అనవసరమన్న వాదనతో మిగతావారి నమ్మకాలను అవహేళన చేస్తుండేవాడు. ఒకసారి ఆయన సనాతన ధర్మాన్ని ప్రచారం చేసే ఒక ఆశ్రమం లో జరిగే ఒక కార్యక్రమానికి ఈయన హాజరవడం జరిగింది. అక్కడేవో పూజలు , అభిషేకాదులతో కార్యక్రమం చక్కగా జరుగుతున్నది. అవన్నీ చూస్తున్న కొద్దీ ఈయనకు వీరిఅజ్జానం పట్ల జాలి కలిగింది. వారిచర్యలను పరిహసిస్తూ చిన్నగా వ్యాఖ్యానాలు చేయడం మొదలు పెట్టాడు.
మెల్లగా కొందరు నాలాంటి బద్దకస్తులు కొందరు ఈయన ప్రక్కన చేరి, స్వామీ, తమరు మాకు వాస్తవసత్యాన్ని తెలియ జేయండి. అని కోరారు. చూడండి నాయనా, ఆత్మపూజ మాత్రమే భగవంతునికి చెందుతుంది. ఇలాంటి బాహ్య పూజలవల్ల ఒరిగేదేమిలేదు, కొబ్బరిచిప్పలు, బెల్లం ముక్కలు తప్ప. అంటూ తనపైత్య వేదాంతాన్ని వీరికి యెక్కించడం, ఆశ్రమాధిపతి ఐన స్వామీజీ గమనిస్తున్నాడు.
కర్యక్రమం ముగిసింది. భోజనాల సమయం వచ్చింది. భక్తులంతా ఆకలితో నకనకలాడుతున్నారు. వడ్డనలు ప్రారంభమయ్యాయి. మన ఆత్మజ్జాని గారుకూడా పంక్తిలో కూర్చున్నారు. విస్తర్లలోవడ్డిస్తూ వస్తున్నవారు అందరికీ అన్నీ వడ్డిస్తున్నారుగాని, ఈయన దగ్గరకొచ్చేసరికి వడ్డిస్తున్నట్లు చేతులు ఊపుతున్నారేగాని పదార్ధాలేవీ విస్తర్లో పడటం లేదు. లడ్లు, వడలు పుళిహోర దద్దోజనం కూరలు వడ్డన సాగుతోంది కానీ మన గురూజీ విస్తర్లోమాత్రం ఏమీ పడలేదు. అసలే ఆకలి మండిపోతున్నది, దానికితోడు వీరివ్యవహారం .మంటనషాలాని కెక్కింది. ఏమిటయ్య మీ వ్యవహారం? తమాషగా ఉందా? నాకొక్కడికే వడ్డించడమ్లేదు.శివాలెత్తి పోతున్నాడాయన. ఈ గొడవకు ఆశ్రమాధిపతి వచ్చారు. ఏమిటినాయనా గొడవ? ప్రశ్నించారు.మీవాళ్ళ పద్దతేమ్ బాగాలేదు స్వామీ, విషయం చెప్పాడు ఆత్మజ్జాని. ఏ0 నాయనా వారుచెప్పేది నిజమా? ప్రశ్నించారు స్వామీజీ. అవును స్వామీ, వారు ఆత్మజ్జానులు కదా! మామూలు బోజనం చేయరేమో,,ఆత్మ భోజనం మాత్రమేచేస్తారేమోనని అనుకున్నాం స్వామీ. మన్నించండి అన్నారు వినయంగా................... అంతే మనఅత్మజ్జానికిఅప్పుడర్ధమైంది.