నేను మంత్రిగారిని కలవాలి. వెంటనే లోనికి వెళ్లి ఈ కార్డు ఇచ్చిరా!'' అంటూ తన పరిచయం గల కార్డిచ్చాడు. ఆవ్యక్తి అది పుచ్చుకొని మరేం మాట్లాడకుండా లోనికి వెళ్ళాడు పిదప తన ధోవతి, లాల్చీ ధరించాడు తలపై టోపీ పెట్టుకొన్నాడు. బయటకు వచ్చాడు.
ఆ తరువాత ఆ అధికారి వద్దకు వెళ్లి- 'మీరులోనికి రండి . వచ్చి కూర్చోండి, నేనే మీరు కలవాల్సిన మంత్రిని' అన్నాడు. సాదాసీదాగా ఉన్న అతగాడిని చూసి  ఆ కొత్త ఆఫీసరు కంగుతిన్నాడు. ఇందాక తను చూచిన వ్యక్తే లాల్‌బహదూర్‌ శాస్త్రి అని పోల్చుకున్నాడు. తన పొరబాటును క్షమించమని ఎంతగానో వేడుకున్నాడు.
అందుకు శాస్త్రీజీ- 'మరేం ఫరవాలేదు. పని చిన్నది పెద్దది అని వుండదు. చేసే పనిని బట్టి మనుషుల్ని విలువకట్టడం సరికాదు. మనుషుల్ని మానవతా దృష్టి తో చూడడం నేర్చుకుంటే మంచిది' అంటూ హితబోధ చేశారు. శాస్త్రిజీ  నిరాడంబరజీవి . మానవతా మూర్తి అందుకే అంత గొప్పవారుగా పేరు పొందారు మరి?ఈ తరం నేతలు ఆయనను చూసి నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది.

మౌనం గా ఉండగలరా ??


నేను ఉత్త వాగుడు కాయను అని మా స్నేహితులు అనే వారు.
 వాళ్ళు అన్నారని కాదు కానీ అదేమిటో ఎప్పుడు ఏదో ఒకటి మాట్లాడుతూనే వుంటాను.

కొన్ని సార్లు అతిగా మాట్లాడి స్నేహితులను దూరం చేసుకున్నాను. మన మాటలు ఎదుటి వాళ్ళను నొప్పిస్తాయని కావాలని ఎప్పుడు మాట్లాడలేదు. ఏదో ఆవేశం లో మాటలు దొర్లి పోతుంటాయి. దగ్గరి బంధువులు కూడా నొచ్చుకున్న సందర్భాలు లేక పోలేదు. వయసు పెరిగే కొద్ది అనుభవాలు ఎదురయ్యే కొద్ది వాగుడు తగ్గించేసాను. మాట్లాడకుండా ఉండటం లేదా  అతి తక్కువగా మాట్లాడటం మొదట్లో కష్టం అనిపించింది. తర్వాత అందులో సుఖం అర్ధమైంది. మా వాళ్ళందరూ నాలో మార్పు చూసి ముక్కున వేలేసుకున్నారు.
 వాస్తవానికి  "మౌనం" సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుంది అని చెప్పుకోక తప్పదు. 
పూర్తిగా మౌనం గా ఉండ లేకపోయినా కనీసం ఎక్కువగా మాట్లాడటం తగ్గించుకోవాలి. అయితే కమ్యూనికేషన్ కొత్త పుంతలు తోక్కిననేపధ్యం లో మౌనంగా వుండటం  కానీ
 మాటలు తగ్గించడం కానీ సాధ్యమా ?
అంటే చాలా చాలా  కష్టమే అని చెప్పు కోవాలి. కొంతమందిని చూడండి.ఒక్క నిమిషం కూడా సెల్ ఫోన్ ని వదలరు.బాత్ రూం లో కూడా మాట్లాడుతుంటారు  అసలు మౌనం గా ఉండటానికి లేదా  మాటలు తగ్గించడానికి  చాలా ప్రాక్టీసు అవసరం.  మనసును నియంత్రించాలి.అహాన్ని అణుచు కోవాలి. ఒక్క మాటలో చెప్పాలంటే   పంచేద్రియాల పై పట్టు బిగించాలి.  అప్పుడే మౌనం సాధ్యం అవుతుంది. 
