Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog
యోగ విద్య నభ్యసించుటకు వయో పరిమితి లేదు. ఏ వయస్సు వారైనను యోగ విద్య నభ్యసించ వచ్చును. కాన స్త్రీ, పురుషులెల్లరు వయోభేదము లేక, యోగ విద్య నభ్యసించి తమ ఆరోగ్యమును కాపాడు కొనుచూ శత వత్సరములు వర్దిల్ల గలరు. ముఖ్యముగా ఉద్యోగము, వ్యాపారము చేయు వారిలో ఎక్కువమంది శరీర శ్రమ లేకుండా ఉదయం నుండి సాయంత్రం వరకు తమ విధులను నిర్వర్తించుచుందురు. అట్టి వారు తప్పక యోగ, వ్యాయామము నభ్యసించవలెను. వారు యోగ విద్య నభ్యసించని యెడల వారి శరీరమునకు శ్రమ లేక, భుజించిన ఆహారము సరిగా జీర్ణము కాక క్రమముగా అజీర్ణవ్యాది ప్రారంబించును.అజీర్ణ వ్యాధి కారణముగా మధుమేహ వ్యాధి (షుగరు వ్యాధి )కి గురియగుదురు. మధుమేహ వ్యాధి ఇతర వ్యాదులన్నింటికి మూల కారణ మని (diabities is the root cause of all diseases ) శాస్త్రజ్ఞులు చెప్పుచున్నారు కనుక ప్రతివారు మధు మెహ వ్యాధి నుండి కాపాడ బడవలయునంటే యోగ, వ్యాయామము తప్పక అభ్యసించవలెను. ప్రతి వారుఆరోగ్యవంతులై దీర్ఘాయుష్మంతులగుటకు తప్పక యోగాభ్యాసము చేయవలెను.
పాటించవలసిన నిబంధనలు:
1 . మితాహారమును సేవిన్చావలయును.అనగా ఎంత ఇష్టమైన పదార్ధమైనను అతిగా భుజించరాదు .
2 . మద్యపానము చేయరాదు .
3 . ధూమపానము చేయరాదు (పొగ త్రాగరాదు )
4 . కాఫీ, టీ, మొదలగు వుత్తేజకాలను అతిగా వాడరాదు.
5 . ఘాటైన పదార్ధములను అనగా సుగంధ ద్రవ్యములు, కూరలలో వాడుకొను మిరియాలు, జీలకర్ర, యాలుకలు, లవంగాలు మొదలగునవి తగ్గించి వాడు కొనవలయును. అనగా మషాలా దినుసులు తగ్గించి వాడు కొనవలయును.
6 . మాంసాహారము విసర్జించుట మంచిది.మానలేనివారు వారమున కొకసారి లేక పది రోజులకొకసారి వాడు కొనవలయును.
7 . అతి చల్లని, అతి వేడి పదార్దములు వాడరాదు.
8 .గాలి వెలుతురు దారాళముగా ప్రసరించు ఇంటిలో నివసించవలయును .
9 . ప్రతి రోజు ఉదయం 4 .30 గం || లకు లేచి తన దినచర్యలు ప్రారంబించ వలయు
10 .మంచి వాతావరణము ఉన్నచోట నివాసయోగ్యము.
11 . ప్రతి రోజు కనీసము 6 గం || లు నిద్రించవలెను.
12 . పగటి నిదుర పనికి రాదు, రేయి నిదుర కాయరాదు.
13 . ప్రతి దినము ఉదయము 4 .30 గం ||ల నుండి 8 గం || ల మధ్య యోగ వ్యాయాయము చేయవలెను.
14 . చంటి పిల్లలు ప్రతి రోజు 8 గంటల నుండి 10 గంటలు, 12 గంటలు నిదురించవలయును.
15 . యోగ విద్య నభ్యసించు పురుషులు కట్ డ్రాయరు గాని, లంగోటా కాని వాడ రాదు. ప్రత్యేకముగా గోచీ గుడ్డ కుట్టించుకొని వాడవలయును .
16 .స్త్రీలు గర్భము దాల్చిన మూడు మాసముల తరువాత, ప్రసవించిన మూడు మాసముల వరకు యోగ విద్య నభ్యసించ రాదు. ఉదయము నడక మాత్రము చేయవలయును.
17 . మనిషికి రెండు ప్రక్కలు అనగా ఎడమ ప్రక్క, కుడి ప్రక్క. అందువల్ల ప్రతి భంగిమను రెండు ప్రక్కలు తప్పక చేయవలయును.
18 . యోగ భంగిమల నభ్యసించు నపుడు, కాళ్ళ నొప్పులు గాని, బెణుకులు గాని జరుగవచ్చును.అలాంటప్పుడు అభ్యసించుట మానరాదు. నెమ్మదిగా సమయము తగ్గించి అభ్యసిస్తే తొందరలో నివారణ యగును