Clsr

Recent Posts

వేదములు



Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog


వేదమనగా జ్ఞానము ప్రసాదించునది అని అందురు. దైవమును  చూపు ఒక మార్గము గా పెద్దలు పలుకుదురు. వేదములను శాస్త్ర ప్రకారముగా పలికినా వినినా జ్ఞానము వచ్చును అని మన హిందు ధర్మం పలుకుచున్నది. భారతియ్యులు పవిత్రముగా ఈ వేదములను భావిస్తారు. వేదములు నాలుగు అవి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణవేదము. బ్రహ్మదేవునిచే సృష్టింపబడినవి ఈ వేదములు. ఇవి శ్రుతి , లయ బద్దము గా పలుకవలెనని పెద్దలు చెప్పుదురు. పూర్వము మన ఋషులు యజ్ఞయాగాది క్రతువులు నిర్వహించినప్పుడు వేదములలో మంత్రములను వినియోగించారు, వేదములు దైవ వాక్కులుగా ఈశ్వరుని విశ్వాసములుగా పరిగణింపపడుచున్నవి. ఋగ్వేదము 
పాదబద్దములగు మంత్రములను "ఋక్కు" అని అంటారు. ఈ వేదమునందు ఇటువంటి మంత్రములే ఉండుటవలన ఈ వేదమునకు ఋగ్వేదము అని పేరు వచింది. ఈ వేదమునకు 21 శాకాలు కలవు. ఈ 21 శాకలలో ప్రస్తుతం శాకలశాఖ, భాష్కలశాఖ అను 2 శాఖలు మాత్రమే లభించుచున్నవి. ఇందులో వ్యవసాయ విధానం, వ్యాపార విధానం, ఓడలు, విమానం, రైలు, తాయారు చేయు విధానం. టెలిగ్రాం, wire less వంటి ఆధునిక పరికరములు ఏ విధంగా తయారు చేయాలో విఫులంగా వివరింపబడినది. యజ్ఞము, యాగము వంటి చేయు క్రతములలో హవిర్భాగాములు గ్రహించు నిమిత్తం హోయతను ఋత్వికు ఈ వేదమంత్రములతో దేవతలను ఆహ్వానించును. ఆ దేవతలకు హవిస్సులను  అర్పించుటకు చాల ఉపయోగకరమైనది పరిగణింపపడినది. అందుకే ఈ వేదమునకు "హుత్రవేదము" అని పేరు కూడా ఉన్నది. ఈ ఋగ్వేదమును 10 మండలములుగా విభజించారు, వేరొక శాఖ వారు 8 అష్టకములుగా విభజించారు
యజుర్వేదము 
యజుర్వేదములలో కృష్ణయజుర్వేదము, శుక్లయజుర్వేదము అను 2 విధములు కలవు
కృష్ణయజుర్వేదము :- "త్తెత్తిరి" అను పేరుగల ఆచార్యుడు తన శిష్యప్రశిషులకు భోదించెను. అందుకే "త్తెత్తిరీయ" మని పేరు కూడా వచ్చింది. ఈ త్తెత్తిరీయవేదములో సంహిత, బ్రాహ్మణము, అరణ్యము అను 3 భాగములున్నవి. ఈ సంహితము యందు 7అష్టకములు(కాండములు), 44 ప్రశ్నలు(ప్రపాఠకములు), 651 అనువాకములు, 2196 పంచాశత్తులు ఉన్నవి.
ఇందులో కర్మలు చేయు శాస్త్రములు, బ్రహ్మవిద్య, సృష్టివిద్య, గణితవిద్య, శారీరక శాస్త్రవిద్య, అంతరిక్ష విద్య మొదలగున్నవి కలవు.
పనస :- ప్రతీ పనస యందు 50 పదములు ఉన్నవి. అనువాకాంతము యందున్న పనసలకును పదములు కొంచెము హెచ్చుతగ్గులు ఉండును. సంస్కృత భాషలో దీనినే "పంచాశత్తు" అంటారు