 వాక్కుని నిరోధించడమే మౌనం. దీనినే మౌనవ్రతం అంటారు. 
ఇలా మౌనంగా ఉండటం వల్ల పరుషవచనాలు పలకటం, అబద్ధాలాడటం, ఇతరులపై చాడీలు చెప్పటం,  అసందర్భ ప్రలాపాలకు  అవకాశం లభించదు.ఎవరితో ఏ గొడవా  ఉండదు.
 మనసును ప్రశాంతంగా ఉంటుంది.బీపీ షుగర్ లు తగ్గుతాయి.తద్వారా ఖర్చు కూడా తగ్గిపోతుంది.నిజమా అని ఆశ్చర్య పోకండి.నిజమే.
 ప్రపంచంలో మౌనానికి ఉన్న శక్తి దేనికీ లేదు. 
  మన ఆలోచనలను, దృక్పథాలను మనసులో దర్శించుకోవడానికి మౌనం చాలా అవసరం. 
నిశ్శబ్దంగా ఉన్నప్పుడు మన అహం నిద్రాణస్థితిలోకి వెళుతుంది.  అప్పుడు వాస్తవ ప్రపంచాన్ని స్థిమితంగా చూడగలుగుతాం.  అలా చేయడం వల్ల శరీరం నూతన తేజస్సును, కాంతిని పొందగలుగుతుంది.  నిరంతరం మాట్లాడుతూ ఉండటం వల్ల మన చుట్టుపక్కల ఉన్న సౌందర్యాన్ని చూడలేకపోతున్నాం.
 ఎవరితోనైనా వాదించటం కంటె మౌనంగా ఉండటం ఉత్తమం. 
ఇలా ఉండటం వల్ల అనవసరమైన కోపాన్ని నియంత్రించుకోవచ్చు.  ఎప్పుడైతే కోపాన్ని అణచుకోగలుగుతామో, అప్పుడు శరీరభాగాలు విశ్రాంతిదశలో ఉంటాయి.  రక్తప్రసరణలో హెచ్చుతగ్గులు ఉండవు. హృదయస్పందన ప్రశాంతంగా ఉంటుంది.  పలు రోగాలకు దూరం గా వుంటాము.  మన పట్ల కోపం తో ఎవరైనా పెద్దగా అరుస్తున్నప్పుడు కూడా మౌనమే ఉత్తమమార్గం.  అనవసరంగా అరవడం, కోపం తెచ్చుకోవడం వల్ల శరీరం  శక్తిని కోల్పోతుంది.  ఉద్యోగాలు చేసే చోట, చాలామంది ఒకరి మీద ఒకరు నిరంతరం అనవసరంగా ఏదో ఒకటి మాట్లాడుకుంటూ ఉంటారు.  అలా అనవసరంగా మాట్లాడటం వల్ల మనసులు కలుషితమవుతాయి.  అందుకని లేనిపోని మాటలు మాట్లాడటానికి బదులు మౌనం శ్రేయోదాయకం.  మౌనం పాటించడాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకుంటే దీనికి మించిన సాధనం లేదు.  ‘మౌనం బంగారం, మాట వెండి’ అన్నారు.  అయితే  అవసరమైన సందర్భాల్లో కూడా మౌనం పాటిస్తే  అనర్ధాలు జరుగుతాయి.అవసరం ఉన్నపుడు క్లుప్తంగా.. సూటిగా చెప్పదలుచుకున్న విషయాన్నీ చెప్పండి.ఎదుటి వారికి విషయం అర్ధం అవుతుంది. మౌనం విలువ ఎలాంటిదో అనుభవిస్తేనే తెలుస్తుంది.ఒక సారి రుచి చూడండి. మౌనం పై మీ అభిప్రాయాలను కూడా తెలియ చేయండి.అంతే గానీ మౌనంగా ఉండకండి.

అరసవల్లి లో అద్భుతం చూసారా ??


