శరన్నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం
తొమ్మిది రోజులు పూజ , ఆరాధన చెయ్యని, చెయ్యలేని వారు అష్టమి నవమి తిధులలో
అయినా అమ్మ ఆరాధన తప్పనసరిగా చెయ్యాలని శాస్త్రము చెప్తున్నది.
అష్టమికి ఉన్న ప్రత్యేకత ఎమిటి అంటే ఎప్పుడైనా సరే అమ్మవారిని ఆరాధించాలి కొన్ని ప్రత్యేకమైన తిధులు ఉన్నాయి...అవి అష్టమి,నవమి,చతుర్దశి, అమావాశ్య,పౌర్ణమి, ఈ తిధులను పంచమహాపర్వములు అని అంటారు, వీటిలో ఇప్పుడు అష్టమి అంటే మహాపర్వము అని అర్ధము.ఈ తిధులలో అరాధిస్తే అమ్మ ప్రీతి చెందుతుంది. కాని శరన్నవరాత్రులలో సప్తమి తో కూడిన అష్టమి పనికిరాదు. సూర్యోదయానికి అష్టమి తిధి ఉండాలి.
అశ్వినస్య చితాష్టమ్యాం అర్ధరాత్రేతు పార్వతి భద్రకాళి సముత్పన్నా పూర్వాషాడః సమాయుతే తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయగ్న వినాసిని ప్రాతుర్భూతా మహాఘోర యోగిని కోటివిస్సః
ఆశ్వియుజ శుద్ధ అష్టమి అర్ధరాత్రి వేళ అమ్మవారు భద్ర కాళి రూపేణ ఆవిర్భవించింది.
భద్రకాళి అంటే దక్షయగ్న వినాసనం కోసం, శివుని జటాజూటం నుండి వీరభద్రుని తో పాటు ఉద్భవించినటువంటి అమ్మ ! నవరాత్రులలో అష్టమి తిధికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడింది. మొత్తం తొమ్మిది రోజులు పూజ , ఆరాధన చెయ్యని, చెయ్యలేని వారు అష్టమి నవమి తిధులలో అయినా అమ్మ ఆరాధన తప్పనిసరిగా చెయ్యాలని శాస్త్రము చెప్తున్నది.
అష్టమి , నవమి తిధుల యందు అమ్మని దుర్గ గా , కాళి స్వరూపేణ పూజలు అందుకుంటుంది
సర్వవర్ణాల వారు ,సర్వ మతాల వారు , సకల జనుల వారు, సకల జనులు నిరభ్యంతరముగా ఉపాసించదగిన దేవత ఈ అమ్మ....దుర్గమ్మ! ఈ తల్లి సర్వజీవ అంతర్యామి. సంకటనాశిని. జగన్మాత, స్త్రీ, పురుష వయో భేదం లేకుండా సర్వులు ఉపాసించవలసిన పరాదేవత ఈ దుర్గమ్మ..
కామ బీజ స్వరూపిణి మహాకాళిగా, మాయా బీజ స్వరూపిణి మహాలక్ష్మిగా, వాగ్బీజ స్వరూపిణి మహాసరస్వతిగా దుర్గాదేవిని ధ్యానిస్తూ షట్కోణ సంయుక్తా అష్టదళ పద్మ - చతుద్వింశతి పత్రక - భూగృహ సమాయుక్త......ఇలాగ దుర్గమ్మను ధ్యానిస్తూ ఆరాధన చెయాలి.
సాలగ్రామములో కాని, మంగళకలశములో కాని, శ్రీ చక్రయంత్రములో కాని, దేవి ప్రతిమలో గాని, బాణ చిహ్నములో కాని, సూర్యుడిలో కాని....ఇలాగ ఎవరి ఆచారవిధానములబట్టి.....అమ్మ ని ఉపాసన చేయాలి.
జయాది శక్తియుతమైన పీఠములో దుర్గాదేవిని నిలిపి తూర్పు కోణములో సరస్వతి సమేత బ్రహ్మను, నైఋతి కోణములో లక్ష్మి సమేత మహా విష్ణువుని, వాయువ్య కోణములో పార్వతి సమేత పరమేశ్వరుడిని, దేవికి ఉత్తరముగా సింహాసనము, దక్షిణముగా మహిషాసురుడిని నిలిపి అర్చన చెయ్యాలి.
అనంతరం అష్టదళాలలో వరుసగా బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారహి, నారసిమ్హ, ఐంద్రి, చాముండికా రూపాలని ఆహ్వానించి అర్చన చెయ్యాలి.
దుర్గా స్తోత్రములు, అష్టొత్తరముతో పూజించాలి.
ఇలాగ మన శక్తి మేరకు అమ్మని పూజించి, ఆవిడ అనుగ్రహాన్ని పొందటానికి ప్రయత్నించాలి....
అమ్మని ఆరాధించడం వల్ల సర్వరోగాలు, సర్వ భయాలు తొలగి ఆయురారోగ్యాలు, ఐశ్వర్యాలు లభిస్తాయి. ధైర్యం వృద్ధి చెందుతుంది. దుఃఖం నశించి సుఖ సంతోషాలు వృద్ధి చెందుతాయి. ఇహంలో సౌఖ్యం, పరంలో మోక్షం సిద్ధిస్తాయి.