Click Here http://vinaymayurhoney.boosterblog.net to Rate This Blog
కామం అంటే ఏమిటి? దీనిని మనం ఎందుకు జయించాలి? దీన్ని జయించడం వలన మనకు
కలిగే ప్రయోజనాలేంటి? మొదట కామం అంటే ఏమిటో తెలుసుకుందాం. కామం అనగానే చాలా
మందికి చాలా భావనలు ఉంటాయి. ఇంకా కొందరు ఏవేవో కూడా ఊహించుకుంటారు.అసలు
కామం అంటే కోరిక అని మాత్రమే అర్థం. అంటే మన మనసులో కావాలి అని కలిగే
ప్రతిదీ కూడ కోరికే. అంటే ఉదాహరునకు మంచి ఉద్యోగం, మంచి భార్య, మంచి భర్త,
బాగా సంపాదించాలి ఇలా ప్రతిదీ కోరికే అంతేగాక మీరు ఊహించుకునే ఏవేవో భావనలు
అన్నీ కూడా అందులో ఒకే ఒక భాగం మాత్రమే అంతే తప్ప కామం అంటే ఏవేవో కాదు.
సరే ఈ కోరికలు వుండడం వలన ఏమవుతుంది? ఎవరికైనా పుట్టిన ప్రతి మనిషికి
కోరికలు వుండడం సహజం కదా. కోరికలు ఉంటే ఏమవుతుంది. మనకు కావలసినవి అన్నీ
కావాలి కదా మరి? లేకపోతే ఎలా బ్రతికేది అని చాలా మందికి సందేహం కూడ
వుంటుంది. అవును కదండీ మరి. కోరికలు వుండాలి కాని దానికి ఒక పరిమితి
ఉండాలి. అంతే కాని అత్యాస ఉండకూడదు. కాని ఇక్కడ వచ్చిన ఒక చిక్కు సమస్య అంత
ఏమిటంటే కామాన్ని జయిస్తే గాని మనం ఆధ్యాత్మికంగా ముందుకు అడుగువేయలేము. ఆ
విధంగా ఆలోచిస్తే దీనిని జయించడమే మేలు అని అనిపిస్తుంద.