అరసవల్లి ఆదిత్యుడిని భానుడి లేలేత కిరణాలు నేరుగా తాకే అద్భుతం మరోమారు ఆవిష్కృతం కానుంది.అక్టోబర్ నెల 1,2,3 తేదీల్లో ఈ అరుదైన దృశ్యం భక్తులను కనువిందు చేయనుంది. ఉత్తరాయణ, దక్షిణాయన పుణ్యదినాల్లో ప్రతీ ఏటా మార్చి 9,10,11, అక్టోబర్ 1,2,3 తేదీల్లో భానుడి తొలికిరణాలు అరసవల్లి ధృవమూర్తిని స్పర్శిస్తాయి.  స్వామి పాదపద్మాల నుండి శిరస్సు వరకు అరుణ కిరణాలు తాకే అద్భుత దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు ఇక్కడకు చేరుకుంటారు. ఆదిత్య మూలవిరాట్‌ను విశ్వకర్మ చెక్కినట్టు స్థలపురాణంలో ఉంది. కిరణస్పర్శ ఎంతటి మహత్తరమైనదో ఆధ్యాత్మికంగా, శాస్ర్తియంగా ఎంత ప్రభావితం చూపుతుందో వేదపండితులు చెబుతూనే ఉన్నారు. వైజయంతీ రథంపై గల శ్రీసూర్యనారాయణుడి సాలగ్రామ ఏకశిలామూర్తి ఐదున్నర అడుగుల పొడవు, రెండున్నర అడుగుల వెడల్పులో లక్షలాది సాలగ్రామాల  మిళితమై ఉంది. సూర్యరశ్మి తాకిన సమయంలో ఆదిత్యుని మూలవిరాట్‌లో చైతన్యరశ్మి మరింత శక్తిని పుంజుకుంటుంది.ఉషోదయ కిరణాలతో సమస్త ప్రాణ కోటికి నూతన చైతన్యాన్ని నింపుతున్న సూర్యభగవానుడు ఆదిత్యునిగా పూజలందుకుంటున్న పుణ్యక్షేత్రం అరసవల్లి. ఈ ఆలయంలో కొలువుదీరిన భాస్కర స్వామిని పూజించిన వారికి ఈతిబాధలు, సర్వదోషాలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం.శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం మండలంలో అరస వల్లి అనే గ్రామంలో ఉంది. శ్రీకాకుళం పట్టణానికి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో గల ఈ గ్రామం శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానము ద్వారా బహుళ ప్రసిద్ది చెంది ఉన్నది.  భాస్కరుణ్ణి పూజించిన వారు అన్ని కష్టాలూ తొలగి హర్షంతో వెళ్తారు  కాబట్టి ఒకప్పుడు ఈ ఊరిని హర్షవల్లి అనే వారనీ అదే క్రమేణా అరసవల్లిగా మారిందని ప్రతీతి. మహాభాస్కర క్షేత్రంగా పిలుస్తున్న ఆ ఆలయానికి యెంతో ఘనమైన చరిత్ర ఉందని స్ధల పురాణం చెబుతోంది. ఆలయం తొలత దేవేంద్రునిచే నిర్మితమైందని పురాణ ప్రవచనం. గంగవంశరాజు గుణశర్మ వారసుడైన కళింగ రాజు దేవేంద్రవర్మ క్రీ.శ. 673 సంవత్సరంలో ఈ దేవాలయాన్ని నిర్మించారని లభించిన శాసనాల ద్వారా తెలుస్తుంది. 16వ శతాబ్దంలో ఈ ప్రాంతానికి నిజాం నవాబు సుబేదార్ గా వచ్చిన షేర్ మహమ్మద్ ఖాన్ తానే ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినట్లు ఒక శాసనంలో చెప్పుకున్నారు. ఆయన వద్ద ఉద్యోగిగా ఉన్న సీతారామస్వామి అనే పండితుడు మహమ్మద్ ఖాన్ దండయాత్ర గురించి తెలుసుకుని, ఆలయంలో మూలవిరాట్ ను ఒక బావిలో పడేశారట. క్రీ.శ.1778 లో ఎలమంచిలి పుల్లాజీ అనే ఆయన ఆ బావిలో మూలవిరాట్ ను కనుగోని బయటకి తీసి ధ్వంసమైన ఆలయాన్ని పునర్నిర్మించి, విగ్రహ ప్రతిష్ట చేసారు. శ్రీ ఉషా, పద్మినీ, చాయాదేవి, సమేతంగా ఇక్కడ కొలువైన సూర్య నారాయణుడు సకల జీవులకూ సంక్షేమాన్ని, ఆయురారోగ్యాలనూ, ప్రసాదిస్తారని భక్తుల నమ్మిక. స్వామి రెండు చేతులూ అభయ ముద్రలోనే ఉంటాయి. నడుముకు చురిక(కత్తి) ఉంటుంది. ఇక ఆయన రథానికి సారధి అనూరుడు(అంటే తొడలు లేని వాడు అని అర్ధం) ఈ అనూరుడు గరుత్మంతుడికి