Clsr

Recent Posts

What Should do to remove navagraha doshas?

గ్రహదోషాలు తొలగిపోవాలంటే.. ఏం చేయాలి?

నవగ్రహాలలో ఒక్కో గ్రహ దోషమూ ఆయా వ్యక్తులకు మనఃశాంతి లేకుండా చేస్తుంటాయి. అయితే ఈ గ్రహదోషాలు తొలగిపోవడానికి నియమబద్ధమైన పూజలే కాదు, వివిధ రకాల స్నానాలను దోషాలను తొలగించుకోవచ్చునని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అవేంటో చూద్దాం..!

కుంకుమ, ఎర్ర చందనం కలిపిన ‘రాగిపాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన సూర్య గ్రహ దోషాలు తొలగిపోతాయి. అలాగే కుంకుమ, గంధం కలిపిన నీటిని ‘శంఖం’తో పోసుకుంటే చంద్రగ్రహ దోషాలు దూరమవుతాయి.

గంధం, తిలలు కలిపిన ‘రజిత పాత్ర’లోని నీటితో స్నానమాచరించడం వలన కుజదోషాల తొలగిపోతాయి. ఇక నదీ సాగర సంగమంలోని నీటిని ‘మట్టిపాత్ర’లో పోసి స్నానం చేసినట్లయితే బుధగ్రహ దోషాలు తొలగిపోతాయి.

మర్రి, మారేడు కాయలను బంగారు పాత్రలోని నీటిలో వేసి స్నానం చేస్తే గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. శుక్రుడిని ధ్యానిస్తూ ‘రజిత పాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన శుక్ర గ్రహదోషాల నుంచి విముక్తి లభిస్తుంది. ఇక నువ్వులు, మినువులు కలిపిన ‘లోహపాత్ర’లోని నీటితో స్నానం చేయడం వలన శనిగ్రహ ప్రభావం తొలగిపోతుంది.

ఇక గేదె కొమ్ము(డొల్ల)తో స్నానం చేయడం వలన రాహు గ్రహ దోషాలు తొలగిపోతాయి. పవిత్రమైన మట్టిని కలుపుకుని స్నానం చేయడం వలన కేతు గ్రహ దోషాలు తొలగిపోతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు

Vakratunda Mahakaya.mp3 song from Telugu Movie: Devullu.