మానవధర్మాలు
-
మనిషిని జీవింపచేసేవి -- నిగ్రహము, ప్రేమ, తృప్తి, త్యాగము.
- మనిషిని భాద పెట్టి దహించేవి -- అసూయ, అత్యాశ, ద్వేషం, పగ.
- జీవితానికి కీడు చేసేవి -- అహంకారం, అధికారం, అనాలోచన, నేను అనే అత్యాశ.
- జీవితంలో ఆశించకుడనివి -- అప్పు, యాచన.
- జీవితంలో చేయకుడనివి -- వంచన, దూషణ.
- విద్య నేర్పే గురువుకు కావలసినవి -- ఓర్పు, నమ్మకం, దైవభక్తి, ఔదార్యం.
- శిష్యుడికి కావలసినవి -- లక్ష్యం, సహనం, గురువుపై నమ్మకం, వినయం, విధేయత.
-
పరువు, ప్రతిష్టలకు భంగం కలిగించేవి -- వ్యామోహం, స్వార్ధం.
- వెళ్ళకూడని మార్గాలు -- ఒంటరితనం, అవినీతి, అధర్మం.
- ఆచరించి బోదించదగినవి -- నీతులు, సుద్దులు.
- నిత్యమూ ఆచరించదగినవి -- ధర్మమూ, దయా, దాక్షణ్యము.
- నిత్యమూ ఆలోచింపదగినవి -- సద్భావము, సమాజము, సమైక్యత.
- నియమంగా పాటించవలసినవి -- కరుణా, క్రమశిక్షణ, సమయపాలన.
- పూజింపదగినవారు -- తల్లి, తండ్రి, గురువు, దైవం, పరస్త్రీ.
-
నిత్యం చేయవలసిన ఆరాధనలు -- సత్యవ్రతము, మౌనవ్రతము.
- నిత్యం మనం ఎవరిని ఆదుకొనవలయును -- దీనులను, ఆపన్నులను.
- చేయకూడని పనులు -- చోరత్వము, వ్యబిచారము.
- పలుక కూడని మాటలు -- అశ్లీల పలుకులు, అశుభములు.
- నిత్యమూ కోరుకోవలసినవి -- అందరిక్షేమం.
- పనికిరాని పనులు -- పరనింద, పరవిమర్శన.
- చేసుకోవలసినవి -- ఆత్మవిమర్శ, ఆత్మరక్షణ.
- వదులుకొవలిసినవి -- ఆర్భాటం, ఆడంభరం, స్వోత్కర్ష.
- కాపాడుకోవలిసినవి -- ఆత్మాభిమానం, శీలం.
- నేర్చుకున్నది -- ఆవగింజంత.
నేర్చుకోవలిసినవి -- ఆకాశమంత.
- దైవద్యానానికి ఉండకూడనివి -- కోపం, చింత, వాంఛ, అపనమ్మకం.
- ఎదుటవారిని చేయకూడనివి -- ఆశ పెట్టుట, అవమానపరచుట.
- నమ్మకూడనివారు -- అసత్యవాదులు.
- నమ్మదగిన వారు -- తల్లి, దైవం.
- పట్టి పీడించేవి -- అనుమానం, అపనమ్మకం.
- కష్టాలను తొలగించేవి -- విజ్ఞానం, వివేకం.
- మర్చిపోకుండా చేయవలసినవి -- పరోపకారం, దైవచింతన.
- ఉండవలసిన విధానం -- ఆలోచన తక్కువ, ఆచరణ ఎక్కువ.
- భుజింపవలసినది -- మితాహరం(తక్కువ భోజనం).
- అభివృద్ధి పొందలేకపోవడానికి కారణం -- అలసత్వం, అలక్ష్యం, సమయపాలన లేకపోవడం, చిరునవ్వు లేకపోవడం.
- నేర్చుకోవలిసిన నీతి -- మంచిని చూడు, మంచిగా మాట్లాడు, మంచి విను, మంచి వారితో స్నేహం చేయు.
- ఉన్నతుడికి కావలసినవి -- భయం లేకపోవడం, భాద్యతగా వ్యవహరించడం, అందరికి భద్రత ఇవ్వడం.