అన్న. ఈయనకే అరుణుడనే మరో పేరుంది). స్వామి విగ్రహానికి ఇరు పక్కలా చత్రచామరాలతో సేవచేస్తున్న సనకసనందులు ఉంటారు. మామూలు  రోజులతో పోలిస్తే మాఘ, వైశాఖ , కార్తీక మాసాల ఆదివారాల్లో ఈ క్షేత్రానికి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. అందునా రథ సప్తమి నాడు ఆ సంఖ్య లక్షల్లోకి చేరుకుంటుంది. అరసవల్లి క్షేత్రాన్ని ఆరోగ్య క్షేత్రంగా పిలుస్తారు స్ధానికులు. ప్రత్యేకించి కంటి వ్యాదులు , బొల్లి, కుష్టు, వ్యాధులతో పాటూ ఇతర మానసిక, శారీరక రోగాల నుంచి విముక్తి కోసం బాధిత భక్తులు ఇక్కడికొచ్చి స్వామి వారిని కొలుస్తారు.వీలుంటే మీరు వెళ్లి స్వామి వారిని చూడండి.

నాణ్యత తగ్గిన వెంకన్న లడ్డు


సన్మార్గం : మధురం, మహాప్రసాదం... శ్రీవారి నైవేద్యం తిరుపతి లడ్డు అంటే అందరికి ఇష్టమే. తిరుపతి అంటే ముందుగా గుర్తు కొచ్చేది  లడ్డు మాత్రమే. అప్పటి లడ్డు కి ఇప్పటి లడ్డు కి చాలా తేడా ఉంది.తిరుమల వెంకన్నకి  అత్యంత ప్రీతిపాత్రమైన నైవేద్యం లడ్డు.  భక్తులు భక్తిశ్రద్ధలతో మహా ఇష్టంగా స్వీకరించే ప్రసాదాల్లో తిరుపతి లడ్డూదే తొలిస్థానం. తిరుమల ఆలయంలో పల్లవుల కాలం నుంచే ఈ లడ్డు ప్రసాదాలు మొదలయ్యాయని చరిత్ర. శ్రీవారికి ‘సంధి నివేదనలు’ (నైవేద్యవేళలు) ఖరారు చేశారు. ఈ సమయాల్లోనే భక్తులకు ప్రసాదాలు పంచేవారు. అప్పట్లో కొండమీద భోజన సదుపాయాలు ఉండేవికావు. ఈ ప్రసాదాలే భక్తుల ఆకలి తీర్చేవి. అప్పటికి ఇప్పటికి లడ్డు కి డిమాండ్ ఎంతో ఉంది. పది హేనేళ్ళ  క్రితం ఎన్ని కావాలంటే అన్ని అమ్మే వారు.ఇపుడు ఆ సదుపాయం లేదు. అలాగే లడ్డు లో నాణ్యత కూడా తగ్గిపోయింది.  తిరుమలేశుని లడ్డు, ప్రసాదాల తయారీకి   దేవస్థానం 16 వేల మెట్రిక్ టన్నుల ముడిపదార్థాన్ని కొనుగోలు చేస్తున్నది . ఇందుకోసం టీటీడీ ఏటా సుమారు రూ.175 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. వీటిలో శ్రీవారి లడ్డూ ప్రసాదానిదే సింహభాగం. భక్తులకు అందజేసే ప్రసాదాన్ని ‘తిరుప్పొంగం’ అనేవారు. తర్వాత సుఖీయం, అప్పం (క్రీ.శ.1455), వడ (క్రీ.శ.1460), అత్తిరసం (క్రీ.శ.1468), మనోహరపడి (క్రీ.శ.1547) ప్రసాదాలను ప్రవేశపెట్టారు. వీటిలో వడ తప్ప మిగతావేవీ ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు. దూరప్రాంతాలకు తీసుకెళ్ళేందుకు అనువుగా ఉన్న వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది. అది గుర్తించిన అప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారి గా 1803 నుండి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం ప్రారంభించింది. నాటి నుంచి లడ్డూకు ముందు రూపమైన బూందీని తీపిప్రసాదంగా విక్రయించడం ప్రారంభమైందని చరిత్ర. ఇలా అనేక విధాలు గా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరకు 1940లో తిరుపతి లడ్డూగా స్థిరపడింది. 5100 లడ్డూలు  తయారుచేయడానికి  ఆవు నెయ్యి 165 కేజీలు, శనగపిండి 180 కేజీలు, చక్కెర 400 కేజీలు, ముంత మామిడిపప్పు 30 కేజీలు, ఎండుద్రాక్ష 16 కేజీలు, కలకండ 8 కేజీలు, ఏలకులు 4 కిలోలు వినియోగిస్తారు. మొత్తం మీద 5100 లడ్డూల తయారీకి 803 కేజీల సరుకులు వినియోగిస్తారు.
