Clsr

Recent Posts

భగవానులు _నాస్తిక వాది

భగవంతుని ఉనికిని ప్రశ్నిస్తూ అధ్యాత్మికవాదులను , ధార్మికులను తన వాద పటిమతో ఓడిస్తూ ప్రఖ్యాతి పొందిన ఒక ధృడమైన నాస్తిక వాది ఒకరు భగవాను వద్దకు వొచ్చారు.

ఆయన అలవాటు ప్రకారం - "దేవుడు ఉన్నాడా? దేవుడు ఉన్నాడని మీరు రుజువు చేయగలరా? అంటూ రమణులపై తన ప్రశ్నల వర్షం కురిపించారు.

అతని యెడ చిరునవ్వు ప్రసరిస్తూ భగవాన్ ఇలా అన్నారు- "దేవుని గురించిన చింత నీకెందుకు? ఆయన గురించి ఆయనే విచారించుకొంటాడు .

అసలు ఈ ప్రశ్న ఎవరికి కలిగిందో ఆలోచించు
."
అని


ఆ పృచ్చకుడికి ఇదంతా అంతు చిక్కని అయొమయంగా ఉంది.

అది గమనించి భగవాను అతడిని "నేనెవడిని(Who Am I)"అనెడి పుస్తకము చదవమని ఆదేశించారు.

భగవానును కలిసి ఆశ్రమములో కొద్ది రోజులు మాత్రమే ఉండాలని భావించిన ఆ వ్యక్తి ఇలా అన్నాడు.

" కొన్ని దినముల వరకూ దేవుడిని తిరస్కరిస్తూ నాస్తికవాదిగా వచ్చాను. అప్పుడే నేను ఆనందముగా ఉన్నను. కాని,

ఇప్పుడు "నేనెవడిని""అని ప్రశ్నించుకొని చింతన చేయడం ప్రారంభించిన తరువాత నేను పూర్తిగా గందరగోళములో పడిపోయాను .

సంతోషం కోల్పోయి నేను చాల బలహీన పడినట్లు భావిస్తున్నాను "అని.



భగవాను అతని యెడ అమిత దయతో, ఔదార్యముతో కూడిన చిరునవ్వు చిందిస్తూ జవాబిచ్చారు--

"నీలో ఏర్పడిన గందరగోళం బలహీనతకు సంభందించినది కాదు. ఇంత కాలమూ నీవు నీ సహజస్థితి యైన ఆత్మానుభూతి అనే సత్యానికి దూరముగా ఉన్నావు.

ఈనాడు తలెత్తిన ఈ మూలాధార ప్రశ్న నిన్ను ఆ అజ్ఞానమునకు దూరంగా నడుపుతున్నది. కనుక అది అభివృద్ధే.

అజ్ఞానము నుండి సంశయ స్థితికి, సంశయము నుండి స్వచ్చతకు (మానసిక), స్వచ్చత నుండి అనుభూతికి, తద్వారా ఆత్మలో లీనమగుట--- ఇదీ అధ్యాత్మిక సాధన మార్గములో ఆరొహన క్రమము." అని

అజ్ఞానులలో నిండి ఉన్న అంధకారమును చిన్నాభిన్నము చేసి,

ధారళంగా ప్రసారం చేయబడుతున్న భగవాను యొక్క దయా విశేషము పొందుటకు తగిన శక్తివంతులను గావిస్తుంది భగవాను సన్నిధి.