Clsr

Recent Posts

ఈశావాస్య ఉపనిషత్తు






Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog

ఉపనిషత్తుల సారమంతా నింపుకున్న ఒక గొప్ప ముఖ్యమైన మంత్రము.., "ఈశావాస్య ఉపనిషత్తు" లో
చెప్పబడింది. అందుకే, ఒకసారి ఈ మంత్ర విశేషాన్ని గురించి వివరిస్తూ "స్వామి వివేకానందుల" వారు ఈ విధముగా అన్నారు, "ఎంతో విలువైన మన భారత వేద శాస్త్రాలు ఒకవేళ పూర్తిగా సమసి అంతరించిపోయినా, ఈశావాస్య ఉపనిషత్తులోని మొదటి ఒక్క శాంతి మంత్రం మిగిలితే చాలు.. వేదాల సారమంతా తిరిగి లభించినట్టే" అని. అంత ఘనత కలిగినది ఈ మంత్రము. 
ఈశావాస్య ఉపనిషత్తు -
ఓం శాంతి మంత్రం..
"పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే"
భావము :- "అది పూర్ణము. ఇది పూర్ణము. పూర్ణము నుండే పూర్ణము ఉద్భవిస్తుంది. పూర్ణమునుండి పూర్ణమును తీసివేసినా, పూర్ణమునకు పూర్ణమును జోడించినా పూర్ణమే మిగిలుతుంది."
విశ్లేషణ :-  "సకల బ్రహ్మాండము పూర్ణము. ఈ జీవ సంతతి ఉన్న భూమండలము పూర్ణము. బ్రహ్మాండము నుండి భువి ఉద్భవించినది. ఆ బ్రహ్మాండమునకు భువి కూడినా తీసివేయబడినా తుదకు మిగిలిఉండేది అనంతమైన బ్రహ్మాండమే." (అద్వైత పరంగా చెప్పాలంటే...) "ఆ పరమాత్ముడు పరిపూర్ణుడు. ఈ జీవాత్మలు పూర్ణములు. పరమాత్ముని అంశలమైన జీవుడు తిరిగి ఆ పరమాత్ముని యందే కలువగా పరమాత్మయే అంతిమ గమ్యము అగును. ఉన్నదంతా ఒక్కటే. రెండవదేదీ లేదు. అనంత బ్రహ్మాండము అనేకముగా కనిపించినా, సృష్టిలోని పిండాండాలనీ ఆ బ్రహ్మాండ స్వరూపాలే. కనుక, అంతా వేరుగా కనపడుతున్న ఒక్కటే అని సారము, అద్వైత సిద్ధి కూడా ఇదియే."