 కాగా తిరుమల ఆలయంలో మూలమూర్తి కొలువు తీరి ఉండే గర్భాలయానికి శ్రీవారి పోటు (వంటశాల)కు ముందు వకుళమాత విగ్రహం నెలకొల్పారు. వాస్తు ప్రకారం ఆగ్నేయంగా ఆలయంలో నిర్మించినచోట పోటు ప్రసాదాలు తయారుచేస్తారు. తయారైన ప్రసాదాలను శ్రీనివాసుని తల్లి వకుళమాత విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. అక్కడ ఆమె ముందు ఉంచిన తర్వాత స్వామివారికి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. లడ్డు, వడలు మొదలైన పనియారాలు ఆలయంలో సంపంగి ప్రాకారం ఉత్తరభాగాన తయారుచేస్తారు. వాటిని కూడా తల్లికి చూపించాకే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు.
 శ్రీవారి భక్తులకు అత్యంత ప్రీతిపాత్రమైన తిరుపతి లడ్డూలు మూడురకాలుగా తయారు చేస్తారు. వీటిని ఆస్థానం లడ్డు, కల్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డు అని పిలుస్తారు. ఆస్థానం లడ్డూను ప్రత్యేక ఉత్సవాల సందర్భంగా తయారు చేసి ఆలయ గౌరవ అతిథులకు మాత్రమే ఇస్తారు. దీని బరువు 750 గ్రాములు. దీన్ని దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, ముంతమామిడి పప్పు, కుంకుమపువ్వుతో ప్రత్యేకంగా తయారుచేస్తారు. ఇక కల్యాణోత్సవం ఆర్జిత సేవలో పాల్గొనే గృహస్థులకు కల్యాణోత్సవం లడ్డూను ప్రసాదంగా అందజేస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే రుచిగా ఉంటుంది. దీని ధర రూ.100. మూడవది ప్రోక్తం లడ్డు. ఇదే చిన్న లడ్డు. భక్తులకు లభించే లడ్డు. 175 గ్రాములు బరువున్న దీని ధర రూ.25. లడ్డు ధరల్లో అప్పటికి ఇ ప్పటికి చాలా మార్పులొచ్చాయి. 
 ఈ  లడ్డు ప్రసాదాల అమ్మకం ద్వారా ఏటా దాదాపుగా పది కోట్ల రూపాయలు టీటీడీకి ఆదాయం లభిస్తోంది. అంతర్జాతీయ ప్రాముఖ్యం కలిగిన తిరుమల వెంకన్న లడ్డు ప్రత్యేకమైన భౌగోళిక గుర్తింపు సాధించింది. చిన్నపుడు ఈ లడ్డు కోసం ఇంట్లో తన్నుకునే వాళ్ళం. తిరుపతిలో ఉద్యోగం చేసినపుడు 
కరువు తీర లడ్లు తిన్నాను. వెంకన్న ఆ అదృష్టం కల్పించాడు. 

Some Important Facts about Tirumala Lord Sri Venkateshwara Swamy





తిరుమల వెంకన్న గురించి కొన్ని నిజాలు 
1. గుడి ఎంట్రన్స్‌లో మహద్వారానికి కుడివైపున వెంకటేశ్వర స్వామివారిని తలపై అనంతాళ్వారు కొట్టిన గుణపం ఉంటుంది. చిన్నపిల్లాడి రూపంలో ఉన్న స్వామివారిని ఆ రాడ్‌తో కొట్టడంతో స్వామివారి గడ్డంపై గాయమై రక్తమొస్తుంది. అప్పట్నుంచే స్వామి వారి గడ్డానికి గంధం పూయడమనే సాంప్రదాయం మొదలైంది.
