Clsr

Recent Posts

లక్ష్మీదేవి ఆరాధన శుక్రవారమే ఎందుకు చేయాలి?

లక్ష్మీదేవిని గురు, శుక్రవారాలలో ప్రత్యేకంగా పూజి స్తారు. ఈ రోజులలో దేవిని ప్రసన్నం చేసుకుని, ఆమె ఆశీ స్సులు పొందేందుకు వ్రతాలు చేస్తారు. లక్ష్మీదేవికి ప్రీతిక రమైన స్తోత్రాలు, స్తుతులు ఆరోజునే పఠిస్తారు. ఆ రోజు కొంత…మంది ఉపవాసంఉంటారు.ఈనాడుమానవులేకాదు, పురాణాలలో రాక్షసులు సైతం శుక్రవారం లక్ష్మీదేవిని పూ జించేవారనడానికి ఉదాహరణగా అనేక కథలున్నాయి. అసలు శుక్రవారమే లక్ష్మీదేవికి ఆరాధనకు అనుకూలమై న దినంగా ఎందుకు పేరుమో సింది? రాక్షసులు కూడా ఆ రోజే లక్ష్మీదేవినిఎందుకు ఆరాధించేవారు? అందునా రాక్ష ససంహారి అయిన విష్ణుమూర్తి భార్యను రాక్షసులు పూజిం చడమేమిటి? ఈ సందేహాలన్నీ వస్తాయి. ఈ సందేహాలకు సమాధానం ఏమిటంటే... రాక్షసుల గురువు శుక్రాచార్యు డు. ఈ శుక్రాచార్యుల పేరు మీదుగానే శుక్రవారం ఏర్పడిందని హిందూ పురాణాలు చెబుతున్నాయి. ఇకపోతే శుక్రాచా ర్యుడి తండ్రి భృగుమహర్షి. ఈ భృగుమహర్షి బ్రహ్మదేవు డి సంతానంలో ఒకరు. ఇతడు లక్ష్మీదేవికి తండ్రి కూడా! అందుకే లక్ష్మీదేవికి భార్గవి అని పేరు. ఈ విధంగా లక్ష్మీ దేవికి శుక్రా చార్యుడు సోదరుడు. అందుకే ఆమెకు శుక్ర వారం అంటే ప్రీతికరమైనది. లక్ష్మీదేవి రూపు రేఖలలో వస్త్రధారణలో రంగులకు కూడా ప్రాధాన్యం వుండి.

లక్ష్మీదేవి ఎక్కువగా ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను ధరించినట్లు చిత్రాలు చిత్రీకరిస్తారు. ఎరుపు రంగుకి శక్తికి, ఆ కుపచ్చ రంగు సాఫల్యతకు, ప్రకౄఎతికి చిహ్నాలు. ప్రకృతికి లక్ష్మీదేవి ప్రతినిథి. అం దుకే ఆమెను ఈ రెండు రంగుల వస్త్రాలలో ఎక్కువగా చిత్రిస్తారు. ఇక లక్ష్మీదేవిని బంగారు ఆభరణాలు ధరించినట్లు చూపిస్తారు. బంగారం ఐశ్వర్యనికి సంకేతం. ఐశ్వ ర్యాధిదేవత లక్ష్మీదేవి కాబట్టే ఆమెను బంగారు ఆభరణాలతో అలంకరిస్తారు. విష్ణువు ఆరాధనలోనూ లక్ష్మీపూజకు ప్రాధాన్యం ఉంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో కానీ, విష్ణుమూర్తిని దరిచేరలేరు. లక్ష్మీదేవి ప్రసన్నత లేకుంటే విష్ణువు భక్తులకు అందుబాటులో ఉండరు. సదాచారం, సత్ప్ర వర్తన లక్ష్మీదేవి ఆహ్వానాలు. ఈ రెండూ ఉంటె ముందు లక్ష్మీదేవి అనుగ్రహం, తద్వారా విష్ణుమూర్తి అనుగ్రహం కూడా పొందవచ్చు.