2. వెంకటేశ్వర స్వామి విగ్రహానికి జుట్టు (రియల్ హెయిర్) ఉంటుంది. అస్సలు చిక్కు పడదని అంటారు.
3. తిరుమలలో టెంపుల్ నుండి 23 కిలోమీటర్ల దూరంలో ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామస్థులకు తప్ప ఇతరులకు ప్రవేశం లేదు అక్కడికి. ఆ గ్రామస్థులు చాలా పద్ధతిగా ఉంటారు. స్త్రీలు బ్లౌజెస్ కూడా వేసుకోరు అంత పద్దతిగా ఉంటారు. అక్కడి నుండే స్వామికి వాడే పూలు తెస్తారు. అక్కడే తోట ఉంది. గర్భ గుడిలో ఉండే ప్రతీది ఆ గ్రామం నుండే వస్తుంది. పాలు, నెయ్యి, పూలు, వెన్న తదితర అన్నీ.
4. స్వామివారు గర్భగుడి మధ్యలో ఉన్నట్టు కనిపిస్తారు కానీ నిజానికి ఆయన గర్భగుడి కుడివైపు కార్నర్‌లో ఉంటారు. బయటి నుండి గమనిస్తే ఈ విషయం మనకు తెలుస్తుంది.
5. స్వామివారికి ప్రతీరోజూ క్రింద పంచె, పైన చీరతో అలంకరిస్తారు. దాదాపు 50 వేల ఖరీదు చేసే సేవ ఒకటి ఉంటుంది. ఆ సేవలో పాల్గొన్న దంపతులకు చీరను స్త్రీకి, పంచె పురుషునికి ఇస్తారు. చాలా తక్కువ టిక్కెట్స్ అమ్ముతారు ఇవి.
6. గర్భగుడిలో నుండి తీసి వేసిన పూలు అవీ అన్నీ అసలు బయటికి తీసుకు రారు. స్వామి వెనకాల జలపాతం ఉంటుంది. అందులో వెనక్కి చూడకుండా విసిరి వేస్తారు.
7. స్వామి వారికి వీపు మీద ఎన్ని సార్లు తుడిచినా తడి ఉంటుంది. అలాగే అక్కడ చెవి పెట్టి వింటే సముద్రపు ఘోష వినిపిస్తుంది.
8. స్వామివారి గుండె మీద లక్ష్మీదేవి ఉంటుంది. ప్రతీ గురువారం నిజరూప దర్శనం టైమ్‌లో స్వామివారికి చందనంతో అలంకరిస్తారు. అది తీసివేసినప్పుడు లక్ష్మీదేవి అచ్చు అలానే వస్తుంది. దాన్ని అమ్ముతారు.
9. చనిపోయినప్పుడు వెనక్కి చూడకుండా ఎలా కాలుస్తారో, అలాగే స్వామివారికి తీసేసిన పూలు మరియు అన్ని పదార్థాలూ అదే విధంగా పూజారి వారు వెనక్కి చూడకుండా స్వామి వెనక వేసేస్తారు. ఆ రోజంతా స్వామి వెనక చూడరు అని అంటారు. ఆ పూలు అన్నీ కూడా తిరుపతి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న వేర్పేడు (కాలహస్తికి వెళ్ళేదారిలో) దగ్గర పైకి వస్తాయి.
10. స్వామివారి ముందర వెలిగే దీపాలు కొండెక్కవు. అవి ఎన్నివేల సంవత్సరాల నుండి వెలుగుతున్నాయో కూడా ఎవ్వరికీ తెలీదు.
11. 1800 లో గుడిని పన్నెండు సంవత్సరాల పాటు మూసివేసి ఉండింది అంట. ఎవరో ఒక రాజు పన్నెండు మందిని గుడి దగ్గర తప్పు చేసినందుకు గానూ హతమార్చి గోడకు వేలాడదీశాడంటా. ఆ టైమ్‌లోనే విమాన వెంకటేశ్వర స్వామి వెలిసింది అంటారు.